E-Paper
Advertisement

జియో యూజర్లకు భారీ షాక్.. రూ. 249 ప్లాన్ క్లోజ్.. ప్రత్యామ్నాయ బెస్ట్ ప్లాన్లు ఇవే!

జియో యూజర్లకు భారీ షాక్.. రూ. 249 ప్లాన్ క్లోజ్.. ప్రత్యామ్నాయ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Advertisement

Jio Plans: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ లో చాలా పాపులర్ అయిన రూ.249 ప్లాన్ ను నిలిపివేసింది. దీంతో రీఛార్జ్ ఫ్లాట్ ఫామ్స్ నుంచి ఈ ప్లాన్ కనిపించడం లేదు. ఫలితంగా ఎంతో కాలంగా ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తూ వస్తున్న జియో కస్టమర్లు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. అయితే రూ. 249 ప్లాన్ పోయినందుకు యూజర్లు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన పనిలేదని జియో వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్లాన్‌కు ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న చౌకైన ప్లాన్స్, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రూ.299 రీఛార్జ్ ప్లాన్

రూ.249 ప్లాన్ లో లభించిన ప్రయోజనాలే కోరుకుంటే.. రూ.299 ప్లాన్ ను ఎంచుకోవచ్చని జియో వర్గాలు పేర్కొంటున్నాయి. 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ కింద.. ప్రతీ రోజూ 1.5GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు పొందొచ్చు.

రూ.249 ప్లాన్ (కొత్త వెర్షన్)

Advertisement

గత ప్లాన్ లో ఇచ్చిన బెనిఫిట్స్ లో కోత విధిస్తూ.. కొత్త వెర్షన్ రూ.249 ప్లాన్ ను జియో తీసుకొచ్చింది. ఇందులో 28 రోజుల పాటు రోజుకు 1 GB డేటా లభిస్తుంది. పాత రేటుకే రీఛార్జ్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. అయితే అంత బడ్జెట్ పెట్టలేమని భావించే వారికి రూ.209 ప్లాన్ ను జియో ఆఫర్ చేస్తోంది. 22 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ లోనూ ప్రతీ రోజూ 1GB డేటా పొందొచ్చు.

రూ.349 రీఛార్జ్ ప్లాన్..

డేటా అవసరం ఎక్కువ ఉన్న వారి కోసం జియో ఈ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతీ రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. ఒకవేళ మీరు 5G నెట్‌వర్క్ ఉన్న ప్రాంతంలో ఉంటే ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉచితంగా పొందొచ్చు.

Advertisement

Also Read: Jio యూజర్లకు పండుగే.. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే.. టాప్-5 ప్లాన్‌లు ఇవే!

రూ.799 ప్లాన్..

3 నెలల పాటు రీఛార్జ్ అవసరం లేని చౌకైన జియో ప్లాన్ ను కోరుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ కింద 84 రోజుల పాటు రోజుకు 1.5 GB డేటా లభిస్తుంది. నెలకు సగటున రూ. 266 మాత్రమే ఖర్చవుతుంది కాబట్టి.. ఇది లాంగ్ రన్ లో ఈ ప్లాన్ డబ్బును ఆదా చేస్తుంది.

Also Read: బీజేపీలో భగీరథ్ ప్రకంపనలు.. సొంత పార్టీలో వినిపిస్తున్న అసమ్మతి స్వరం.. డైలమాలో కీలక నేతలు!

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×