E-Paper
Advertisement

BSNL కొత్త ప్లాన్ చూశారా? రూ.225 చెల్లిస్తే చాలు.. నెలంతా ఇక జాతరే!

BSNL కొత్త ప్లాన్ చూశారా? రూ.225 చెల్లిస్తే చాలు.. నెలంతా ఇక జాతరే!
Advertisement

BSNL Plans: దేశంలో అతి తక్కువ ధరకు మెరుగైన ప్రయోజనాలను అందించే టెలికాం రంగ సంస్థల్లో బీఎస్ఎన్ఎల్ ముందు వరుసలో ఉంటుంది. సామాన్యులకు అందుబాటులో ఉండే ఎన్నో రకాల ప్రీపెయిడ్ ప్లాన్స్ ను బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే లాంచ్ చేసింది. అందులో రూ.225 ప్లాన్ విశేషంగా యూజర్లను ఆకట్టుకుంటున్నట్లు బీఎస్ఎన్ఎల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

రూ.225 రీఛార్జ్ ప్లాన్

బీఎస్ఎన్ఎల్ తాజాగా ప్రవేశపెట్టిన రూ.225 ప్లాన్.. బడ్జెట్ ధరలో ఎక్కువ డేటా కోరుకునే వారికి ఒక వరంలా మారింది. 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ కింద యూజర్ కు ప్రతీరోజూ 2.5GB డేటా హై స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే నెల మొత్తం మీద దాదాపు 75GB డేటాను మీరు వాడుకోవచ్చు. వీటితో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు (SMS) కూడా ఉచితంగా లభిస్తాయి.

ఎవరికి ప్రయోజనం..

Advertisement

సోషల్ మీడియా వాడకం ఎక్కువ ఉన్నవారికి, వీడియో స్ట్రీమింగ్ చేసే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలవనుంది. అలాగే ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ అయ్యే విద్యార్థులకు సైతం ప్రయోజనకరంగా ఉండనుంది. ఒకవేళ రోజువారీ డేటా పరిమితి ముగిసినా.. తక్కువ వేగంతో ఇంటర్నెట్ వాడుకునే సదుపాయం కూడా బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ లో కల్పిస్తోంది.

Also Read: జియో సంచలనం.. రూ. 200 లోపే 4 సూపర్ ప్లాన్లు.. మిస్ అయితే మీకే నష్టం!

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

Advertisement

ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకునేందుకు బీఎస్ఎన్ఎల్ వివిధ మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్లాన్ కావాల్సిన వారు బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ లోకి వెళ్లి రూ.225 ప్లాన్ ను సెలక్ట్ చేసుకోవడం ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్ సైట్ లోనూ ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇది కాకుండా గూగుల్ పే, ఫోన్ పే, పేటీయం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ లోని రీఛార్జ్ సెక్షన్ కు వెళ్లి రూ.225 ప్లాన్ ను సొంతం చేసుకోవచ్చు.

Also Read: BSNL Plans: రోజుకు 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. సామాన్యుడికి వరంలాంటి ప్లాన్స్..!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×