E-Paper
Advertisement

BSNL మరో చౌకైన ప్లాన్.. రూ. 397కే 5 నెలల వ్యాలిడిటీ.. అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా!

BSNL మరో చౌకైన ప్లాన్.. రూ. 397కే 5 నెలల వ్యాలిడిటీ.. అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా!
Advertisement

BSNL Plans: ప్రైవేటు టెలికాం సంస్థల రీఛార్జ్ ధరల పెంపుతో సామాన్యులు.. ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వారికి శుభవార్త అందించింది. అతి తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీని కోరుకునే వారి కోసం క్రేజీ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ. 397 లతోనే ఏకంగా 150 రోజుల సుదీర్ఘ వాలిడిటీని బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. తద్వారా ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. ఇంతకీ ఈ ప్లాన్ వల్ల యూజర్ కు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

5 నెలల పాటు సిమ్ యాక్టివ్..

మొబైల్ యూజర్లలో చాలామంది తమ సెకండరీ సిమ్‌లను కేవలం ఇన్‌కమింగ్ కాల్స్, సిమ్ కార్డు యాక్టివ్‌గా ఉంచుకోవడం కోసం మాత్రమే వాడుతుంటారు. అలాంటి వారికి ఈ రూ. 397 ప్లాన్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. ఈ ప్లాన్ ద్వారా ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే దాదాపు 5 నెలల పాటు (150 రోజులు) రీఛార్జ్ చేసుకోవాలనే టెన్షన్ ఉండదు.

30 రోజులు ఫ్రీ బెనిఫిట్స్

Advertisement

యూజర్లకు ఎక్కువ రోజుల వ్యాలిడిటీ (సిమ్ యాక్టివ్) అందించాలన్న లక్ష్యంతోనే బీఎస్ఎన్ఎల్ ఈ చౌకైన ప్లాన్ తీసుకొచ్చింది. కాబట్టి ఈ ప్లాన్ లో తొలి 30 రోజులు మాత్రమే యూజర్ కు పలు బెనిఫిట్స్ లభించనున్నాయి. తొలి నెల దేశవ్యాప్తంగా ఏ నెట్ వర్క్ కు అయినా ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఉచిత కాలర్ ట్యూన్స్, లోక్‌ధున్ కంటెంట్ కూడా యూజర్ పొందొచ్చు.

ప్రతిరోజూ 2జీబీ డేటా

మరోవైపు రూ. 397 ప్లాన్ లో డేటా సౌకర్యాన్ని సైతం బీఎస్ఎన్ఎల్ కల్పిస్తోంది. ఈ ప్లాన్ కింద తొలి 30 రోజుల పాటు.. ప్రతీరోజూ 2GB డేటా లభిస్తుంది. ఒకవేళ రోజువారీ డేటా పరిమితి ముగిసినా ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోకుండా 80Kbps వేగంతో అన్‌లిమిటెడ్‌గా వాడుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లు సైతం యూజర్ ఫ్రీగా చేసుకోవచ్చు. అయితే ఈ టెక్ట్స్ మెసేజ్ లు కూడా తొలి 30 రోజులు మాత్రమే యూజర్ కు అందుబాటులో ఉంటాయి.

Advertisement

Also Read: జియో బంపరాఫర్.. 84 రోజుల పాటు.. ఫ్రీ ఓటీటీలతో పాటు రోజూ 2GB డేటా!

30 రోజుల తర్వాత..

ఈ ప్లాన్ బెనిఫిట్స్ 30 రోజుల తర్వాత ముగిసినప్పటికీ.. మిగిలిన 120 రోజుల పాటు సిమ్ యాక్టివ్ గానే ఉంటుంది. ఇన్ కమింగ్ కాల్స్, బ్యాంక్ ఓటీపీలు, ఇతర కీలక మెసేజ్ లు యాథావిధిగా యూజర్ పొందొచ్చు. ఒకవేళ ఆ తర్వాత కూడా కాల్స్, డేటా కావాలని అనుకుంటే.. యాడ్ ఆన్ ప్యాక్స్ ను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా వాటిని పొందొచ్చు. మెుత్తంగా చూస్తే తక్కువ బడ్జెట్ లో ఎక్కువ కాలం సిమ్ యాక్టివ్ గా ఉండాలని కోరుకునే మిడిల్ క్లాస్ వారికి ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

Also Read: రాష్ట్ర ప్రభుత్వం సంచలనం.. గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ల నుండి.. ఓలా, ఉబర్, ర్యాపిడో ఔట్?

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×