E-Paper
Advertisement

BSNL Plans: చౌకైన కొత్త వార్షిక ప్లాన్స్.. ఏడాది పాటు రోజూ 2.5 GB, ఫ్రీ కాల్స్.. ఉచిత సబ్‌స్క్రిప్షన్లు!

BSNL Plans: చౌకైన కొత్త వార్షిక ప్లాన్స్.. ఏడాది పాటు రోజూ 2.5 GB, ఫ్రీ కాల్స్.. ఉచిత సబ్‌స్క్రిప్షన్లు!
Advertisement

BSNL Plans: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తాజాగా తమ వినియోగదారుల కోసం 365 రోజుల వ్యాలిడిటీ కలిగిన వార్షిక ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ టెలికామ్ సంస్థలైన జియో, ఎయిర్‌టెల్ తమ రీఛార్జ్ ధరలను పెంచుతాయన్న ప్రచారం నేపథ్యంలో.. తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తూ BSNL ఈ ప్లాన్‌లను ప్రకటించింది. ఇంతకీ ఆ ప్లాన్స్ ఏంటి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఈ కథనంలో పరిశీలిద్దాం.

రూ. 1,515 రీఛార్జ్ ప్లాన్

ప్రతిరోజూ ఎక్కువ డేటా అవసరమయ్యే వారికి కోసం బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ తీసుకొచ్చింది. 365 వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ కింద.. ప్రతిరోజూ 2 GB హై-స్పీడ్ డేటా (మొత్తం 730 GB) లభిస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత (Unlimited) వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 SMSలు ఉచితంగా లభిస్తాయి. డేటా పరిమితి ముగిసిన తర్వాత 40 Kbps వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు.

రూ. 2,399 ప్రీమియం ప్లాన్..

Advertisement

365 రోజులు వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ప్రతీరోజూ 2.5 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అపరిమిత లోకల్, STD కాల్స్.. రోజుకు 100 SMSలు చేసుకోవచ్చు. అంతే కాకుండా అదనపు ప్రయోజనాల కింద ఎరోస్ నౌ (Eros Now) ఎంటర్టైన్మెంట్, BSNL ట్యూన్స్ వంటి సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా పొందవచ్చు.

ఇతర బడ్జెట్ వార్షిక ప్లాన్‌లు

రూ. 1499 ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్ తో పాటు 24 GB డేటా (ప్లాన్ కాలానికి) లభిస్తుంది. ఇంకాస్త తక్కువలో కావాలంటే రూ. 1198 ప్లాన్ ను పరిశీలించవచ్చు. ఇది నెలకు 3 GB డేటా, 300 నిమిషాల కాలింగ్, 30 SMSల చొప్పున ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది.

Advertisement

Also Read: French Door Fridges 2026: బాహుబలి రిఫ్రిజిరేటర్లు.. వీటికి ఎవరైనా సలాం కొట్టాల్సిందే.. ఒక్కో ఫీచర్ నెక్ట్స్ లెవెల్ అంతే!

ఈ ప్లాన్ల వల్ల కలిగే లాభాలు

నెలకు విడివిడిగా రీఛార్జ్ చేసుకునే దానికంటే వార్షిక ప్లాన్ తీసుకోవడం వల్ల సుమారు 20-30% వరకు ఖర్చు తగ్గుతుంది. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాది పొడవునా ప్లాన్ గడువు ముగిసిపోతుందనే ఆందోళన ఉండదు.

ముఖ్య గమనిక: మీ ప్రాంతంలో BSNL 4G నెట్‌వర్క్ లభ్యతను బట్టి డేటా స్పీడ్ మారుతూ ఉండవచ్చు. రీఛార్జ్ చేసే ముందు మీ సర్కిల్‌లో ప్లాన్ ధర, ప్రయోజనాలను ఒకసారి సరిచూసుకోండి.

Also Read: Best Window ACs: ఏమి ఎండలు బాబోయ్? ఈ బడ్జెట్ ఏసీలు ట్రై చేయ్ భయ్యా.. సమ్మర్‌లో కూల్‌గా ఉండొచ్చు!

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×