OPPO F31 5G Mobile: మొబైల్ మార్కెట్‌లో ప్రతి రోజూ కొత్త కొత్త ఫోన్లు వస్తున్నాయి. కానీ అందరిలో దృష్టిని ఆకర్షిస్తున్న ఫోన్ ఏదైనా ఉంటే అది ప్రస్తుతం OPPO F31 5G. ఈ ఫోన్ ఇప్పుడు వినియోగదారులకు ఒక ప్రత్యేక ఆఫర్‌తో అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా దీని ధర రూ.22,999 ఉండగా, ప్రస్తుతం అందిస్తున్న ప్రత్యేక ఆఫర్‌లో రూ.5,000 తగ్గింపుతో కేవలం రూ.20,999 కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
కాబట్టి కొత్త ఫోన్ కొనాలనుకునేవారు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా ఉండటం మంచిది. OPPO కంపెనీ ఎప్పటి నుంచీ స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఫీచర్లు, స్మార్ట్ యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌తో వినియోగదారుల మనసు గెలుచుకుంటోంది. ఇక ఈ కొత్త F31 5G ఫోన్‌లో ఆ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.
7000mAh బ్యాటరీ
ముందుగా దీని బ్యాటరీ పవర్ గురించి చెప్పాలంటే, ఈ ఫోన్‌లో 7000mAh భారీ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఇచ్చారు. రోజంతా గేమింగ్, వీడియోలు, సోషల్ మీడియా లేదా ఆఫీస్ పనులు చేసినా కూడా ఈ ఫోన్ బ్యాటరీ సాయంత్రం వరకూ తేలిపోదు. అంతేకాదు, బ్యాటరీ తగ్గిపోయినా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులో ఉన్న 80W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో కొన్ని నిమిషాల్లోనే ఫోన్ మళ్లీ పూర్తి చార్జ్ అయిపోతుంది.
డిజైన్ ప్రీమియం లుక్
డిజైన్ విషయానికి వస్తే, ఒప్పో ఎఫ్31 5జి నిజంగా ఆకట్టుకునేలా తయారైంది. స్లీక్ బాడీ, ప్రీమియం లుక్, చేతిలో పట్టుకున్నా లైట్ వెయిట్ అనుభవం కలిగిస్తుంది. ఫోన్ ముందు భాగంలో ఇచ్చిన ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఎంతో స్పష్టంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. సినిమాలు చూడటం, గేమ్స్ ఆడటం లేదా వీడియో కాల్స్ చేయడం – ఏ పని చేసినా, స్క్రీన్ అనుభవం అద్భుతంగా ఉంటుంది.
Also Read: BSNL Offers: రూ.229లో బిఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్.. రోజుకు 2జిబి డేటా, నెలపాటు అన్‌లిమిటెడ్ కాల్స్
కెమెరా సిస్టమ్
ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికి ఇది ఒక అదనపు బోనస్ లాంటిది. ఈ ఫోన్‌లో ఉన్న అత్యాధునిక కెమెరా సిస్టమ్ రోజులోనూ, రాత్రిలోనూ చక్కని ఫోటోలు ఇస్తుంది. నైట్ మోడ్‌లో తీసిన చిత్రాలు కూడా చాలా క్లియర్‌గా, నేచురల్ కలర్స్‌తో కనిపిస్తాయి. పోర్ట్రేట్ షాట్స్, వీడియోలు లేదా సెల్ఫీలు తీసుకున్నా కూడా ఈ ఫోన్ కెమెరా క్వాలిటీని చూసి మీరు ఆశ్చర్యపోతారు.
ఆన్‌లైన్ గేమింగ్
ఇకపోతే 5జి కనెక్టివిటీ వల్ల మీ ఇంటర్నెట్ అనుభవం మరింత వేగవంతమవుతుంది. మీరు ఏ వీడియో అయినా క్షణాల్లో స్ట్రీమ్ చేయవచ్చు. ఆన్‌లైన్ గేమింగ్ కూడా ల్యాగ్ లేకుండా స్మూత్‌గా నడుస్తుంది. ఇదే కాకుండా కలర్ఓఎస్ అనే సాఫ్ట్‌వేర్ ఇంటర్‌ఫేస్‌తో ఈ ఫోన్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆపరేషన్ చాలా సులభంగా ఉంటుంది, ఏ యాప్ ఓపెన్ చేసినా సెకండ్లలో స్పందిస్తుంది.
బ్యాంక్ ఆఫర్లు
ఇప్పుడు ఆఫర్ వివరాలు కూడా చెప్పుకోవాలి. మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు, అంటే రూ.2,499 వరకు తక్షణ తగ్గింపు. అదీ కాకుండా 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. అంటే మీరు పెద్ద మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేకుండా, చిన్న చిన్న ఇఎంఐలుగా సులభంగా చెల్లించవచ్చు. ఎందుకంటే ఇంత ఫీచర్లతో కూడిన 5జి ఫోన్‌ను ఇంత తక్కువ ధరలో పొందటం చాలా అరుదు.