E-Paper
Advertisement

అనంతనాగ్ పోలీసుల మెరుపు దాడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి

అనంతనాగ్ పోలీసుల మెరుపు దాడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
Advertisement

Drug Bust: అనంతనాగ్ జిల్లాలో మాదకద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు విజయ వంతమయ్యాయి. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ నెట్‌వర్క్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతూ తాజాగా భారీ విజయాన్ని అందుకున్నారు.

పోలీసుల మెరుపు దాడులు..

Advertisement

మాదకద్రవ్యాల నిరోధక డ్రైవ్ లో భాగంగా అనంతనాగ్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. పక్కా సమాచారంతో  చేపట్టిన ఈ ఆపరేషన్‌లో నలుగురు కీలక డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీది వద్ద నుంచి భారీ ఎత్తున 166 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మెుత్తంలో డ్రగ్స్ పట్టు బడటం ఈ ప్రాంతంలో డ్రగ్స్ నెట్‌వర్క్ ఎంత బలంగా ఉందో సూచిస్తోంది.

తగ్గేదే లేదంటున్న అధికారులు..

Advertisement

సమాజానికి చీడ పురుగులా చుట్టుకున్న మాదకద్రవ్యాలపై తమ పోరాటం ఇక్కడితో ఆగదని పోలీసులు స్పష్టం చేశారు. ‘ రాబోయే రోజుల్లో సోదాలను మరింత ఉధృతం చేస్తాం. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు’ అని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఈ అరెస్టులతో స్థానిక డ్రగ్ సఫ్లే ఛైన్‌కు గట్టి దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.

సామాజిక బాధ్యతగా ప్రజలు కూడా పోలీసులను సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పదంగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఈ భారీ విజయం పట్ల స్థానిక ప్రజలు పోలీసు యంత్రాంగాన్ని అభినందిస్తున్నారు.

Also Read: పెట్రోల్ కోసం కిలోమీటర్ల క్యూలు.. విహారయాత్రల్లో లోకేష్.. వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×