E-Paper
Advertisement

OnePlus Discount: వన్‌ప్లస్ పాపులర్ ఫోన్‌పై రూ.8000 డిస్కౌంట్.. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పవర్‌ఫుల్ ఫీచర్స్

OnePlus Discount: వన్‌ప్లస్ పాపులర్ ఫోన్‌పై రూ.8000 డిస్కౌంట్.. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పవర్‌ఫుల్ ఫీచర్స్

OnePlus Discount| వన్‌ప్లస్ బ్రాండ్‌కు చెందిన పాపులర్ ఫోన్ వన్‌ప్లస్ 13s (OnePlus 13s) ఇప్పుడు ఆన్‌లైన్‌లో చాలా తక్కువ ధరకు దొరుకుతోంది. అమెజాన్ లాంటి పెద్ద ఈ-కామర్స్ సైట్‌లలో లాంచ్ ధర కంటే గణనీయంగా తగ్గింది. ఈ ఆఫర్‌లో కొంటే కస్టమర్లు రూ.8,000 వరకు ఆదా చేసుకోవచ్చు. డిస్కౌంట్ ఆఫర్ కారణంగా ఈ ప్రీమియం ఫోన్‌ సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

ధర వివరాలు, ఆఫర్లు

ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ అయినప్పుడు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.54,999కి, 12GB ర్యామ్ + 512GB వేరియంట్ రూ.59,999కి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్‌లో 256GB మోడల్ రూ.50,997కి, 512GB మోడల్ రూ.54,997కి లభిస్తోంది. అంటే డైరెక్ట్ డిస్కౌంట్ రూ.4,000 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది. అర్హత ఉన్న బ్యాంక్ కార్డులతో అదనంగా రూ.3,000 తగ్గుతుంది. దీంతో మొత్తం తగ్గింపు రూ.8,000 వరకు చేరుతుంది. పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేస్తే మరిన్ని సేవింగ్స్ చేసుకోవచ్చు.

డిస్‌ప్లే, డిజైన్

OnePlus 13sలో 6.32 అంగుళాల 1.5K LTPO ProXDR డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1216*2640 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. గరిష్ట బ్రైట్‌నెస్ 1,600 nits వరకు ఉండటంతో బయట ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. Aqua Touch 2.0 టెక్నాలజీతో తడి చేతులతో, గ్లోవ్ మోడ్‌తో చలికాలంలో సులభంగా ఉపయోగించవచ్చు.

పవర్‌ఫుల్ పర్‌ఫామెన్స్, సాఫ్ట్‌వేర్

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ఫ్లాగ్‌షిప్ స్థాయి పర్‌ఫామెన్స్ ఇస్తుంది. 12GB LPDDR5X ర్యామ్, 512GB వరకు UFS 4.0 స్టోరేజ్ ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 రన్ అవుతుంది. కొత్త ప్లస్ కీ బటన్‌తో రింగ్, వైబ్రేషన్, సైలెంట్ మోడ్‌లను సులభంగా మార్చవచ్చు. కెమెరా, ఫ్లాష్‌లైట్ లేదా AI ఫీచర్లను త్వరగా ఓపెన్ చేయవచ్చు.

AI ఫీచర్లు, స్మార్ట్ టూల్స్

AI ప్లస్ మైండ్ స్పేస్‌తో ఆర్టికల్స్, చాట్స్, ఫోటోలు, షెడ్యూల్స్ ఒకచోట సేవ్ చేసి త్వరగా చూడవచ్చు. AI డీటెయిల్ బూస్ట్, అన్‌బ్లర్, రిఫ్లెక్షన్ ఎరేజర్, రీఫ్రేమ్ వంటి ఇమేజింగ్ టూల్స్ ఉన్నాయి. AI ట్రాన్స్‌లేషన్, వాయిస్‌స్క్రైబ్, కాల్ అసిస్టెంట్, సర్చ్, సర్కిల్ టు సర్చ్, గూగుల్ జెమినీ సపోర్ట్ ఉన్నాయి.

కెమెరా సెటప్

ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. వెనుక భాగంలో 50MP Sony LYT-700 ప్రైమరీ (OISతో), 50MP టెలిఫోటో (2x ఆప్టికల్ జూమ్). 32MP ఫ్రంట్ కెమెరా EIS సపోర్ట్‌తో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం బాగుంటుంది.

Also Read: వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేసినా ఇంటికి చేరలేదా? సులభంగా ఇలా ఫిర్యాదు చేయండి

బ్యాటరీ, కనెక్టివిటీ

5,850mAh పెద్ద బ్యాటరీ, 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్, 5G, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, USB Type-C ఉన్నాయి. బరువు 185 గ్రాములు, మందం 8.2 mm మాత్రమే – సన్నగా, సౌకర్యవంతంగా ఉంటుంది.

లైఫ్‌టైమ్ డిస్‌ప్లే వారంటీ

OnePlus గ్రీన్ లైన్ సమస్యలకు లైఫ్‌టైమ్ డిస్‌ప్లే వారంటీ ఇస్తోంది. సమస్య వస్తే ఉచితంగా రిపేర్ చేస్తారు. ఈ ఫోన్ పర్‌ఫామెన్స్, AI ఫీచర్లు, బ్యాటరీతో గొప్ప ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇప్పుడే కొంటే మంచి సేవింగ్స్ పొందవచ్చు.

ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలిపిన స్మార్ట్‌ఫోన్ ధర, ఆయా కంపెనీలు, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఆఫర్లపై ఆధారంగా ఉంటాయి. ఫోన్ కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా చెక్ చేసి కొనండి. మీరు కొనుగోలు చేసే సమయానికి పైన  పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. అందుకే ధర వివరాల గురించి ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదు.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×