E-Paper
Advertisement

Takshakudu: ఆనంద్ దేవరకొండ తక్షకుడు టీజర్ అప్డేట్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Takshakudu: ఆనంద్ దేవరకొండ తక్షకుడు టీజర్ అప్డేట్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

Takshakudu: ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్నారు ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దొరసాని, పుష్పక విమానం బేబి వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా విభిన్నమైన కథ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) ఈసారి ఫుల్ మాస్ లుక్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ తక్షకుడు(Takshakudu) అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో ప్రసార కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా స్ట్రీమింగ్ గురించి చిత్రం బృందం అధికారకంగా ప్రకటించారు.

రగ్గడ్ లుక్ లో ఆనంద్ దేవరకొండ…

ఈ సినిమా నెట్ ఫ్లిక్స్(Net Flix) లో ప్రసారం కాబోతోందని చిత్ర నిర్మాతలు తెలియజేశారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఆనంద్ దేవరకొండ ఫస్ట్ లుక్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఈ పోస్టర్ లో ఈయన రగ్గడ్ లుక్ లో కనిపించారు. కళ్ళల్లో కోపం చేతిలో తుపాకీతో ఈయన లుక్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ పోస్టర్ కు వేటగాడి చేతిలో జింక పిల్లలే నేరస్తులు అనే ట్యాగ్ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరొక కీలక అప్డేట్ విడుదల చేశారు.

నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం…

Advertisement

ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు. ఈ టీజర్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతోందని తెలుస్తోంది అయితే టీజర్ విడుదల సమయాన్ని మాత్రం ప్రకటించలేదు. తాజాగా టీజర్ విడుదల గురించి చిత్ర బృందం అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు కూడా టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు వినోద్ అనంటోజు దర్శకత్వం వహించగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

Advertisement

ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండకు జోడిగా నితాన్షి గోయల్ నటిస్తున్నారు. ఈ సినిమా డార్క్ మైథలాజికల్ సర్వైవల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. ఇలా కెరియర్ మొదటి నుంచి కూడా సరికొత్త విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ మంచి సక్సెస్ అందుకుంటున్న ఆనంద్ దేవరకొండకు తక్షకుడు సినిమా ద్వారా మరొక హిట్ రావడం గ్యారెంటీ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా నేరుగా థియేటర్లో కాకుండా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతుందని చెప్పినప్పటికీ ఎప్పుడు విడుదలవుతుందనే విషయాల గురించి సరైన సమాచారం తెలియజేయలేదు. త్వరలోనే విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తుంది. ఇక ఆనంద్ దేవరకొండ చివరిగా గం గం గణేశా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించుకున్నారు.

Also Read: Allu Shirish: ఇక్కడ కూడా బన్నీని ఫాలో అవుతున్న శిరీష్.. పెళ్లి విషయంలో అన్నను కాపీ కొట్టిన తమ్ముడు

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×