BSNL Offers: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అంటేనే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ. ప్రైవేట్ కంపెనీల రీచార్జ్ ప్లాన్లతో పోటీ పడుతూ, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం రూ.229 రూపాయలకే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జిబి డేటా లభించే స్పెషల్ ప్లాన్‌ను అందిస్తోంది. ఇంత తక్కువ ధరలో ఇంత మంచి ప్లాన్ అంటే ప్రతి యూజర్‌కి సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ప్లాన్‌లో ఏం లభిస్తుంది? ఎవరు ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు? అన్నదానిపై వివరంగా చూద్దాం.
ప్లాన్ వివరాలు
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.229 రీచార్జ్ ప్లాన్ మొత్తం 30 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. అంటే ఒకసారి రీచార్జ్ చేస్తే పూర్తి నెలంతా మీకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. భారత్‌లోని ఏ నెట్‌వర్క్‌కైనా లోకల్, ఎస్‌టిడి కాల్స్ ఎలాంటి పరిమితులు లేకుండా మాట్లాడవచ్చు.
డేటా స్పీడ్
డేటా విషయానికి వస్తే, రోజుకు 2జిబి వరకు హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. రోజుకి 2జిబి పూర్తయిన తర్వాత కూడా ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు, కానీ స్పీడ్ తగ్గి 40 కెబిపిఎస్‌కి పరిమితం అవుతుంది. ఇక ఈ ప్లాన్‌లో మరో ప్రత్యేకత 100 ఎస్ఎంఎస్‌లు రోజుకు ఉచితంగా లభిస్తాయి. అంటే కమ్యూనికేషన్ కోసం కావాల్సిన అన్ని సౌకర్యాలు ఒక్క ప్లాన్‌లోనే లభిస్తున్నాయి.
Also Read: Amazon Diwali Offers: అమెజాన్ దీపావళి స్పెషల్ ఆఫర్లు! 80% వరకు తగ్గింపు, రూ.300 క్యాష్‌బ్యాక్!
ఎవరికి సరైన ప్లాన్?
ఈ రూ.229 ప్లాన్ ముఖ్యంగా ఎక్కువ కాల్స్ చేసే యూజర్లకు, అలాగే రోజుకు సరాసరి 1–2బిజి డేటా వాడే వారికి చాలా బాగుంటుంది. ఉదాహరణకు, విద్యార్థులు, ఉద్యోగులు, రోజూ ఆన్‌లైన్ మీటింగ్స్ లేదా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారు ఈ ప్లాన్ తీసుకుంటే ఖచ్చితంగా లాభమే.
బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ ప్రయోజనాలు
బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతం 4జి సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. రానున్న కాలంలో 5జి టెక్నాలజీని కూడా ప్రవేశపెట్టబోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ మెరుగుపరచడమే దీని ప్రధాన లక్ష్యం. కాబట్టి ఈ ప్లాన్ నగరాలకే కాకుండా గ్రామాల్లో ఉన్న యూజర్లకు కూడా అందుబాటులో ఉంటుంది.
ధర పరంగా పోలిస్తే
ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు రూ.250– రూ.300 మధ్యే ఇలాంటి ప్లాన్లు అందిస్తున్నాయి. అయితే బిఎస్ఎన్ఎల్ ఈ సర్వీసులు కేవలం రూ.229కే అందిస్తోంది. దాంతోపాటు ప్రభుత్వ సంస్థ కాబట్టి, నెట్‌వర్క్ స్థిరత్వం మరియు విశ్వసనీయత కూడా బాగుంటుంది.
ప్లాన్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి?
ఈ రూ.229 ప్లాన్ బిఎస్ఎన్ఎల్ యూజర్లు తమ మై బిఎస్ఎన్ఎల్ యాప్ ద్వారా లేదా సమీప బిఎస్ఎన్ఎల్ సెంటర్ లేదా రీటైల్ షాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. అలాగే వెబ్‌సైట్ ద్వారా కూడా సులభంగా రీచార్జ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ ప్లాన్‌ని ప్రయత్నించండి డబ్బు ఆదా, సౌకర్యం రెండూ మీ చేతుల్లోకి వస్తాయి.