E-Paper
Advertisement

Pentagon Pizza Orders: పిజ్జా ఆర్డర్లు పెరిగితే.. ఏదో దేశానికి మూడినట్లే.. ఏంటీ పెంటగాన్ పిజ్జా ఇండెక్స్?

Pentagon Pizza Orders: పిజ్జా ఆర్డర్లు పెరిగితే.. ఏదో దేశానికి మూడినట్లే.. ఏంటీ పెంటగాన్ పిజ్జా ఇండెక్స్?
Advertisement

Pentagon Pizza Orders: మిడిల్ ఈస్ట్ యుద్ధంతో.. ప్రపంచ దేశాలు భారీ సంక్షోభం ముందున్నాయి. ఇప్పటికే హర్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించింది. దీంతో ముడి చమురు సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. ఎల్పీజీ నిల్వలు తగ్గి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక అసాధారణమైన సిద్ధాంతం ప్రకారం, పిజ్జా ఆర్డర్లు ఒక దేశ భవిష్యత్తును మార్చనున్నాయి. రాబోయే జాతీయ సంక్షోభాలను ముందుగా తెలియజేస్తాయి.

పెంటగాన్ పిజ్జా ఇండెక్స్ అంటే?

పెంటగాన్ పిజ్జా ఇండెక్స్.. దీనినే కొన్నిసార్లు పిజ్జా మీటర్ లేదా పెంటగాన్ పిజ్జా థియరీ అని కూడా పిలుస్తారు. అమెరికా రక్షణ దళాలకు చెందిన పెంటగాన్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పిజ్జా ఆర్డర్లు ఆకస్మికంగా పెరిగితే ప్రపంచంలో ఏదో మూల మరో దేశానికి మూడిందనే సంకేతాలు ఇచ్చినట్లే అని నిపుణులు చెబుతున్నారు. 1980, 1990లలో దేశంలో అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు, పెంటగాన్ ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళల్లో పిజ్జాల ఆర్డర్లు పెరిగాయి. అత్యవసర పరిస్థితులలో లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, యూఎస్ ప్రభుత్వ అధికారులు రాత్రి పొద్దుపోయే వరకు పనిచేస్తారని, అందువల్ల ఫుడ్ డెలివరీలు సహజంగానే పెరుగుతాయని ఈ సిద్ధాంతం చెబుతోంది.

చారిత్రక ఘటనలు

Advertisement

పిజ్జా ఇండెక్స్ పై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. దేశంలో రాబోయే విపత్తుల గురించి వేగంగా, హెచ్చరించే సంకేతంగా పిజ్జా ఇండెక్స్ ను చూస్తారు. ఇందుకు కొన్ని చారిత్రక ఘటనలు నిదర్శనంగా ఉన్నాయి.

  • గ్రెనడా (1983), పనామా (1989)లపై అమెరికా దాడికి ముందు
  • గల్ఫ్ యుద్ధానికి ముందు రోజు, పెంటగాన్, సీఐఏ అర్ధరాత్రి వేళ పిజ్జా ఆర్డర్లు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.
  • డిసెంబర్ 1998లో, బిల్ క్లింటన్ అభిశంసన, కొసావో వివాదం సమయాల్లో వైట్ హౌస్ సమీపంలో పిజ్జా డెలివరీలు పెరిగాయి.ఇటీవలి కాలంలో, ఈ ఆలోచన ఒక రియల్-టైమ్ ట్రాకింగ్ గా మారింది. పెంటగాన్ పిజ్జా రిపోర్ట్, పెంటగాన్ సమీపంలోని పిజ్జా రెస్టారెంట్ల కోసం గూగుల్ మ్యాప్స్ “లైవ్ విజిట్” డేటాను నిపుణులు విశ్లేషించారు. వీటి ఆధారంగా ఈ థియరీ డెవలప్ చేశారు. కేవలం పిజ్జా డెలివరీ కథనాలపై ఆధారపడకుండా, అసాధారణమైన ప్రమాణాలు, పాదచారుల రద్దీ వివరాలను ట్రాక్ చేశారు. పెంటగాన్ పిజ్జా ఇండెక్స్‌ ప్రచారంలో ఉన్నప్పటికీ కొందరు దీనిని ఇతర దేశాల్లో ఆందోళన కలిగించేందుకు, యూఎస్ అధికారులు ఒక సంకేతంగా ఉపయోగిస్తున్నారని విమర్శకులు అంటున్నారు.

Also Read:  ఇరాన్ ధైర్యానికి ప్రపంచం షాక్.. బెడిసి కొట్టిన ట్రంప్ వ్యూహం సీన్ మొత్తం రివర్స్..!

Related News

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

హోర్ముజ్ జలసంధిలో బాంబుల శబ్దాలు.. పేలుతున్న మైన్స్-మునిగిన షిప్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×