E-Paper
Advertisement

Nothing Phone Discount: నథింగ్ పాపులర్ ఫోన్‌పై ధర తగ్గింపు.. ప్యానెల్‌లో మెరిసిపోయే గ్లిఫ్ లైట్స్‌తో అదిరిపోయే ఫోన్

Nothing Phone Discount: నథింగ్ పాపులర్ ఫోన్‌పై ధర తగ్గింపు.. ప్యానెల్‌లో మెరిసిపోయే గ్లిఫ్ లైట్స్‌తో అదిరిపోయే ఫోన్
Advertisement

Nothing Phone Discount| నథింగ్ కంపెనీ తాజాగా నథింగ్ ఫోన్ (4a) లాంచ్ చేసింది. ఈ ఫోన్ గత సంవత్సరం లాంచ్ అయిన నథింగ్ ఫోన్ (3a)కి కొద్దిపాటి అప్‌గ్రేడ్ వెర్షన్. అయితే కొత్త ఫోన్ విడుదల కాగానే నథింగ్ ఫోన్ (3a) ధర తగ్గింది. ఫోన్ (3a) యూనిక్ డిజైన్, బలమైన హార్డ్‌వేర్ ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో పరిమిత ఆఫర్‌తో నథింగ్ ఫోన్ (3a) డిస్కౌంట్ దొరుకుతోంది.

ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే తక్షణ తగ్గింపు రూ.2,000. లాంచ్ ధర కంటే ఇప్పుడు చౌకగా ఈ ఫోన్ లభిస్తోంది. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ ఫోన్ వెనక భాగంలో మెరిసిపోయే గ్లిఫ్ లైట్స్. నోటిఫికేషన్లు, కాల్స్, ఛార్జింగ్ సమయంలో ఈ లైట్స్ బ్లింక్ అవుతాయి. ఈ లైట్స్ ఫోన్‌కు ఫ్యూచరిస్టిక్ లుక్ ఇస్తుంది.

ధర, వేరియంట్లు

Advertisement

నథింగ్ ఫోన్ (3a) రెండు స్టోరేజ్ వేరియంట్లలో వచ్చింది.
8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ – లాంచ్ ధర రూ.24,999
8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ – లాంచ్ ధర రూ.26,999

ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్ తర్వాత ఫైనల్ ధర మరింత తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. బ్లాక్, వైట్, బ్లూ కలర్లలో దొరుకుతుంది.

యూనిక్ డిజైన్, గ్లిఫ్ లైటింగ్

Advertisement

ఈ ఫోన్ వెనక భాగం ట్రాన్స్‌పరెంట్ స్టైల్‌లో ఉంటుంది. అందులో LED స్ట్రిప్స్ రూపంలో గ్లిఫ్ లైట్స్ ఉన్నాయి. కాల్స్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు, ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఈ లైట్స్ బ్లింక్ అవుతాయి. ఇది నథింగ్ ఫోన్లకు సిగ్నేచర్ లుక్ ఇస్తుంది. చాలా మంది ఈ డిజైన్ చూసి గుర్తుపెట్టుకుంటారు.

డిస్‌ప్లే ఫీచర్లు

నథింగ్ ఫోన్ (3a)లో 6.77 ఇంచ్ FHD+ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1080*2392 పిక్సెల్స్. 30Hz నుంచి 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. స్క్రీన్ యాక్టివిటీ ప్రకారం రిఫ్రెష్ రేట్ ఆటోమాటిక్‌గా సర్దుబాటు అవుతుంది. 240Hz టచ్ సాంప్లింగ్ రేట్ ఉండటంతో గేమింగ్, స్క్రోలింగ్ స్మూత్‌గా ఉంటాయి. బ్రైట్‌నెస్ 800 నిట్స్ (టిపికల్), 1300 నిట్స్ (అవుట్‌డోర్), పీక్ 3000 నిట్స్ వరకు ఉంది. పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది.

పర్‌ఫామెన్స్, సాఫ్ట్‌వేర్

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ (4nm) ఉంది. ఆడ్రినో 720 GPUతో గ్రాఫిక్స్ మంచిగా ఉంటాయి. LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా నథింగ్ OS 3.1 ఉంది. క్లీన్, మినిమల్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది.

కెమెరా సెటప్

నథింగ్ ఫోన్ (3a)లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP మెయిన్ (OIS సపోర్ట్, f/1.88) కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ (114° FOV) అలాగే 50MP టెలిఫోటో (2x ఆప్టికల్ జూమ్) అద్భుత కెమెరా ఉంది. ముందు భాగంలో వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరా ఉంది.

Also Read: రియల్ వెబ్‌సైట్‌లో మోసపూరిత నెంబర్లు.. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ

బ్యాటరీ, ఇతర ఫీచర్లు

5000mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉంది. 5G, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, NFC, USB Type-C సపోర్ట్ ఉన్నాయి. బరువు 201 గ్రాములు, మందం 8.35mm మాత్రమే.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×