Ravi Shastri: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న జట్లు కిందికి రావడం… కింద ఉన్న జట్లు పైకి రావడం జరుగుతోంది. ఇక మొన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కేకేఆర్ (Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders) మధ్య 57వ మ్యాచ్ జరిగింది. రాయ్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ సందర్భంగా బెంగళూరు బ్యాటర్ జాకబ్ బెథెల్ (Jacob Bethell ) గోల్డ్ చైన్ ( gold chain incident ) మైదానంలో పడిన సంగతి తెలిసిందే. అయితే కింద పడ్డ గోల్డ్ చైన్ ను దేవదత్ పడిక్కల్ వెంటనే తీసుకొని, అంపైర్ నితిన్ కు అప్పగించాడు. ఆ తర్వాత జాకబ్ బెథెల్ కు దాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. అయితే ఈ సంఘటనపై టీమిండియా మాజీ ఆటగాడు రవి శాస్త్రి (Ravi Shastri) స్పందించారు. ఐపీఎల్ టోర్నమెంట్ లో గోల్డ్ చైన్ వెనక్కి ఇచ్చారు.. కానీ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లలో (Pakistan Super League Tournament) మాత్రం ఆ గోల్డ్ చైన్ ప్లేయర్ లేని నొక్కేసేవారని సెటైర్ వేశారు రవి శాస్త్రి. దీంతో రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
బెంగళూరు వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ కింద పడింది. కేకేఆర్ బౌలర్ త్యాగి వేసిన అద్భుతమైన బంతి తగిలిన నేపథ్యంలో గోల్డ్ చైన్ తెగిపడింది. ఆ తర్వాత దాన్ని చూసుకోకుండానే పెవిలియన్ కు వెళ్లిపోయాడు జాకబ్ బెథెల్. ఈ సందర్భంగా పడిక్కల్ వెంటనే దాన్ని తీసుకొని అంపైర్ కు ఇచ్చాడు. ఆ తర్వాత ఆ గోల్డ్ చైన్ ను జాకబ్ బెథెల్ కు అందజేశారు. ఈ సంఘటనపై రవిశాస్త్రి దారుణంగా కామెంట్ చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో కాబట్టి ఆ గోల్డ్ చైన్ దొరికిందని.. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లో మాత్రం ప్లేయర్లు దొంగిలించే వారిని బాంబు పేల్చారు. అభిమానుల కంటే ప్లేయర్లే దొంగలంటూ చురకలు అంటించారు. గతంలో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ బంగారు చైన్ కూడా పాకిస్తాన్ ప్లేయర్ లేదు దొంగతనం చేశారని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. అలాంటి సంఘటన కేవలం పాకిస్తాన్లో మాత్రమే జరుగుతుందని ఎద్దేవా చేశారు. ఇండియాలో ఏ టోర్నమెంట్ జరిగినా ప్లేయర్లకు అలాగే వారి భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని తెలిపారు.
😂Things you only see in the IPL!😂
Ravi Shastri mocks PSL on air during RCB vs KKR🚨🗣️
During the high-stakes clash in Raipur, a wholesome moment took the internet by storm. After a brief on-field celebration, Devdutt Padikkal was seen returning a gold chain to Jacob Bethell… pic.twitter.com/s009gaUTyy
— sportified (@adi25611) May 15, 2026