Best LED Projector: ప్రస్తుతం సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూసేవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఇప్పుడంతా ఇంట్లోనే హాయిగా ఫ్యామిలీతో కలిసి మూవీస్ చూస్తున్నారు. అచితే, ఇంట్లోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే.. కచ్చితంగా మూవీ ప్రొజెక్టర్స్ ఉండాల్సిందే. అప్పుడే పిక్చర్ దృశ్యం, సౌండ్ క్వాలిటీ, మ్యూజిక్ వంటివి బాగుంటాయి. అయితే, ఒకప్పుడు ఎల్‌ఈడీ ప్రొజెక్టర్స్ కొనాలంటే హై కాస్ట్ ఉండేది. అది కేవలం ధనవంతులకే అని సర్దిపెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రూ.10వేల నుంచే దొరికే స్మార్ట్ ఎల్ఈడీ ప్రొజక్టర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు బెస్ట్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్స్ గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం మార్కెట్లో అధిక నాణ్యత కలిగిన ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.10వేల నుంచి రూ.15వేల మధ్య ప్రారంభమవుతున్నాయి. ఇటీవలే పోర్ట్రోనిక్స్ అనే కంపెనీ తన కొత్త స్మార్ట్ ఎల్ఈడీ ప్రొజెక్టర్, బీమ్ 550ను విడుదల చేసింది. వీటితో పాటు అదనంగా మరో రెండు కొత్త ప్రొజెక్టర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది.
పోర్ట్రోనిక్స్ బీమ్ 550 అనే ప్రొజెక్టర్ 1080p HD రిజల్యూషన్, 6000 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఇది లివింగ్ రూమ్ లేదా బెడ్‌రూమ్‌లోకి బాగుంటుంది. ఈ ప్రొజెక్టర్ 100 అంగుళాల వరకు స్క్రీన్‌లను సపోర్ట్ చేస్తుంది. దీనిని ఏ రూమ్‌లోనైనా వాడుకోవచ్చు. ఈ ప్రొజెక్టర్ ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. పోర్ట్రోనిక్స్ బీమ్ 550 కాంపాక్ట్ ఫోల్డబుల్ డిజైన్, 5W బిల్ట్-ఇన్ స్పీకర్ కలిగి ఉంది. ఇది AAC, FLAC, MP3, WAV, OGGతో సహా బహుళ ఆడియో ఫార్మాట్‌లకు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా ఈ ప్రొజెక్టర్లు స్పీకర్లను కనెక్ట్ చేయడానికి దీనికి ఇయర్‌ఫోన్-అవుట్ పోర్ట్ కలిగి ఉన్నాయి. ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ.9,999.
కార్యాలయాల్లో, పెద్ద హాలులో వాడుకోవడానికి XElectron అనే స్మార్ట్ LED ప్రొజెక్టర్ అందుబాటులోకి వచ్చింది. దీనిలో ప్రొజెక్టర్ 1 ప్లస్, ఐప్రొజెక్టర్ 2 ప్లస్ మోడల్‌లు ఉన్నాయి. ఈ కంపెనీ నుంచి రెండు రకాల ఎల్‌ఈడీ ప్రొజెక్టర్లు రిలీజ్ అయ్యాయి. వీటి ప్రారంభ ధర వరుసగా.. రూ.15,990, రూ.17,990. ఇవి పోర్టబుల్ టేబుల్‌టాప్ డిజైన్‌ను కలిగి ఉంటాయి.