Bosch 7 kg Front Load Washing Machine: ఇంటి పనుల్లో అత్యంత విసుగు కలిగించే బట్టలు ఉతికే.. పనిని క్షణాల్లో పూర్తి చేయడానికి, ఫ్యాబ్రిక్‌ను ఎంతో ఈజీగా కాపాడే ప్రీమియం వాషింగ్ మెషీన్ కొనేందుకు సరైన సమయం వచ్చేసింది! జర్మన్ ఇంజనీరింగ్‌కి.. కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాష్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ మోడల్ ఇప్పుడు కళ్లు చెదిరే ఆఫర్‌లో లభిస్తోంది. ఎంఆర్‌పి రూ.48,990 ఉండే ఈ బెస్ట్ డివైజ్‌పై ఏకంగా 44% భారీ డిస్కౌంట్ అందుతోంది! ఆఫర్‌లో భాగంగా కేవలం రూ. 26,990 మైండ్ బ్లోయింగ్.. ధరకే ఇది లభిస్తోంది. ఈ సూపర్ హోమ్ అప్లయెన్స్ పూర్తి ..స్పెసిఫికేషన్లు, పర్ఫార్మెన్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం!
బాష్ వాషింగ్ మెషీన్‌లలో బెస్ట్ దీని మోటార్ సిస్టమ్. ఇందులో అందించిన ‘EcoSilence Drive’ ఇన్వర్టర్ మోటార్ ఎంతో నిశ్శబ్దంగా పని చేస్తుంది. మెషీన్ వేగంగా తిరుగుతున్నప్పుడు కూడా విపరీతమైన సౌండ్ రాకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇది కరెంట్ ఖర్చును చాలా వరకు తగ్గించడమే కాకుండా.. ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. ఈ మోటార్‌పై బేష్ ఎక్కువ కాలం వారంటీని కూడా అందిస్తుంది.
ఈ మోడల్ మెయిన్ హైలైట్ దీనిలో ఉన్న ఇన్-బిల్ట్ హీటర్ సిస్టమ్. ఇది నీటిని వేడి చేసి బట్టలపై ఉన్న మొండి మరకలను, నూనె జిడ్డును తేలికగా వదిలిస్తుంది. వర్షాకాలంలో లేదా చలికాలంలో వేడి నీటితో బట్టలు ఉతకడం వల్ల బట్టలు చెడు వాసన రాకుండా.. ఎంతో తాజాగా ఉంటాయి. అలాగే దీని ఆవిరి ఫీచర్ బట్టలలో దాగి ఉండే 99.9% అలర్జీ కలిగించే క్రిములు, బ్యాక్టీరియాలను పూర్తిగా నశింపజేస్తుంది. పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లకు ఈ ఫీచర్ బెస్ట్ అని చెప్పొచ్చు.
చాలా సాధారణ వాషింగ్ మెషీన్లలో.. బట్టలు ఒకదానికొకటి చిక్కుకుని క్వాలిటీ దెబ్బతింటాయి. కానీ బాష్ వాషింగ్ మెషీన్‌లో ‘VarioDrum’ టెక్నాలజీని.. అమర్చారు. డ్రమ్ పై ఉండే.. ప్రత్యేకమైన చుక్కలు , వేవ్ డిజైన్ వల్ల బట్టలు ఈజీగా ఉతుకుతాయి. దీని వల్ల బట్టల కాటన్, సిల్క్ లేదా జీన్స్ ఫ్యాబ్రిక్ అస్సలు పాడవదు. దీనిలోని ‘Anti-Tangle’ ఫీచర్ బట్టలు ముడుతలు పడకుండా, చిక్కుపడకుండా బయటకు తీయడానికి సహాయ పడుతుంది.
మీరు అత్యవసరంగా బయటకు వెళ్లాలా? బట్టలు త్వరగా ఉతకాలా? అయితే దీనిలోని ‘SpeedPerfect’ ఆప్షన్ మీకు బాగా ఉపయోగ పడుతుంది. ఇది బట్టల శుభ్రతలో ఎలాంటి రాజీ పడకుండానే ఉతికే సమయాన్ని ఏకంగా 65% వరకు తగ్గిస్తుంది. కేవలం.. కొన్ని నిమిషాల్లోనే మీ బట్టలు స్వచ్ఛంగా, మెరుస్తూ రెడీ అయిపోతాయి. తక్కువ సమయంలో .. ఎక్కువ బట్టలు ఉతకడానికి ఇది సూపర్‌గా వర్క్ అవుతుంది.
ఈ 7 కేజీ ఫ్రంట్ లోడ్ మెషీన్ 3 నుంచి 4 మంది సభ్యులు ఉన్న కుటుంబానికి సరిగ్గా సరి పోతుంది. ఇది బెస్ట్ 5-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది. కాబట్టి కరెంట్ బిల్లు గురించి ఎలాంటి భయం ఉండదు. దీనిలోని ‘ActiveWater Plus’ టెక్నాలజీ బట్టల బరువును, ఫ్యాబ్రిక్ రకాన్ని బట్టి ఎంత నీరు అవసరమో అంత మాత్రమే వాడుకుంటుంది. దీని వల్ల నీరు, కరెంట్ రెండూ చాలా వరకు ఆదా అవుతాయి.
Also Read: రూ.2,099కే ల్యాప్‌టాప్ ఛార్జ్ చేసే..పవర్‌ఫుల్ పవర్ బ్యాంక్!
ఇండియన్ మార్కెట్లో.. ప్రముఖ ఆన్‌లైన్ ఇ-కామర్స్ సైట్లలో ఈ మోడల్ అసలు ఎంఆర్‌పి రూ. 48,990 కాగా, ప్రస్తుతం ఏకంగా 44% కళ్లు చెదిరే డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్ ధర కింద ఇది కేవలం రూ.26,990 లకే అందుబాటులో ఉంది. అదనంగా బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు ఉపయోగించి కొంటే.. ఇన్స్టెంట్ ఆఫర్లు,ఈజీగా నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా పొందొచ్చు.
రూ. 27,000 లోపు బడ్జెట్‌లో నాయిస్‌లెస్ మోటార్, ఇన్-బిల్ట్ హీటర్, స్టీమ్ హైజీన్ ఫీచర్లు ఉన్న ఒరిజినల్ ప్రీమియం.. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ కోసం చూస్తున్నట్లయితే.. ఈ మోడల్ మీకు బెస్ట్ ఛాయిస్. 44% ఆఫర్ ముగిసేలోపే మీ ఇంటికి తీసుకెళ్లండి.