E-Paper
Advertisement

గ్రాండ్ విటారా To బాలెనో.. మారుతి కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు!

గ్రాండ్ విటారా To బాలెనో.. మారుతి కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు!
Advertisement

Maruti Suzuki Nexa Discounts April 2026:  భారత కార్ల మార్కెట్లో టాప్ బ్రాండ్ గా కొనసాగుతున్న మారుతి సుజుకి ఏప్రిల్ 2026లో నెక్సా శ్రేణిలోని కార్లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు మోడల్‌ను బట్టి మారుతూ ఉంటాయి.  క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్, లాయల్టీ బోనస్, స్క్రాపేజ్ ఆఫర్ లాంటి బెనిఫిట్స్ అందిస్తుంది. కస్టమర్లు ఎక్స్చేంజ్, లాయల్టీ బోనస్,  స్క్రాపేజ్ ఆఫర్‌ లో ఏదో ఒకదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

⦿ Maruti Suzuki Grand Vitara

ఏప్రిల్ లో ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్ పొందుతున్న మోడల్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా. ఇందులోని స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లపై రూ. 1.75 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ప్రయోజనాల్లో జీరో రోడ్ ట్యాక్స్, 5 ఏళ్ల ఎక్స్ టెండెడ్  వారంటీ,  ఎక్స్చేంజ్, స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. ఇతర పెట్రోల్ వేరియంట్లపై కూడా రూ. 85,000 వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. CNG వేరియంట్‌పై రూ. 70,000 వరకు తగ్గింపు ఉంది.

⦿ Maruti Suzuki Fronx

Advertisement

ఈ మోడల్‌ లో టర్బో పెట్రోల్ వేరియంట్‌పై రూ. 55,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్,  స్క్రాపేజ్ ఆఫర్ ఉన్నాయి. ఇతర వేరియంట్లపై మాత్రం తక్కువ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.

⦿ Maruti Suzuki Baleno

బాలెనోపై కూడా ఈ నెలలో మంచి ఆఫర్లు ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్లపై రూ. 40,000 వరకు తగ్గింపు లభిస్తుంది. CNG వేరియంట్‌పై  రూ. 35,000 వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

⦿ Maruti Suzuki Ignis

Advertisement

ఈ మోడల్‌పై రూ. 50,000 వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్చేంజ్,  స్క్రాపేజ్ ఆఫర్ కూడా ఉంటుంది.  విధంగా మారుతి సుజుకి XL6 మోడల్‌పై కూడా రూ. 50,000 వరకు తగ్గింపు ఉంది. ఇది పెట్రోల్, CNG రెండు వేరియంట్లకూ వర్తిస్తుంది.

⦿ Maruti Suzuki Invicto

అట ప్రీమియం సెగ్మెంట్‌లో ఉన్న ఈ మోడల్ పై ఈ నెలలో అత్యధికంగా రూ. 2 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్‌తో పాటు భారీ ఎక్స్చేంజ్, స్క్రాపేజ్ బోనస్ కూడా ఉన్నాయి. ఇది హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్‌ తో వచ్చే మోడల్ కావడం ప్రత్యేకత. ఇక ఆఫ్ రోడింగ్‌ మోడల్ మారుతి సుజుకి జిమ్మిపై రూ. 50,000 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే, మారుతి సుజుకి సియాజ్ పై కూడా మిగిలిన స్టాక్‌ను క్లియర్ చేయడానికి రూ. 40,000 వరకు ఆఫర్లు అందిస్తున్నారు.

మొత్తంగా ఏప్రిల్ నెలలో మారుతి సుజుకి నెక్సా కార్లపై మంచి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది సరైన కరెక్ట్ టైమ్ గా చెప్పుకోవచ్చు. ఈ ఆఫర్లు సిటీ, స్టాక్ లభ్యతపై ఆధారపడి మారుతాయి.  కొనుగోలుకు ముందు దగ్గరలోని డీలర్‌ను సంప్రదించడం మంచిది.

Read Also: టాటా EVలపై క్రేజీ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.3.3 లక్షల డిస్కౌంట్!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×