Acer TravelLite T24-54M review: ప్రస్తుత రోజుల్లో ల్యాప్‌టాప్ అనేది ప్రతీ ఒక్కరికీ ఇదొక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. స్టూడెంట్స్ ఆన్‌లైన్ క్లాసులు వినడానికి, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి లేదా ఆఫీస్ పనులు చేసుకోవడానికి ఒక మంచి ల్యాప్‌టాప్ కచ్చితంగా ఉండాలి. అయితే.. మార్కెట్లో వేలకొద్దీ ల్యాప్‌టాప్‌లు ఉన్నప్పటికీ.. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ పర్ఫామెన్స్ అందించే మోడల్ దొరకడం కొంచెం కష్టమే. అలాంటి వారి కోసం ఏసర్ సంస్థ మార్కెట్‌లోకి తీసుకువచ్చిన లేటెస్ట్ మోడలే.. ఈ ల్యాప్ లాప్. ఇది సామాన్య యూజర్ల అవసరాలను దృష్టిలో.. ఉంచుకుని అత్యంత పర్ఫెక్ట్‌గా దీనిని డిజైన్ చేసారు.
ఈ ల్యాప్‌టాప్ డిజైన్ చాలా సింపుల్‌గా , ప్రొఫెషనల్‌గా ఉంటుంది. చూడటానికి చాలా సన్నగా , బరువు తక్కువగా ఉండటంతో బ్యాగ్‌లో వేసుకుని ఎక్కడికైనా ఈజీగా మోసుకెళ్లొచ్చు. దీని బాడీ బెస్ట్ క్వాలిటీ కలిగి ఉండి, ఎక్కువ కాలం పాడవకుండా ఉండేలాగా తయారు చేయబడింది. ఆఫీస్ మీటింగ్స్‌కి లేదా కాలేజీకి తీసుకెళ్లడానికి దీని లుక్స్ చాలా డిసెంట్‌గా ఉంటాయి.
వీడియోలు చూసేటప్పుడు లేదా ఎక్కువ సేపు డాక్యుమెంట్లు.. చదివేటప్పుడు కంటికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. ఇందులో మంచి క్వాలిటీ గల డిస్‌ప్లేను అందించారు. బ్రైట్‌నెస్ , కలర్ ఆక్యూరసీ బాగుండటం వల్ల సినిమాలు చూసేటప్పుడు లేదా ఆన్‌లైన్ మీటింగ్స్‌లో విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి.
ఈ ల్యాప్‌టాప్ మెయిన్ హైలైట్ దీని పర్ఫామెన్స్. రోజువారీ చేసే పనులైన ఎంఎస్ ఆఫీస్ , బ్రౌజింగ్, మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసి పనిచేయడం, జూమ్ లేదా గూగుల్ మీట్ కాల్స్ మాట్లాడటం.. వంటి వాటిని ఇది ఎక్కడా లాగ్ అవ్వకుండా చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది. స్టూడెంట్స్ , ప్రొఫెషనల్స్ తమ సాధారణ వర్క్‌ను ఎలాంటి ఇబ్బంద లేకుండా పూర్తి చేయడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
Also Read: పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!
రోజంతా బయట తిరిగే వారికి లేదా కరెంట్ కట్ అయినప్పుడు.. బ్యాటరీ బ్యాకప్ చాలా ముఖ్యం. ఈ ల్యాప్‌టాప్ డీసెంట్ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. తద్వారా మీరు పనులకు ఎలాంటి అడ్డంకి లేకుండా కొంత సమయం వరకు ఛార్జర్ లేకుండానే.. పని చేసుకోవచ్చు. ఇది కాకుండా అవసరమైన అన్ని రకాల పోర్ట్‌ల, వైర్‌లెస్ కనెక్టివిటీ ఆప్షన్లను కలిగి ఉంది.
ఈ మోడల్ ల్యాప్‌టాప్ ధర మార్కెట్లో.. దీని వేరియంట్లు , లభించే ఆఫర్లను బట్టి మారుతుంటుంది. సాధారణంగా మధ్యతరగతి ప్రజలకు, స్టూడెంట్స్‌కి అందుబాటులో.. ఉండే బడ్జెట్ ధరలోనే ఇది లభిస్తుంది. ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లు లేదా ఏసర్ అధికారిక స్టోర్లలో దీనికి సంబంధించిన సరైన ధర వివరాలను చెక్ చేసుకోవచ్చు.
ఎక్కువ బడ్జెట్ పెట్టలేము అనుకునేవారికి.. రోజువారీ ఆఫీస్, అవసరాలను తీర్చే ఒక మంచి ల్యాప్‌టాప్ కావాలనుకునే వారికి ఈ మోడల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీ పనులను బాగా పూర్తి చేస్తుంది.