E-Paper
Advertisement

Gold Reserves: భారతీయుల వద్ద బంగారం సంపద.. 34 వేల టన్నులు, జీడీపీని మించేసిందా?

Gold Reserves: భారతీయుల వద్ద బంగారం సంపద.. 34 వేల టన్నులు, జీడీపీని మించేసిందా?

Gold Reserves: బంగారం అంటే భారతీయులు.. భారతీయులు అంటే పసిడి ఎక్కువగా గుర్తుకొస్తుంది. ఎందుకంటే దిగువ స్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు ఏ చిన్న సందర్భం వచ్చినా ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. ఆ విధంగా భారతీయలతో పసిడి మమేకం అయ్యింది. తాజాగా దేశంలో భారతీయుల వద్ద దాదాపు 34 వేల టన్నుల బంగారం ఉన్నట్లు తేలింది. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం.

భారతీయుల వద్ద బంగారం సంపద ఎంతో తెలుసా?

దేశంలో భారతీయ కుటుంబాల వద్ద 34 వేల టన్నుల బంగారం ఉంది. మార్కెట్లో దీని విలువ సుమారు 5 ట్రిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో 400 లక్షల కోట్ల పైమాట. మన దేశ జీడీపీలో సుమారు 125 శాతానికి సమానం. కేవలం సంపద కూడ బెట్టడమేకాదు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పును సూచిస్తోంది. దేశం మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 5.09 ట్రిలియన్ డాలర్లు.

బంగారం నిల్వలు దాన్ని మించిపోతున్నాయిని కోటక్ నివేదిక సారాంశం. కొన్నినెలలుగా బంగారం ధరలు వేగంగా పెరగడంతో భారతీయుల వద్దనున్న వాటి విలువ గణనీయంగా పెరిగింది.ప్రజలు తమను తాము ధనవంతులుగా భావించి ఎక్కువ ఖర్చు చేసేలా చేయాలి, కానీ గణాంకాలు అందుకు విరుద్ధంగా సూచిస్తున్నాయి.

34 వేల టన్నులు పసిడి.. 5 ట్రిలియన్ డాలర్లు

గడిచిన దశాబ్దంలో గృహ వినియోగదారుల వద్ద బంగారం నిల్వల చాలా మితంగా ఉండేది. ప్రస్తుతం వారి వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ మొత్తం స్థిరాస్తియేతర ఆస్తులలో 65 శాతంగా ఉందని నివేదికలో ప్రస్తావించింది. మొత్తం రుణాలలో బంగారు రుణాలు సుమారు 5.5 శాతం కాగా, రిటైల్ రుణాల్లో సుమారు 12 శాతం అన్నమాట.

దీని ప్రకారం దేశంలో బంగారు సంపదలో అధిక భాగం నిరుపయోగంగా పడి ఉంది. బంగారంలో అధిక భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది భారత్. అది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గత దశాబ్దమున్నర కిందట దేశంలో బంగారం, వజ్రాల దిగుమతులు సుమారు 500 బిలియన్ డాలర్లు. ఇది విదేశీ పెట్టుబడిదారుల కంటే 2.5 రెట్లు ఎక్కువ.

ALSO READ: పసిడి ప్రియులకు పండగే: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. కారణం ఇదే!

మొత్తం విదేశీ పెట్టుబడుల ప్రవాహంలో సుమారు 85 శాతం అన్నమాట. భారతదేశంలోకి వస్తున్న విదేశీ డబ్బులో అధిక భాగం బంగారం కొనడానికి ఉపయోగిస్తున్నారు.  ఆ తర్వాత పసిడి నిల్వలు పెరుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆర్థిక పొదుపుల కంటే పెద్దది. గృహ వినియోగదారుల వద్దనున్న బంగారం విలువ సుమారు ఐదేళ్లలో నాలుగు రెట్లకు పెరిగినట్టు ఓ అంచనా.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×