E-Paper
Advertisement

రూ. 2,499 కే అదిరిపోయే స్మార్ట్ రింగ్.. boAt SmartRing Active ఫీచర్లు చూశారా?

రూ. 2,499 కే అదిరిపోయే స్మార్ట్ రింగ్.. boAt SmartRing Active ఫీచర్లు చూశారా?
Advertisement

BoAt SmartRing Active: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌వాచ్‌లు కామన్ అయిపోయాయి. అందుకే యూత్ ఇప్పుడు కొత్త ట్రెండ్ వైపు చూస్తున్నారు. అదే ‘స్మార్ట్ రింగ్’. ప్రముఖ బ్రాండ్ boAt తన సరి కొత్త SmartRing Active ను మార్కెట్లోకి తెచ్చింది. కేవలం రూ. 2,499 కే లభించే ఈ రింగ్, చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. మీ ఆరోగ్యాన్ని నిరంతరం కని పెట్టుకుంటుంది. ఫ్యాషన్, టెక్నాలజీని ఇష్టపడే కుర్రకారుకు ఇది ఒక క్రేజీ గ్యాడ్జెట్ అని చెప్పవచ్చు. దీని ఫీచర్లు, పెర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

స్మార్ట్‌వాచ్ బోర్ కొట్టిందా? అయితే ఈ ‘స్మార్ట్ రింగ్’ పై ఒక లుక్కేయండి!

Advertisement

గ్యాడ్జెట్స్ ప్రపంచంలో రోజూ ఏదో ఒక కొత్త మార్పు వస్తూనే ఉంటుంది. ఒకప్పుడు కేవలం ఫోన్లకు పరిమితమైన టెక్నాలజీ.. వాచ్‌లను దాటి ఇప్పుడు మన వేలికి తొడిగే ఉంగరం వరకు వచ్చేసింది. బడ్జెట్ ధరలో క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇచ్చే boAt, ఈసారి స్మార్ట్ రింగ్ సెగ్మెంట్‌లోకి మాస్ ఎంట్రీ ఇచ్చింది.

డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ.. లుక్ అదిరింది
ఈ boAt SmartRing Active ను ప్రీమియం మెటల్ బాడీతో తయారు చేశారు. మిడ్‌నైట్ బ్లాక్ కలర్‌లో వచ్చే ఈ రింగ్ చాలా స్లిమ్‌గా, తేలికగా ఉంటుంది. మీరు ఫార్మల్ డ్రెస్ వేసినా లేదా క్యాజువల్ జీన్స్ వేసినా.. ఇది మీ వేలికి ఒక ప్రత్యేకమైన లుక్‌ని ఇస్తుంది. ఆడవారు, మగ వారు ఎవరైనా దీనిని వాడొచ్చు. ఇది నీటిలో పాడైపోతుందేమో అన్న భయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఇది 50 మీటర్ల లోతు వరకు వాటర్ రెసిస్టెంట్ సామర్థ్యం కలిగి ఉంది.

Advertisement

హెల్త్ ఫీచర్స్:
పరిమాణం చిన్నదైనా.. ఇందులో స్మార్ట్‌వాచ్‌లో ఉండే అన్ని ముఖ్యమైన హెల్త్ ఫీచర్లు ఉన్నాయి.

హార్ట్ రేట్ మానిటర్: మీ గుండె కొట్టుకునే వేగాన్ని 24/7 ట్రాక్ చేస్తుంది.

SPO2 మానిటర్: రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.

స్లీప్ ట్రాకింగ్: మీరు రాత్రిపూట ఎంతసేపు గాఢనిద్రలో ఉన్నారో, మీ నిద్ర నాణ్యత ఎలా ఉందో ఇది తెలియజేస్తుంది.

స్టెప్ కౌంటర్: రోజంతా మీరు ఎన్ని అడుగులు వేశారు. ఎన్ని క్యాలరీలు ఖర్చు చేశారో మీ ఫోన్ యాప్ ద్వారా చూడొచ్చు.

బ్యాటరీ, కనెక్టివిటీ:
ఈ రింగ్ బ్లూటూత్ v5.0 టెక్నాలజీతో పని చేస్తుంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ డివైజ్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. సుమారు 5 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో లిథియం పాలిమర్ బ్యాటరీని వాడారు. కాబట్టి ఇది త్వరగా ఛార్జ్ అవ్వడమే కాకుండా ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది.

Also Read:  ఆపిల్,శామ్సంగ్‌లకు వణుకు.. ఒప్పో Find X9 సిరీస్ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

ధర:
మార్కెట్లో ఇప్పటికే సామ్సంగ్ వంటి బ్రాండ్లు స్మార్ట్ రింగ్స్ తెచ్చినప్పటికీ.. వాటి ధర వేలల్లో (రూ. 30,000 పైమాటే) ఉంటుంది. కానీ boAt కేవలం రూ. 2,499 కే దీనిని లాంచ్ చేసి సామాన్యులకు కూడా స్మార్ట్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది.

మీరు స్మార్ట్‌వాచ్‌లను చేతికి వాడటానికి ఇబ్బంది పడుతున్నా.. లేదా మీ స్టైల్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాలనుకున్నా ఈ boAt SmartRing Active బెస్ట్ ఛాయిస్. తక్కువ ధరలో ఫ్యాషన్, హెల్త్ ట్రాకింగ్ కావాలనుకునే యూత్‌కి ఇది ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్ అని చెప్పవచ్చు. ఆన్‌లైన్ స్టోర్లలో ఇది అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీ సైజు చెక్ చేసుకుని ఆర్డర్ చేసేయండి.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×