boAt Airdopes ProClip: మీరు చెవుల్లో ఇయర్‌బడ్స్ పెట్టుకుని గంటల తరబడి పాటలు వింటూ ఉంటే.. చెవులు నెప్పి పుడుతున్నాయా? లేదా చుట్టూ జరిగే విషయాలు తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు బోట్ (boAt) తెచ్చిన సరి కొత్త boAt Airdopes ProClip మంచి చాయిస్ కావచ్చు! చాలా తక్కువ బడ్జెట్‌లో “క్లిప్-ఆన్ ఓపెన్-ఇయర్” డిజైన్‌తో వచ్చి ట్రెండింగ్ కాంబోగా మారింది. చెవిలోకి దూరిపోకుండా, కేవలం బయటి నుంచి క్లిప్ అయ్యే ఈ డిజైన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కేవలం రూ. 1,599లకే అందుబాటులోకి వచ్చిన ఈ బడ్స్ ఎలాంటి ఫీచర్లు కలిగి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
boAt Airdopes ProClip ఫీచర్లు:
1. డిజైన్ & కంఫర్ట్:
ఈ బడ్స్ చెవి రంధ్రంలోకి.. వెళ్లవు, బదులుగా చెవి వెలుపలి భాగానికి క్లిప్ లాగా అమరుతాయి. ఒక్కో ఇయర్ బడ్ బరువు కేవలం 4.6 గ్రాములు మాత్రమే. మెటాలిక్ ఫినిషింగ్, ట్రెండీ కలర్స్ (వెల్వెట్ వైన్, సిల్క్ గ్రే, శాటిన్ వైట్) లలో దొరుకుతుంది. రన్నింగ్ లేదా జిమ్ చేస్తున్నప్పుడు కిందపడిపోకుండా గ్రిప్ ఇస్తుంది. అంతే కాకుండా చెమట లేదా చిన్నపాటి నీటి చినుకులకు ఏమీ కాకుండా స్వెట్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.
2. సౌండ్ క్వాలిటీ:
ఇందులో 12mm డైనమిక్ డ్రైవర్లు, ఎయిర్ కండక్షన్ టెక్నాలజీ ఇచ్చారు. పాటల్లోని వోకల్స్ (పాటల పదాలు), పాడ్‌కాస్ట్‌లు చాలా స్పష్టంగా వినపడతాయి. ఓపెన్-ఇయర్ డిజైన్ కావడంతో చుట్టు పక్కల శబ్దాలు (ట్రాఫిక్, తోటివారి మాటలు)ఈజీగా తెలుస్తాయి. ఇది రోడ్డుపై ప్రయాణించేటప్పుడు రక్షణగా ఉంటుంది. మీ పాటలు బయట ఉన్న వారికి పెద్దగా వినిపించకుండా.. ఇయర్ క్యానల్ వైపు సౌండ్ డైరెక్ట్ చేస్తుంది.
3. బ్యాటరీ లైఫ్ & ఛార్జింగ్:
ఈ ఇయర్‌బడ్స్ బ్యాటరీ విషయంలో.. మిమ్మల్ని అస్సలు నిరాశపరచవు. కేస్‌తో కలిపి దాదాపు 52 గంటల ప్లేబ్యాక్ ఇస్తుంది. టైప్-సి పోర్ట్ సాయంతో కేవలం 10 నిమిషాల ఛార్జ్‌తో దాదాపు 3 గంటలకు పైగా (200 నిమిషాలు) ప్లే టైమ్ కూడా పొందొచ్చు.
4. కనెక్టివిటీ & కాలింగ్ ఎక్స్‌పీరియన్స్:
ఫాస్ట్, వేవరింగ్ లేని కనెక్టివిటీ అందిస్తుంది. ఒకేసారి లాప్‌టాప్, ఫోన్ రెండు డివైజ్‌లకు కనెక్ట్ అయి ఈజీగా స్విచ్ అవ్వొచ్చు. అంతే కాకుండా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని తగ్గించి అవతలి వారికి మీ వాయిస్ క్లియర్‌గా వెళ్లేలా చేస్తుంది. గేమింగ్ ఆడేవారి కోసం 55ms లో-లేటెన్సీ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
ధర :
దీని ఆఫర్ ధర రూ. 1,599 (ఈ-కామర్స్ సైట్ ఆఫర్లను బట్టి ధర రూ. 1,599 నుంచి రూ. 1,799 వరకు ఉంటుంది). ఇది బోట్ అధికారిక వెబ్‌సైట్ , ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో లభిస్తుంది.
లాభాలు:
చుట్టుపక్కల వాతావరణంపై పూర్తి అవగాహన ఉండటం వల్ల సేఫ్టీ పెరుగుతుంది.
52 గంటల బ్యాటరీ లైఫ్ , ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
చెవి లోపల నొప్పులు లేని 4.6 గ్రాముల లైట్‌వెయిట్ డిజైన్ ఉంటుంది.
అప్‌డేటెడ్ బ్లూటూత్ 6.0, మల్టీ-డివైజ్ పేరింగ్ ఫీచర్లు దీని స్పేషాలిటీ.
Also Read: మతిపోయే ఫీచర్లతో కొత్త వాషింగ్ మెషీన్స్.. ఆఫర్ పోతే మళ్లీ రాదు
పరిమితులు:
హెవీ బేస్ ఇష్టపడేవారికి బేస్ కొంత తక్కువగా అనిపించవచ్చు.
ఫుల్ సౌండ్ పెట్టినప్పుడు పక్కనున్న వారికి లీకేజ్ సౌండ్ వినబడే అవకాశం ఉంటుంది.
యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఇందులో ఉండదు.
రూ. 2,000 లోపు బడ్జెట్‌లో రోజంతా ఈజీగా వాడుకోవడానికి, జిమ్ చేసేటప్పుడు, ఆఫీస్ కాల్స్, రెగ్యులర్ వాడకానికి boAt Airdopes ProClip చాలా మంచి బెస్ట్. ఇన్-ఇయర్ బడ్స్ పడని వారికి, సరికొత్త ఓపెన్-ఇయర్ ట్రెండ్‌ను ట్రై చేయాలనుకునే వారికి ఇది వర్త్-ఇట్ ప్రొడక్ట్.