E-Paper
Advertisement

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ
Advertisement

BoAt Stone 350 Pro Plus Soundbar: మ్యూజిక్ అనేది మన జీవితంలో ఒక భాగం. ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నప్పుడు లేదా ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడుపుతున్నప్పుడు మంచి పాటలు వింటే ఆ ఉత్సాహమే వేరు. అయితే.. పెద్ద పెద్ద స్పీకర్లను ఎక్కడికైనా మోసుకెళ్లడం కష్టం. అందుకే.. అందరూ కాంపాక్ట్ సైజులో ఉండే పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్లను కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మార్కెట్లో.. ఎన్నో ఆప్షన్లు ఉన్నప్పటికీ, నమ్మకానికి మారుపేరైన ‘బోట్’ సంస్థ నుంచి వచ్చిన తాజా మోడల్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. దీని ధర కేవలం రూ. 1,699 మాత్రమే ఉండటంతో యూత్ ఈ స్పీకర్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.

పూర్తి ఫీచర్లు: 

డిజైన్, లుక్స్ :
ఈ స్పీకర్ డిజైన్ చాలా స్టైలిష్‌గా, రగ్గడ్‌గా ఉంటుంది.’టైటానియం గ్రే’ కలర్ ఫినిషింగ్‌తో.. వస్తున్న ఈ డివైస్ చూడటానికి చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. ఇది చాలా కాంపాక్ట్ సైజులో ఉండటం వల్ల దీన్ని ఈజీగా మీ బ్యాగ్‌లో వేసుకోవచ్చు లేదా చేతిలో పట్టుకుని ఎక్కడికైనా తీసుకువెళ్లొచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ చాలా క్వాలిటీతో ఉండి, ట్రావెలింగ్ చేసేవారికి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది.

Advertisement

సౌండ్ పవర్ , సౌండ్ :
చిన్న సైజులో ఉన్నప్పటికీ.. ఈ స్పీకర్ సౌండ్ విషయంలో.. ఎక్కడా రాజీపడదు. ఇది ఏకంగా 16W పవర్ అవుట్‌ పుట్ కలిగిన ‘బోట్ సిగ్నేచర్ సౌండ్’ను అందిస్తుంది. పాటలు వింటున్నప్పుడు బీట్స్ చాలా స్పష్టంగా , హెవీ బేస్‌తో దద్దరిల్లిపోతాయి. మీరు అవుట్‌డోర్ పార్టీల్లో.. లేదా రూమ్‌లో మ్యూజిక్ ప్లే చేసినప్పుడు మంచి థియేటర్ లేదా పబ్ ఫీల్ కలుగుతుంది.

TWS టెక్నాలజీ :
ఈ స్పీకర్‌లో ఉన్న మరో అద్భుతమైన ఫీచర్.. TWSసపోర్ట్. మీ దగ్గర ఇలాంటి మరో బోట్ స్టోన్ స్పీకర్ ఉంటే, రెండింటినీ ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని వల్ల సౌండ్ పవర్ రెట్టింపవుతుంది , పెద్ద పార్టీల సమయంలో ఇది మరింత ఎక్కువగా ఉపయోగపడుతుంది.

Advertisement

బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ :
మ్యూజిక్ లవర్స్‌ని ఎక్కువగా ఆకట్టుకునే అంశం దీని బ్యాటరీ బ్యాకప్. ఈ స్పీకర్ ఒక్కసారి.. ఫుల్ ఛార్జ్ చేస్తే.. సుమారు 8 గంటల వరకు మ్యూజిక్ టైమ్‌ను అందిస్తుంది. అంటే.. మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా రోజంతా పాటలను ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా.. చాలా ఇది వేగంగా ఛార్జ్ అయ్యే టైప్ సి చార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది.

Also Read: బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

వాటర్ రెసిస్టెన్స్,ఇతర ఫీచర్లు:
బయట ట్రిప్స్‌కి లేదా బీచ్‌కి వెళ్లినప్పుడు.. నీటి తుంపర్లు పడితే.. స్పీకర్ పాడైపోతుందనే టెన్షన్ అవసరం లేదు. ఇది IPX5 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది. కాబట్టి చిన్నపాటి నీటి చుక్కలు లేదా చెమట తగిలినా ఏమీ కాదు. అలాగే ఇందులో.. అంతర్నిర్మిత మైక్రోఫోన్.. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్ కాల్స్ మాట్లాడటం చాలా ఈజీ అవుతుంది.

ధర :
ప్రస్తుతం మార్కెట్‌లో.. ఈ బ్లూటూత్ స్పీకర్ ధర కేవలం రూ. 1,699 గా ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అలాగే బోట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇది అందుబాటులో ఉంది.

రూ.2,000 లోపు బడ్జెట్‌లో అదిరిపోయే.. లుక్, 16 వాట్ల పవర్‌ఫుల్ సౌండ్, 8 గంటల బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఈ మోడల్ ఒక అద్భుతమైన ఆప్షన్. మీ ప్రయాణాలను మరింత ఆనందంగా మార్చుకోవడానికి దీన్ని తప్పకుండా కొనండి.

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×