Jio Plan: ప్రముఖ ప్రైవేటు టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. అయితే నేటి డిజిటల్ ప్రపంచంలో కేవలం డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా ఫ్రీగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కోరుకునే యూజర్ల సంఖ్య బాగా పెరిగింది. దీనిని గమనించిన జియో.. ఎంటర్ టైన్ మెంట్ కు పెద్దపీట వేస్తూ సరికొత్త ప్లాన్ అందుబాటులో ఉంచింది. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా టాప్ ఓటీటీ యాప్స్ ను తన ప్రీపెయిడ్ ప్లాన్ లో ఆఫర్ చేస్తోంది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి? దాన్ని రీఛార్జ్ చేసుకోవడం వల్ల యూజర్ కు కలిగే లాభాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.
ప్రస్తుత ఓటీటీ ప్రపంచంలో జియో తీసుకొచ్చిన రూ.1,049 ప్లాన్.. యూజర్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ కాల్స్, భారీ డేటాతో పాటు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్ లభించనుంది. ప్రతీనెలా రీఛార్జ్ చేసుకునే అవసరం లేకుండా.. 3 నెలల పాటు (84 రోజులు) ఎలాంటి చింత లేకుండా ఈ ప్లాన్ ను ఉపయోగించుకోవచ్చు.
రూ.1,049 కింద యూజర్ కు 84 రోజుల పాటు ఫ్రీ కాల్స్ లభిస్తాయి. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా (Unlimited) లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఈ ప్లాన్ లో రోజుకు 2 జీబీ చొప్పున హై స్పీడ్ డేటాను యూజర్ పొందొచ్చు. అంటే మొత్తం 84 రోజులకు గానూ 168 GB డేటాను యూజర్ వినియోగించుకోవచ్చు. ఒకవేళ డైలీ లిమిట్ అయిపోతే ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbps కి తగ్గుతుందని జియో వర్గాలు పేర్కొన్నాయి.
రూ.1,049 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే అర్హులైన యూజర్లకు అపరిమిత 5G డేటాను సైతం జియో ఆఫర్ చేస్తోంది. ఒకవేళ మీ ఏరియాలో జియో 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉండి.. 5G స్మార్ట్‌ఫోన్ వాడుతుంటే.. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అన్‌లిమిటెడ్ 5G డేటాను ఎంజాయ్ చేయవచ్చని జియో వర్గాలు చెబుతున్నాయి.
ఉచిత ఓటీటీ యాక్సెస్ అందిస్తుండటం ఈ ప్లాన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇందుకోసం అదనంగా ఎలాంటి సబ్ స్క్రిప్షన్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని జియో వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జీ5, సోనీ లైవ్ వంటి ప్రముఖ ఓటీటీలను ఫ్రీగా పొందే అవకాశాన్ని ఈ ప్లాన్ కల్పిస్తోంది. జియో టీవీ యాప్ ద్వారా ఈ రెండు ప్రముఖ ఓటీటీల కంటెంట్‌ను చూడొచ్చు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ ఛానెళ్లను ఎంజాయ్ చేయొచ్చు.
Also Read: రాష్ట్ర ప్రభుత్వం సంచలనం.. గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ల నుండి.. ఓలా, ఉబర్, ర్యాపిడో ఔట్?
జీ5, సోనీ లైవ్ వంటి ఓటీటీలతో పాటు జియో యాప్స్ కు సైతం రూ.1,049 ప్లాన్ కింద ఉచిత యాక్సెస్ లభించనుంది. జియో సినిమా యాప్ లో సరికొత్త సినిమాలు, మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ చేయెుచ్చు. జియో క్లౌడ్ ద్వారా పెద్ద ఎత్తున స్టోరేజ్ పొందొచ్చు. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల కోసం విడిగా డబ్బులు ఖర్చు పెట్టకూడదని భావిస్తే.. జియో అందిస్తున్న రూ. 1,049 ప్లాన్ ఖచ్చితంగా బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
Also Read: BSNL ధమాకా ఆఫర్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే.. 300 రోజులు పండగే!