E-Paper
Advertisement

BSNL రూ. 2,799 vs Vi రూ. 2,249.. ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే వార్షిక ప్లాన్ ఏది?

BSNL రూ. 2,799 vs Vi రూ. 2,249.. ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే వార్షిక ప్లాన్ ఏది?
Advertisement

BSNL vs Vi: సామాన్యులకు అతి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు అందించే టెలికాం సంస్థలుగా బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియాలకు పేరుంది. దిగ్గజ సంస్థలైన ఎయిర్ టెల్, జియోతో పోలిస్తే.. ఇవి అందించే ప్లాన్ల ధరలు కాస్త తక్కువగా, సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉంటాయి. ముఖ్యంగా లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్లలో బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ.2,799, వీఐ తెచ్చిన రూ.2,249 ప్లాన్లు మెుబైల్ యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్లాన్ల వివరాలు, వాటిలో ఏది ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తున్నాయో ఈ కథనంలో చూద్దాం.

BSNL రూ. 2,799 ప్లాన్

బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ను 365 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద యూజర్లకు ప్రతీరోజూ 3GB డేటా లభించనుంది. ఒకవేళ డేటా లిమిట్ అయిపోయినా 40Kbps స్పీడ్ తో అపరిమిత డేటాను వాడుకోవచ్చు. దీంతో ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు యూజర్లు చేసుకోవచ్చు. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా రోజుకు దాదాపు రూ.8 ఖర్చు కానుంది.

Vi రూ. 2,249 ప్లాన్ బెనిఫిట్స్

Advertisement

వొడాఫోన్ ఐడియా ఈ ప్లాన్ ను కూడా 365 రోజుల కాలపరిమితితో అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి ఏడాది పొడవునా ఫ్రీ కాల్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ఏడాది మెుత్తానికి 3600 ఎస్ఎంఎస్ లు ఉచితంగా చేసుకోవచ్చు. ఇక డేటా విషయానికి వస్తే.. ఈ ప్లాన్ లో మెుత్తం కాలానికి 30GB డేటా మాత్రమే వీఐ యూజర్ కు లభిస్తుంది. ఆ డేటా పరిమితి దాటితే.. ప్రతీ 1 MB డేటాకు 50 పైసల చొప్పున ఛార్జ్ పడనుంది. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకోవడం ద్వారా ప్రతీ రోజూ రూ.6 భారం యూజర్ పై పడనుంది.

Also Read: పెళ్లి సర్టిఫికెట్ ఉంటే సరిపోదు.. అవి కూడా ఉండాల్సిందే.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

రెండింటిలో ఏ ప్లాన్ బెస్ట్?

Advertisement

రోజూ ఇంటర్నెట్ ఎక్కువగా వాడేవారికి బీఎస్ఎన్ఎల్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. వర్క్ ఫ్రమ్ చేసుకునే వారికి, విద్యార్థులు, రీల్స్ చూసేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది. అలాకాకుండా ఇంట్లో వై-ఫై ఉండి.. మెుబైల్ డేటాతో పెద్ద పని లేకపోతే హ్యాపీగా వీఐ ప్లాన్ (రూ.2,249) రీఛార్జ్ చేసుకోవడం బెటర్. బీఎస్ఎన్ఎల్ ప్లాన్ తో పోలిస్తే దీని ద్వారా రూ. 550 వరకు ఆదా చేసుకోవచ్చు.

Also Read: ఏంటీ.. రూ.350 లోపే అపరిమిత 5G డేటానా? ఈ Airtel ప్లాన్స్‌తో రచ్చ రచ్చే!

Related News

4.2GHz స్పీడ్‌తో శాంసంగ్ కొత్త ప్రాసెసర్.. ఇక మార్కెట్‌లో మిగతా కంపెనీలకు కష్టమేనా?

ఒప్పో ఫైండ్ X10 సిరీస్ కెమెరా డిజైన్‌లో ఊహించని మార్పులు.. పూర్తి వివరాలు మీ కోసం!

మార్కెట్‌లో స్టాక్ ఖాళీ.. ఒక్కసారిగా రూ.12,000 వరకు పెరిగిన iPhone 17 సిరీస్ ధరలు!

10 నిమిషాల ఛార్జ్‌తో 12 గంటలు బ్యాకప్.. 3D ఆడియో, నాయిస్ క్యాన్సిలేషన్‌తో సరికొత్త బోట్ హెడ్‌ఫోన్స్ లాంచ్!

ఏంటీ.. రూ.350 లోపే అపరిమిత 5G డేటానా? ఈ Airtel ప్లాన్స్‌తో రచ్చ రచ్చే!

ఇంట్లో తేమగా ఉందని హ్యూమిడిఫైయర్ వాడుతున్నారా? నిపుణులు ఎందుకు వద్దంటున్నారో తెలిస్తే..

నోకియా కొత్త ఫీచర్ ఫోన్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 19 రోజులు నాన్ స్టాప్!

Big Stories

Advertisement
×