E-Paper
Advertisement

BoAt Wave Elevate vs Fire-Boltt Ninja : యూత్ ఫేవరెట్ స్మార్ట్‌వాచ్‌లు.. రూ. 2 వేల లోపే ఇన్ని మంచి ఫీచర్లా ? బాబోయ్..

BoAt Wave Elevate vs Fire-Boltt Ninja : యూత్ ఫేవరెట్ స్మార్ట్‌వాచ్‌లు.. రూ. 2 వేల లోపే ఇన్ని మంచి ఫీచర్లా ? బాబోయ్..
Advertisement

BoAt Wave Elevate vs Fire-Boltt Ninja: ప్రస్తుతం మార్కెట్‌లో స్మార్ట్‌వాచ్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్ ఇచ్చే వాచ్‌ల కోసం యూత్ ఎగబడుతున్నారు. ఈ రేసులో boAt Wave Elevate, Fire-Boltt Ninja టాప్‌లో ఉన్నాయి. చూడటానికి ఆపిల్ వాచ్‌లా అనిపించే డిజైన్, అదిరిపోయే ఫీచర్లతో ఈ రెండు వాచ్‌లు పోటీ పడుతున్నాయి. మరి వీటిలో ఏది బెస్ట్ ? దేనిలో ఫీచర్లు ఎక్కువ ? తక్కువ ధరలో ఎక్కువ లాభం ఇచ్చే వాచ్ ఏది? ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడాలేంటో ఇప్పుడు చూద్దాం.

1. డిజైన్, డిస్‌ప్లే:

Advertisement

boAt Wave Elevate: ఇది చూడటానికి ఐకానిక్ ఆపిల్ వాచ్ అల్ట్రాను పోలి ఉంటుంది. దీనిలో 1.96 అంగుళాల పెద్ద HD డిస్‌ప్లే ఉంది. మెటాలిక్ బాడీ, ఫంక్షనల్ క్రౌన్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తాయి.
Fire-Boltt Ninja: ఇందులో సాధారణంగా 1.69 నుంచి 1.83 అంగుళాల డిస్‌ప్లే (మోడల్‌ను బట్టి) ఉంటుంది. ఇది కూడా స్టైలిష్‌గా ఉన్నప్పటికీ.. బోట్ వాచ్ అల్ట్రా లుక్ ఇవ్వడంలో కొంచెం ముందుంటుంది.

2. బ్లూటూత్ కాలింగ్:

Advertisement

రెండు వాచ్‌లలోనూ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంది. అంటే మీరు వాచ్ నుంచే ఫోన్ మాట్లాడవచ్చు.

boAt: ఇందులో మైక్ , స్పీకర్ క్వాలిటీ చాలా బాగుంది. డయల్ ప్యాడ్ వేగంగా స్పందిస్తుంది.

Fire-Boltt: ఇందులో కూడా కాల్స్ మాట్లాడవచ్చు. కానీ నెట్‌వర్క్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు వాయిస్ క్లారిటీలో చిన్న తేడా రావచ్చు.

3. హెల్త్ , ఫిట్‌నెస్ ట్రాకింగ్:

యూత్ ఎక్కువగా ఇష్టపడే ఫీచర్లు ఇవే..

హార్ట్ రేట్ మానిటర్: రెండు వాచ్‌లలో రక్తం లోని ఆక్సిజన్ స్థాయిలను, హార్ట్ బీట్ కొలిచే సెన్సార్లు ఉన్నాయి.

స్పోర్ట్స్ మోడ్స్: ఫైర్-బోల్ట్ సాధారణంగా 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇస్తుంది. బోట్ కూడా దాదాపు 50+ మోడ్స్‌తో గట్టి పోటీ ఇస్తుంది.

స్లీప్ ట్రాకింగ్: నిద్ర నాణ్యతను కూడా ఈ రెండు వాచ్‌లు ట్రాక్ చేస్తాయి.

4. బ్యాటరీ లైఫ్:

ఏ స్మార్ట్‌వాచ్ అయినా ఛార్జింగ్ ఎక్కువ కాలం రావాలి.

boAt Wave Elevate: కాలింగ్ ఫీచర్ వాడితే 2 రోజులు, నార్మల్‌గా వాడితే 5-7 రోజుల బ్యాటరీ ఇస్తుంది.

Fire-Boltt Ninja: ఇది కూడా దాదాపు 5 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. అయితే ఛార్జింగ్ స్పీడ్ విషయంలో బోట్ కొంచెం మెరుగ్గా ఉంటుంది.

Also Read: వాలెంటైన్స్ డే అదిరిపోయే ఆఫర్స్.. ఐఫోన్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్‌పై వేలల్లో డిస్కౌంట్లు!

5. ధర, వారంటీ:

ధర విషయంలో ఈ రెండు కంపెనీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడతాయి.

సాధారణంగా ఈ రెండు వాచ్‌లు రూ.1,499 నుంచిరూ. 2,499 మధ్యలో అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తాయి. ఆఫర్ల సమయంలో ఇంకా తక్కువకు వచ్చే అవకాశం ఉంది.

రెండింటికీ ఏడాది మాన్యుఫ్యాక్చరింగ్ వారంటీ ఉంటుంది.

ఏది కొంటే బెటర్?
మీకు “Apple Watch Ultra” లుక్ కావాలి అనుకుంటే boAt Wave Elevate బెస్ట్ ఛాయిస్. అలా కాకుండా.. సింపుల్ లుక్ ,ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్ కావాలి అనుకుంటే Fire-Boltt Ninja కొనండి. అయితే.. కస్టమర్ సర్వీస్ విషయంలో బోట్ ఇండియా వ్యాప్తంగా కొంచెం మెరుగైన నెట్‌వర్క్ కలిగి ఉంది.

Related News

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

Big Stories

Advertisement
×