Pixel 10a Discount| గూగుల్ ఇటీవల భారతదేశంలో పిక్సెల్ 10a స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ను తగ్గింపు ధరలో కొనుగోలు చేసుకునే అవకాశం వినియోగదారులకు దొరుకుతుంది. ఈ ఫోన్లో శక్తివంతమైన కెమెరా, దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీ లభిస్తాయి. అలాగే, అధునాతన భద్రతా ఫీచర్లు, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్‌పై అందుబాటులో ఉన్న తాజా ఆఫర్లు, ధర, ప్రత్యేకతలను వివరంగా చూద్దాం.
గూగుల్ పిక్సెల్ 10a 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ వేరియంట్ లాంచ్ ధర సమయంలో రూ.49,999గా ఉంది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా పేమెంట్ చేస్తే రూ.3,000 డిస్కౌంట్ పొందవచ్చు. దీని ప్రకారం ఫోన్ ధర రూ.46,999కి తగ్గుతుంది. అదనంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మరింత మొత్తం ఆదా చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ రూ.47,000 వరకు ఉండవచ్చు. ఇంకా, ఎక్స్ఛేంజ్ సమయంలో రూ.3,000 బోనస్ కూడా అందుబాటులో ఉంటుంది. పాత ఫోన్ కండిషన్ ఆధారంగా చివరి ధర నిర్ణయించబడుతుంది.
పిక్సెల్ 10aలో 6.3 అంగుళాల యాక్టువా pOLED డిస్ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 1080* 2424 పిక్సెల్స్. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. గరిష్ట బ్రైట్‌నెస్ 3,000 నిట్స్ వరకు ఉంటుంది. స్క్రీన్‌పై గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ అందించారు. దీనివల్ల ఫోన్ స్క్రీన్‌పై స్క్రాచ్‌లు, గట్టి దెబ్బల నుంచి రక్షణ లభిస్తుంది. ఫోన్ డిజైన్ ఆధునికంగా, పట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది.
ఈ ఫోన్‌లో గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్ చిప్ అమర్చారు. దీంతో పాటు టైటాన్M2 సెక్యూరిటీ కో-ప్రాసెసర్ కూడా ఉంది. ఈ కాంబినేషన్ పర్‌ఫామెన్స్, డేటా భద్రతను మెరుగుపరుస్తుంది. ఫోన్ నేరుగా ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. గూగుల్ ఈ ఫోన్‌కు ఏడేళ్లపాటు అప్డేట్లు అందించనుంది. ఇందులో ఆండ్రాయిడ్ అప్గ్రేడ్లు, సెక్యూరిటీ ప్యాచ్లు రెండూ ఉంటాయి. ఈ దీర్ఘకాల సపోర్ట్ ఫోన్ను భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచుతుంది.
పిక్సెల్ 10a బలమైన కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో 48MP ప్రధాన కెమెరా ఉంది. ఈ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సౌకర్యం ఉండటం వల్ల స్థిరంగా, స్పష్టంగా ఫోటోలు తీయవచ్చు. ఫోన్‌లో 13MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. ఈ కెమెరా విశాల దృశ్యాలను సులభంగా క్యాప్చర్ చేసుకోవచ్చు. సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. వీడియో కాల్స్ కూడా స్పష్టంగా చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,100mAh బ్యాటరీ ఉంది. ఒకసారి ఛార్జ్ చేసుకుంటే చాలా సేపు వినియోగించుకునే సౌకర్యం ఉంటుంది. ఫోన్ 30w వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే, 10w వాట్ల వైర్లెస్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. ఈ ఫీచర్లు రోజువారీ వినియోగానికి ఎంతో సౌకర్యంగా ఉంటాయి.
Also Read: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి
పిక్సెల్ 10a 5G నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. అలాగే వైఫై 6e, బ్లూటూత్ 6 సౌకర్యాలు కూడా ఉన్నాయి. NFC, USB, Type-C పోర్ట్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్‌కు IP68 రేటింగ్ లభించింది. దీనివల్ల దుమ్ము, నీటి ప్రభావం నుంచి ఫోన్‌కు రక్షణ ఉంటుంది.
పిక్సెల్ 10a తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. పర్‌ఫామెన్స్, కెమెరా క్వాలిటీ, సాఫ్ట్‌వేర్ సపోర్ట్ బ్యాలెన్స్ చేస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిస్కౌంట్ ఆఫర్లు దీన్ని మంచి విలువైన ఆప్షన్‌గా మార్చాయి. మంచి బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది సరైన ఆప్షన్.
ముఖ్య గమనిక: ఈ కథనంలో పేర్కొన్న గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ ధరలు.. ఆ కంపెనీలు, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఇచ్చే ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. కస్టమర్లు ఫోన్ ఫీచర్లు, ధరలు జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలని సూచన. ఈ కథనంలో పేర్కొన్న స్మార్ట్‌ఫోన్ ధరలు మీరు కొనుగోలు చేసే సమయానికి మారిపోయి ఉండవచ్చు. ఈ విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదు.