E-Paper
Advertisement

నార్మల్ వాషింగ్ పౌడర్ Vs మెషీన్ వాషింగ్ పౌడర్.. తేడాలేంటి?

నార్మల్ వాషింగ్ పౌడర్ Vs మెషీన్ వాషింగ్ పౌడర్.. తేడాలేంటి?
Advertisement

Hand Wash Power Vs Machine Washing Powder: బట్టలు తళతళలాడుతూ, తెల్లగా మెరిసిపోవాలంటే.. సరైన వాషింగ్ పౌడర్ ను ఉపయోగించాలి. మార్కెట్ లో చాలా రకాల వాషింగ్ పౌడర్లు ఉన్నాయి. నార్మల్ వాషింగ్ పౌడర్లు, వాషింగ్ మెషీన్లలో వాడే పౌడర్లు, లిక్విడ్లు ఇలా వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే సాధారణంగా బట్టలకు వాడే వాషింగ్ డిటర్జెంట్ పౌడర్ కు, మెషీన్ లో వాడే పౌడర్ కు మధ్య తేడా ఏంటి? నార్మల్ పౌడర్ ను వాషింగ్ మెషీన్ లో వాడవచ్చా?. వాషింగ్ డిటర్జెంట్లను.. వివిధ రకాల బట్టల అవసరాలకు తగినట్లుగా తయారు చేస్తారు.

హ్యాండ్ వాష్ పౌడర్

చేతితో బట్టలు ఉతకడానికి, సెమీ ఆటోమేటిక్ వాషర్ల కోసం డిటర్జెంట్ పౌడర్ ను ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ పౌడర్ ఎక్కువ నురుగును ఇస్తుంది. వీటికి కాస్త ఎక్కువ నీరు కావాలి. బట్టల నుంచి మరకలను తొందరగా తొలగించేందుకు సహాయపడతాయి.

మెషీన్ వాషింగ్ పౌడర్

Advertisement

మెషీన్ వాషింగ్ పౌడర్లను ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ల కోసం తయారుచేస్తారు. ఈ పౌడర్లకు తక్కువ నీళ్లు సరిపోతాయి. చేతితో ఉతికేందుకు వాడే డిటర్జెంట్ల కంటే తక్కువ నురుగును ఇస్తాయి. బ్లీచింగ్ టెక్నాలజీ వల్ల మరకలను, లోతైన మురికిని సులభంగా తొలగిస్తాయి.

లిక్విడ్ డిజటర్జెంట్లు

లిక్విడ్ డిటర్జెంట్లు ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల కోసం తయారు చేస్తారు. ఇవి ఈజీగా మరకలు తొలగిస్తాయి. బట్టలు ఉతకడానికి ముందే మరకలపై లిక్విడ్ పోసి శుభ్రం చేయవచ్చు. గ్రీజు లేదా నూనె మరకలతో తొలగించడానికి లిక్విడ్ డిటర్జెంట్లు బాగా ఉపయోగపడతాయి. వీటిల్లో వాడే బ్లీచ్ లో క్లోరిన్ ఉండదు. తెల్లని బట్టలు ఉతికేందుకు ఇది బెస్ట్ ఛాయిస్ కాకపోవచ్చు. రంగుల బట్టలను మెరిసేలా చేసేందుకు లిక్విడ్ డిటర్జెంట్ సరైన ఎంపిక.

Advertisement

బట్టల క్వాలిటీ పోకుండా ఉతికేందుకు వచ్చిన లేటెస్ట్ ఆవిష్కరణ పాడ్స్. వీటిలోని త్రీ లేయర్స్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌లో బట్టలను క్లీన్ చేసేందుకు బాగా పనిచేస్తాయి. బట్టలు మెరిసేలా, తాజాదనాన్ని అందిస్తాయి. బట్టలకు ఎంత డిటర్జెంట్ పౌడర్ వాడాలని సందేహిస్తుంటే.. పాడ్స్‌ వాడుకోవచ్చు.

ఏ పౌడర్ వేటికి వాడాలి?

హ్యాండ్ వాష్ పౌడర్

చేతితో బట్టలు ఉతకడానికి, సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ల కోసం ఉపయోగించవచ్చు. ఎక్కువ రుద్దక్కర్లేకుండా మరకలను తొలగిస్తుంది. ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌లలో ఈ పౌడర్ వాడకూడదు.

మెషీన్ వాషింగ్ పౌడర్

ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ల కోసం, తెల్లటి బట్టలు, సాధారణ బట్టలను ఉతకడానికి ఈ పౌడర్ వాడాలి. మరకలు లేదా లోతైన మురికిని తొలగించడానికి ఉపయోగపడుతుంది. చేతితో ఉతికే బట్టలకు, సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ లలో ఈ పౌడర్ వాడకూడదు.

లిక్విడ్ డిటర్జెంట్

ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ల కోసం ఈ డిజర్జెంట్ వాడాలి. మరకలను ముందుగా క్లీన్ చేసుకోవడానికి, జిడ్డు మరకలను తొలగించడానికి, రంగుల బట్టలు ఉతకడానికి ఇది ఉపయోగపడుతుంది. చేతితో ఉతికే బట్టలు, సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌లలో దీనిని వాడకూడదు.

పాడ్స్

ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ల కోసం పాడ్స్ వాడాలి. బట్టలు ప్రకాశవంతంగా, తాజాదనంతో ఉండేందుకు పాడ్స్ ఉపయోగపడతాయి. చేతితో ఉతికే బట్టలకు, సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌లకు ఇది సరిపడదు.

Also Read: బట్టలు ఉతికిన తర్వాత.. వాషింగ్ మిషన్ డోర్.. తెరిచి ఉంచాలా? మూసివేయాలా?

టాప్-లోడ్, ఫ్రంట్-లోడ్ డిటర్జెంట్ల మధ్య తేడాలేంటి?

ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌లో టాప్-లోడ్ డిటర్జెంట్లు ఎక్కువ నురుగును ఇస్తాయి. వీటిని టాప్ లోడ్ వాషర్ల కోసం ఉపయోగిస్తాయి. బట్టల ఫ్యాబ్రిక్ లేబుల్స్ పై సూచనలను పాటిస్తూ..వాష్ సైకిల్‌ను సెలెక్ట్ చేయాలి. ఫ్రంట్-లోడ్ డిటర్జెంట్లు తక్కువ నురుగును ఇస్తాయి. అవి స్పెషల్ గా ఫ్రంట్-లోడ్ వాషర్ల కోసం తయారు చేస్తారు. డిస్పెన్సర్ డ్రాయర్‌ను బయటకు లాగి, తగిన మొత్తంలో డిటర్జెంట్‌ వేయాలి. సరైన వాష్ సైకిల్ ను సెట్ చేయాలి.

పట్టు లాంటి సున్నితమైన బట్టలను ఉతుకుతుంటే, వాటికి చేతితో ఉతికే డిజర్జెంట్ ను వాడడం బెస్ట్. ఈ పౌడర్స్ లో ఎంజైమ్‌లు తక్కువగా ఉంటాయి. పట్టు లేదా ఉన్ని వంటి సున్నితమైన బట్టలకు బ్లీచ్ ఉన్న పౌడర్లు వాడితే అందులోని ఫైబర్స్ దెబ్బతింటాయి. పౌడర్లతో బట్టలు ఉతికినప్పుడు ప్రకాశవంతమైన రంగులు క్రమంగా వెలిసిపోతాయి. ఎందుకంటే పౌడర్‌లోని బ్లీచింగ్ ఏజెంట్లు బట్టల రంగులను తొలగించి, అవి పాలిపోయినట్లుగా, కాంతిహీనంగా చేస్తాయి.

ప్రత్యేకమైన రంగు బట్టలను ఉతుకుతున్నట్లయితే, లిక్విడ్ డిటర్జెంట్ బెస్ట్. ఇవి రంగులను కాపాడుతూ, మరకలను తొలగిస్తాయి. తెల్లటి కాటన్ బట్టల కోసం, పౌడర్‌ను మించినది లేదు! పౌడర్ బట్టలపై పట్టిన మరకలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×