Boult Audio Z20 Pro: మ్యూజిక్ లవర్స్‌కి, తరచూ కాల్స్ మాట్లాడేవారికి మంచి ఇయర్‌బడ్స్ ఉండడం ఇప్పుడు కామన్ అయిపోయింది. మార్కెట్లో వందలాది ఆప్షన్స్ ఉన్నా, తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఇచ్చే బ్రాండ్స్ చాలా తక్కువ. అందులో.. ‘బౌల్ట్’ ఒకటి. కేవలం రూ. 999 కే మార్కెట్లోకి వచ్చిన Boult Audio Z20 Pro ఇయర్‌బడ్స్ కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ బడ్జెట్ ధరలో ఇవి నిజంగా బెస్టేనా? వీటిలో ఉన్న క్రేజీ ఫీచర్లు ఏంటి ? కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! ఈ ఇయర్‌బడ్స్ కేస్ చూడటానికి చాలా ప్రీమియం లుక్‌తో, కాంపాక్ట్‌గా ఉంటుంది. జేబులో ఈజీగా పెట్టేసుకోవచ్చు. రబ్బర్ ఫినిషింగ్ వల్ల చేతిలో నుంచి జారిపోదు. చెవిలో పెట్టుకుంటే.. చాలా లైట్‌వేట్‌గా అనిపిస్తాయి. గంటల తరబడి పాటలు విన్నా, సినిమాలు చూసినా చెవులు నెప్పి పుట్టవు.
రూ. 1000 బడ్జెట్‌లో సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో అని అనుకుంటే పొరపాటే! ఇందులో ఉన్న 13mm డ్రైవర్స్ ద్వారా సౌండ్ అవుట్‌పుట్ చాలా క్లియర్‌గా ఉంటుంది. ముఖ్యంగా “బేస్” లవర్స్‌కి ఇది బాగా నచ్చుతుంది. బౌల్ట్ కిగ్జింగ్ బాస్ టెక్నాలజీ వల్ల పాటల్లోని ప్రతి బీట్ స్పష్టంగా వినిపిస్తుంది. ట్రెబుల్, వోకల్స్ కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి.
ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు లేదా ఆఫీస్ కాల్స్ మాట్లాడేటప్పుడు పక్కన ఉన్న శబ్దాలు ఇబ్బంది పెడుతుంటాయి. కానీ ఇందులో తో కూడిన ‘క్వాడ్ మైక్’ ఉంది. ఇది బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని చాలా వరకు తగ్గించి, అవతలి వారికి మీ వాయిస్ స్పష్టంగా వెళ్లేలా చేస్తుంది.
ఈ ఇయర్‌బడ్స్ విషయంలో అతి పెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ! ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే, కేస్‌తో కలిపి దాదాపు 60 గంటల ప్లేటైమ్ ఇస్తుంది. అంటే ఒక్కసారి చార్జ్ చేస్తే.. కొన్ని రోజుల పాటు చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే ఉండదు. అంతేకాదు, టైప్-సి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం 10 నిమిషాలు చార్జ్ చేస్తే దాదాపు 120 నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా వాడుకోవచ్చు.
గేమర్స్ కోసం ఇందులో 45ms లో లేటెన్సీ ఇచ్చారు. దీని వల్ల పబ్జీ, ఫ్రీఫైర్ లాంటి గేమ్‌లు ఆడేటప్పుడు సౌండ్ ల్యాగ్ అవ్వకుండా వెంటనే వినపడుతుంది. బ్లూటూత్ 5.3 వెర్షన్ వల్ల కనెక్టివిటీ.. చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. కేస్ ఓపెన్ చేయగానే.. వితిన్ సెకన్లలో ఫోన్‌కి కనెక్ట్ అయిపోతుంది.
Also Read: డైలీ మార్నింగ్ కేఫ్ స్టైల్ కాఫీ కావాలా? ఈ గార్జెట్ మీ కోసమే
IPX5 వాటర్ రెసిస్టెన్స్: జిమ్‌లో చెమట పట్టినా, చిన్నపాటి వర్షంలో తడిసినా ఇబ్బంది లేదు.
టచ్ కంట్రోల్స్: పాటలు మార్చడానికి, కాల్స్ లిఫ్ట్ చేయడానికి లేదా గూగుల్ అసిస్టెంట్, సిరి వంటి వాయిస్ అసిస్టెంట్‌ని యాక్టివేట్ చేయడానికి టచ్ కంట్రోల్స్ చాలా స్మూత్‌గా పనిచేస్తాయి.
రూ. 999 బడ్జెట్‌లో స్టైలిష్ లుక్, అదిరిపోయే బాస్, లేటెస్ట్ బ్యాటరీ లైఫ్, క్లియర్ కాల్ క్వాలిటీ ఉన్న బ్లూటూత్ ఇయర్‌బడ్స్ కావాలనుకుంటే.. మాత్రం Boult Audio Z20 Pro కచ్చితంగా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.