E-Paper
Advertisement

నిరసనకారులకు బిగ్ రిలీఫ్.. కోటి పరిహారం, కేసుల ఎత్తివేతకు కేంద్రం సై- అశుతోష్ రాంకా 

నిరసనకారులకు బిగ్ రిలీఫ్.. కోటి పరిహారం, కేసుల ఎత్తివేతకు కేంద్రం సై- అశుతోష్ రాంకా 
Advertisement

Ashutosh Ranka: కేంద్ర ప్రభుత్వంతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం కాక్‌రోచ్ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల నిరసనలు, విద్యావ్యవస్థ సంస్కరణలపై తాము లేవనెత్తిన మూడు ప్రధాన డిమాండ్లలో రెండింటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆయన వెల్లడించారు.

పరిహారం, కేసుల హామీకి కేంద్రం ఓకే..

Advertisement

NEET వ్యవహారంలో బలవన్మరణాలకు పాల్పడిన అభ్యర్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌తో పాటు నిరసనకారులకు పూర్తి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇప్పటివరకు నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఆందోళనకారులపై ఎటువంటి కేసులు పెట్టబోమని ప్రభుత్వం సార్వభౌమ హామీ ఇవ్వాలని CJP కోరింది. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించిందని, త్వరలోనే రాతపూర్వక ఒప్పందం పొందుతామని ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు.

మంత్రి రాజీనామా మోదీ చేతుల్లోనే..

Advertisement

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ విషయాన్ని వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తామని, తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రుల బృందం తెలిపింది. తుది నిర్ణయాన్ని వెల్లడించేందుకు ప్రభుత్వం రేపు మధ్యాహ్నం మరోసారి భేటీ కావలసిందిగా ప్రతిపాదించిందని అశుతోష్ రాంకా తెలిపారు.

Also Read: ఢిల్లీ జంతర్ మంతర్ నిరసన.. జేపీ నడ్డాకు CJP సంచలన లేఖ!

Related News

ప్రధాని పర్యటన వేళ కలకలం.. తుపాకీ, నకిలీ గుర్తింపు కార్డుతో ఇద్దరు అరెస్టు

చిరుతను ఢీకొట్టిన కారు.. సాయం కోసం వచ్చిన అధికారిపై దాడి చేసిన క్రూరమృగం.. షాకింగ్ వీడియో!

పరీక్షల్లో 95.7 శాతం మార్కులు.. అయినా స్టూడెంట్ ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?

ఉపాధ్యాయుల నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. వాళ్ల ఉద్యోగాలు ఔట్!

టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు, అలాంటివారి నో ఛాన్స్

2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంటర్ విద్యార్హతతో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో జాబ్స్

శ్రీవారి దర్శనం తర్వాత బెంగళూరు వెళ్తుండగా.. డివైడర్‌ను ఢీ కొట్టిన కారు, నలుగురు మృతి

విపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్.. డబుల్ మీనింగ్స్ వద్దు, చట్టం ఊరుకోదని హెచ్చరించిన సీఎం విజయ్

Big Stories

Advertisement
×