E-Paper
Advertisement

జియో సంచలనం.. రూ. 200 లోపే 4 సూపర్ ప్లాన్లు.. మిస్ అయితే మీకే నష్టం!

జియో సంచలనం.. రూ. 200 లోపే 4 సూపర్ ప్లాన్లు.. మిస్ అయితే మీకే నష్టం!
Advertisement

Jio Plans: దేశంలో అత్యధికమంది కస్టమర్లను కలిగిన టెలికాం కంపెనీల్లో రిలయన్స్ జియో ఒకటి. అయితే ఇటీవల జియో కొన్ని ముఖ్యమైన ప్లాన్ ధరలను పెంచినప్పటికీ.. సామాన్యులకు అందుబాటులో ఉన్న ప్లాన్స్ ను మాత్రం అలాగే కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రూ.200లోపు బడ్జెట్ లో జియో ఆఫర్ చేస్తున్న టాప్ – 4 ప్రీపెయిడ్ ప్లాన్స్, వాటి బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

రూ. 189 రీఛార్జ్ ప్లాన్

తక్కువ ఖర్చుతో జియో సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలని భావించే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన రూ.189 ప్లాన్ ద్వారా యూజర్ కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. మొత్తం 2GB హై స్పీడ్ డేటాతో పాటు 300 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు.

రూ. 198 రీఛార్జ్ ప్లాన్

Advertisement

తక్కువ బడ్జెట్ లో అత్యుత్తమ 5G నెట్ వర్క్ ను ఆస్వాదించాలని అనుకుంటే ఈ ప్లాన్ ట్రై చేయండి. 14 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ లో ప్రతీ రోజూ యూజర్ కు 2GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. మీ ఏరియాలో 5G అందుబాటులో ఉంటే అపరిమిత 5G డేటాను సైతం వాడుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చు.

రూ.175 రీఛార్జ్ ప్లాన్

ఇది కేవలం 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన యాడ్ ఆన్ ప్లాన్ మాత్రమే. అంటే మీ మొబైల్‌లో ఇప్పటికే ఏదైనా వ్యాలిడిటీ ప్లాన్ ఉంటేనే దీనిని రీఛార్జ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే యూజర్ అదనంగా 10GB డేటా లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో సోనీ లివ్ (Sony LIV), జీ5 (ZEE5) వంటి 10కి పైగా ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ సైతం లభిస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

Advertisement

Also Read: BSNL Plans: రోజుకు 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. సామాన్యుడికి వరంలాంటి ప్లాన్స్..!

రూ. 149 రీఛార్జ్ ప్లాన్

ఇది కూడా ఒక డేటా ప్లాన్ మాత్రమే. 30 రోజుల వ్యాలిడితో తక్కువ ధరలో ఎక్కువ డేటా కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్ కు 10GB డేటా లభిస్తుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో అదనంగా డేటా కోరుకునేవారు జియోలో ఈ ప్లాన్ ట్రై చేయెుచ్చు.

Also Read: రూ.10వేల లోపు క్రేజీ ఫీచర్లు.. భారీ బ్యాటరీ, ఏఐ కెమెరాలతో మార్కెట్‌ను ఊపేస్తున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×