Gambhir-Jay Shah: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) ఫైనల్ కు కౌంట్ డౌన్ షురూ అయింది. మరికొన్ని గంటల్లోనే టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India vs New Zealand, Final ) మధ్య టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad ) వేదికగా ఈ రెండు జట్లు ఫైనల్స్ లో తలపడతాయి. మార్చి 8వ తేదీన రాత్రి 7 గంటలకు ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. జియో హాట్ స్టార్ లేదా స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ ఉచితంగానే చూడవచ్చు.
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ లో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఫైట్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించకుండా.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫైనల్స్ నిర్వహించాలని గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) డిమాండ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఐసీసీ బాస్ జై షా తో గౌతమ్ గంభీర్ గొడవ పెట్టుకున్న వీడియో కూడా బయటకు వచ్చింది.
2023 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా ఫైనల్స్ కూడా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగానే జరిగింది. అప్పుడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫైట్ జరిగింది. ఇందులో టీమిండియా చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. టి20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 స్టేజ్ లో దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ కూడా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోయింది.
దీంతో అహ్మదాబాద్ వేదికను మార్చాలని గౌతమ్ గంభీర్ పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగానే ఐసీసీ బాస్ జై షాతో ( ICC JAy Shah) గొడవ కూడా పెట్టుకున్నారు గంభీర్. అయితే దానికి జై షా మాత్రం ఒప్పుకోలేదని తెలుస్తోంది. గంభీర్ నువ్వు నీ లిమిట్స్ లో ఉండు.. మోడీ స్టేడియంలోనే ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.. దమ్ముంటే అక్కడ ఇండియాను గెలిపించు అంటూ గంభీర్ కు జై వార్నింగ్ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారింది.
Jay Shah and Gautam Gambhir were seen having an argument after the Ind vs Eng match.
Take a look at Jay Shah’s reaction — what’s your view on it? pic.twitter.com/gkdnZlL6PQ
— Sonu (@Cricket_live247) March 6, 2026