E-Paper
Advertisement

BSNL ధమాకా ఆఫర్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే.. 300 రోజులు పండగే!

BSNL ధమాకా ఆఫర్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే.. 300 రోజులు పండగే!
Advertisement

BSNL Plans: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొస్తూ ఉంటుంది. ఎయిర్ టెల్, జియో వంటి ప్రైవేటు సంస్థలతో పోలిస్తే తక్కువ ధరలోనే ఎక్కువ రోజుల వ్యాలిడిటీని బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తుంది. ఈ క్రమంలోనే సెకండరీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి, తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ పనిచేయాలని కోరుకునే వారికి బీఎస్ఎన్ఎల్ ఒక అద్భుతమైన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ. 1,499లకే 300 రోజుల వ్యాలిడిటీని ఈ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.

రూ. 1,499 ప్లాన్ బెనిఫిట్స్

బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ ప్లాన్.. దాదాపు 10 నెలల పాటు (300 రోజులు) మీ సిమ్ ను యాక్టివ్ గా ఉంచుతుంది. ఇందుకోసం రోజుకు రూ.5 కంటే తక్కువే యూజర్ కు ఖర్చు అవుతుంది. ఇక ఈ ప్లాన్ కింద అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను యూజర్ పొందొచ్చు. అంతేకాకుండా మొత్తం వ్యాలిడిటీ కాలానికి గానూ 32 జీబీ హై స్పీడ్ డేటా సైతం లభిస్తుంది. రోజువారీ పరిమితి ఏమీ లేకుండా ఈ 32 జీబీ డేటాను మీరు 300 రోజుల్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఒకవేళ ఈ డేటా పూర్తయితే 40 kbps వేగంతో అపరిమితంగా డేటాను వాడుకోవచ్చు.

ఈ ప్లాన్ ఎవరికి బెస్ట్?

Advertisement

బీఎస్ఎన్ఎల్ సిమ్ ను కేవలం ఇన్ కమింగ్ కాల్స్ కోసమే వాడాలని భావిస్తే రూ.1499 ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. అలాగే సెకండరీ సిమ్ గా కొనసాగించాలని అనుకున్నా కూడా ఇదే బెస్ట్ ఆప్షన్. నెలకు సగటున రూ.150 కంటే తక్కువే పడనున్న నేపథ్యంలో యూజర్ల జేబులకు చిల్లు పడకుండా ఉంటుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: గోల్డ్ మార్కెట్‌లో ‘భారత్ బాంబ్’.. ఒక్క ఏడాది కొనుగోళ్లు ఆపేస్తే.. ప్రపంచం తలకిందులేనా?

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

Advertisement

రూ.1499 బడ్జెట్ ప్లాన్ ను సొంతం చేసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ను ఉపయోగించి.. ఈ ప్లాన్ ను పొందొచ్చు. లేదంటే బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్ సైట్ లోనూ ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. అది కూడా కుదరని పక్షంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ లో రీఛార్జ్ సెక్షన్ కు వెళ్లి రూ.1499 ప్లాన్ ను సెలక్ట్ చేసుకోవడం ద్వారా కూడా ఈ ప్లాన్ ను సొంతం చేసుకోవచ్చు.

Also Read: జియో యూజర్లకు భారీ షాక్.. రూ. 249 ప్లాన్ క్లోజ్.. ప్రత్యామ్నాయ బెస్ట్ ప్లాన్లు ఇవే!

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×