E-Paper
Advertisement

SSMB 29 Title : గ్లోబ్ ట్రోటర్ – సంచారీ – వారణాసి.. ఇవేవీ రూమర్స్ కాదు.. నిజాలే

SSMB 29 Title : గ్లోబ్ ట్రోటర్ – సంచారీ – వారణాసి.. ఇవేవీ రూమర్స్ కాదు.. నిజాలే
Advertisement

SSMB 29 Title : కొన్ని రోజుల క్రితం SSMB 29 టైటిల్ ఇదే అంటూ చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అలా టైటిల్స్ ప్రచారంలోకి రావడంపై కూడా కొన్ని వార్తలు వచ్చాయి. రాజమౌళినే కావాలని ఆ టైటిల్స్ లీక్ చేశారు అంటూ కొంత మంది చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ఫైనల్‌గా ఇప్పుడు నిజం తెలిసింది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం…

ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరోగా SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్ శివారులో భారీగా సెట్స్ వేసి మరీ చేస్తున్నారు. కాశీ లోని మణికర్ణిక ఘాట్ సెట్ వేశారు. అలాగే ఓడిస్సాలో కూడా షూటింగ్ చేశారు. ఇప్పుడు కెన్యాతో పాటు ఆఫ్రీక అడువుల్లో సినిమా షూటింగ్ జరుపుతున్నారు.

వరుస అప్డేట్స్..

Advertisement

అటు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి.. సినిమా అప్డేట్స్ పై ఫోకస్ పెట్టారు రాజమళి. ఇప్పటికే సినిమాలో విలన్ గా నటిస్తున్న పృథ్విరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. త్వరలోనే ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఫైనల్ గా గ్లోబల్ ట్రోటర్ పేరుతో ఈ నెల 15న భారీ ఈవెంట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో మహేష్ బాబు లుక్ తో పాటు మూవీ టైటిల్ ను రివీల్ చేయబోతున్నారు. అలాగే 3 నిమిషాల నిడివితో ఉన్న ఓ కాన్సెప్ట్ వీడియోను కూడా చూపించబోతున్నారు. అందుకోసం స్పెషల్ స్క్రీన్ ను కూడా తయారు చేస్తున్నారు.

టైటిల్‌పై గాసిప్స్..

ఈ కథ ఇలా ఉంటే, గత కొన్ని రోజుల నుంచి ఈ మూవీ టైటిల్ ఇదే అంటూ.. గ్లోబల్ ట్రోటర్, సంచారీ, మహారాజా, వారణాసి అనే పేర్లు వినబడ్డాయి. ఇవి జక్కన్న ఫైనల్ చేశాడరని, అందులో ఒక్క దాన్ని ఫైనల్ చేస్తారు అంటూ ఎవ్వరికి వారు ఊహించుకున్నారు.

Advertisement

కానీ, ఇప్పుడు తెలుస్తున్న అస్సలు నిజం ఏంటంటే… గ్లోబల్ ట్రోటర్, సంచారీ, మహారాజా, వారణాసి అన్నీ కూడా జక్కన్న మైండ్ నుంచి వచ్చినవే.

అందులో గ్లోబల్ ట్రోటర్ అంటే… నవంబర్ 15న నిర్వహించే ఈవెంట్ కి జక్కన్న పెట్టుకున్న పేరు. ఈ ఈవెంట్ ఇప్పుడు హడావుడిగా ఫిక్స్ చేసుకున్నదేం కాదు. రాజమౌళి ఏం చేసినా… పక్కా ప్రణాళికతో చేస్తాడు. అలానే ఈ ఈవెంట్ ను కూడా ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాడు. దానికి గ్లోబల్ ట్రోటర్ అని పేరు పెట్టుకున్నాడు. అది అప్పుడు లీక్ అయింది. దాన్నే మూవీ టైటిల్ అనుకున్నారు.

ఇక సంచారీ, మహారాజా అనే పదాలు కూడా సినిమాకు సంబంధించినవే. నిన్న శృతి హాసన్ పాడిన సంచారీ.. సంచారీ పాటలోని లిరిక్స్ లో ఆ పదాలు ఉన్నాయి, అలా… ఆ రెండు పదాలు కూడా లీక్ అయ్యాయి. అప్పుడు వాటిని టైటిల్స్ అనుకున్నారు.

ఇప్పటి వరకు లీక్ అవుతు వచ్చినవన్నీ కూడా సినిమాతో సంబంధం ఉన్నాయి. ఇక మిగిలింది… వారణాసి. ఇది కూడా సినిమాతో సంబంధం ఉన్నదే అని తెలుస్తుంది. కేవలం సంబంధం మాత్రమే కాదు… SSMB 29 మూవీకి ఈ వారణాసి అనే టైటిలే ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

మరి అది నిజమో.. కాదో.. తెలియాలంటే.. నవంబర్ 15న జరిగే ఆ ఈవెంట్ వరకు ఆగాల్సిందే.

Related News

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

ఎవరీ సాత్విక.. ఒక్క టీజర్ తోనే ఊహించని క్రేజ్!

కీర్తి సురేష్ పుట్టినరోజు స్పెషల్.. ‘అక్క’ టీజర్ రిలీజ్ !

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!

హార్ట్ టచ్ ఫీలింగ్.. ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్!

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

Big Stories

Advertisement
×