E-Paper
Advertisement

బాటమ్ మౌంటెడ్ ఫ్రిడ్జ్‌లు.. సాధారణ వాటితో పోలిస్తే.. వీటివల్ల ఎన్ని లాభాలో తెలుసా?

బాటమ్ మౌంటెడ్ ఫ్రిడ్జ్‌లు.. సాధారణ వాటితో పోలిస్తే.. వీటివల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Bottom Mounted Fridge: ప్రస్తుతం మార్కెట్ లో బాటమ్ మౌంటెడ్ రిఫ్రిజిరేటర్లకు మంచి క్రేజ్ ఏర్పడుతోంది. సాధారణంగా ఫ్రిజ్ లలో ఫ్రీజర్ అనేది పై భాగంలో ఉంటుంది. కానీ వీటిలో ఇందుకు భిన్నంగా అడుగు భాగంలో ఫ్రీజర్ సెటప్ ఉంటుంది. ఇండియన్ స్టైల్ వంటగదులకు బాటమ్ మౌంటెడ్ రిఫ్రిజిరేటర్లు ఎంతో ఉత్తమమని నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్రిజ్ ల వల్ల కలిగే లాభాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎర్గోనామిక్ డిజైన్

సాధారణంగా చాలా మంది ఫ్రీజర్ కంటే ఫ్రిజ్ విభాగాన్ని (కూరగాయలు, పాలు, నీళ్ల కోసం) రోజుకు కనీసం 10 – 15 సార్లు ఎక్కువగా ఓపెన్ చేస్తుంటారు. బాటమ్ మౌంట్ డిజైన్‌లో ఫ్రిజ్ విభాగం కంటి ఎత్తులో ఉండటం వల్ల పదే పదే వంగాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఇది వృద్ధులకు, వెన్నునొప్పి ఉన్నవారికి చాలా ప్రయోజనరంగా ఉంటుంది.

మెరుగైన విజిబిలిటీ

కూరగాయల బాస్కెట్ కంటికి ఎదురుగా ఉండటం వల్ల లోపల ఏమున్నాయో స్పష్టంగా తెలుస్తుంది. దీనివల్ల వస్తువులు మూలల్లో ఉండిపోయి పాడైపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

పెద్ద ఫ్రీజర్ షెల్ఫ్‌లు

బాటమ్ మౌంటెడ్ ఫ్రిడ్జ్ లలో ఫ్రీజర్ విభాగాన్ని డ్రాయర్ల రూపంలో ఇస్తారు. దీనివల్ల ఫ్రోజన్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ వంటివి సర్దుకోవడం, అవసరమైనప్పుడు తిరిగి ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకోవడం చాలా తేలిగ్గా ఉండనుంది.

అత్యాధునిక ఫీచర్లు

బాటమ్ మౌంట్ మోడల్స్ సాధారణంగా ప్రీమియం సెగ్మెంట్‌లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీటిలో ఇన్వర్టర్ టెక్నాలజీ, కన్వర్టిబుల్ మోడ్స్ (ఫ్రీజర్‌ను ఫ్రిజ్‌గా మార్చుకోవడం) వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఎక్కువగా లభిస్తాయి. ఇది యూజర్ కు ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తాయి.

Also: ఏసీ, కూలర్ ఎంత వాడినా.. సగం కరెంటు బిల్లే రావాలా? ఈ 4 పనులు చేస్తే సరి!

ఈ చిట్కాలతో మరింత మేలు

కొత్తగా బాటమ్ మౌంటెడ్ ఫ్రిడ్జ్‌ కొనుగోలు చేయాలని భావిస్తే.. కొన్ని విషయాలు తప్పకుండా గుర్తు ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముగ్గులు లేదా నలుగురు సభ్యులు ఉన్న కుటుంబాలకు 300 నుండి 400 లీటర్ల కెపాసిటీ సరిపోతుందని స్పష్టం చేస్తున్నారు. కనీసం 3-స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిడ్జ్ మోడల్‌ను ఎంచుకోవడం వల్ల విద్యుత్ ఖర్చు తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీకు ఫ్రీజర్ వాడకం తక్కువ అని భావిస్తే.. ఆ భాగాన్ని కూడా ఫ్రిజ్‌గా మార్చుకునే ‘Convertible’ ఆప్షన్ ఉన్న దానిని ఎంచుకుంటే బెటర్.

Also: Flipkart Offers: ఏంది మామ ఇది.. Carrier 1.5 Ton ఏసీ.. ఇంత చౌకగా ఇచ్చేస్తున్నారు!

Related News

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ 5 కారణాలే కావచ్చు!

గూగుల్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇంటర్నెట్ లేకున్నా లోకల్ PCలో ఏఐ ఫీచర్లు.. ఎలాగో తెలుసా?

ఇల్లంతా చల్లగా ఉండాలా.. సెంట్రలైజ్డ్ ఏసీ బెస్ట్ భయ్యా.. కాకపోతే!

అబ్బా ఏం ఆఫర్..శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ ధర భారీగా తగ్గింది.. ఇక మీదే ఆలస్యం!

సైలెంట్‌గా మొబైల్ మార్కెట్‌లో దిగిన Honor X7e.. ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కుయండి!

Big Stories

×