E-Paper
Advertisement

Washing Machine Tips: బట్టలు ఉతికిన తర్వాత.. వాషింగ్ మిషన్ డోర్.. తెరిచి ఉంచాలా? మూసివేయాలా?

Washing Machine Tips: బట్టలు ఉతికిన తర్వాత.. వాషింగ్ మిషన్ డోర్.. తెరిచి ఉంచాలా? మూసివేయాలా?
Advertisement

Washing Machine Tips: ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఇంట్లో వాషింగ్ మిషన్ తప్పనిసరిగా మారిపోయింది. పేద, ధనిక అన్న తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరు తమ బడ్జెట్ కు తగ్గట్లు వాషింగ్ మిషన్ కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. అయితే బట్టలు ఉతికిన తర్వాత వాషింగ్ మిషన్ డోర్ ను తెరిచి ఉంచాలా? లేదంటే మూసివేయాలా? అన్న సందేహం చాలా మందికి కలుగుతుంది. దానిని ఈ కథనం ద్వారా నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం.

నిపుణులు ఏంటున్నారంటే?

సాధారణంగా చాలా మంది చేసే తప్పు ఏంటంటే బట్టలు ఉతకడం అయిపోగానే వాషింగ్ మిషన్ డోర్ మూసివేస్తుంటారు. అయితే ఇది సరైన పని కాదని నిపుణులు సూచిస్తున్నారు. వాష్ తర్వాత కనీసం 1-2 గంటల పాటు డోర్ ను తెరిచే ఉంచాలని స్పష్టం చేస్తున్నారు. దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇంతకీ అవి ఏంటో చూద్దాం.

గాలి ప్రసరణ తప్పనిసరి

Advertisement

బట్టలు ఉతికిన తర్వాత వాషింగ్ మిషన్ లోపల ముఖ్యంగా.. రబ్బర్ సీల్స్ వెనుక తేమ లేదా నీటి చెమ్మ నిలిచిపోతుంది. ఒకవేళ మీరు తలుపు మూసివేస్తే ఆ లోపల తేమ అలాగే ఉండిపోతుంది. ఫలితంగా మిషన్ లోపల దుర్వాసన, బ్యాక్టీరియా పెరగడం, బూజు రావడం వంటి సమస్యలు తలెత్తవత్తు. తర్వాతి ట్రిప్ లో మీరు వేసే బట్టలపై దాని ప్రభావం పడే అవకాశముంది. కాబట్టి డోర్ ఓపెన్ గా ఉంచడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.

ఎక్కువ కాలం మన్నిక

వాషింగ్ మిషన్ లో తేమ ఉంటే లోపలి భాగాల్లో తుప్పు పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఫ్రంట్ లోడ్ మిషన్లలో ఉండే రబ్బర్ గ్యాస్కెట్ త్వరగా పాడైపోతుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే.. ఎల్లప్పుడు మిషన్ లోపలి భాగాన్ని పొడిగా ఉంచడం చాలా అవసరం. ఫలితంగా మిషన్ ఎక్కువ కాలం ఎలాంటి సమస్యలు లేకుండా మన్నికగా ఉంటుంది.

ఫ్రంట్ లోడ్ vs టాప్ లోడ్

Advertisement

ఫ్రంట్ లోడ్ వాషర్లకు తలుపు తెరిచి ఉంచడం అత్యంత చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీటి తలుపులకు గాలి చొరబడకుండా ఉండేలా గట్టి రబ్బర్ సీల్ ఉంటుందని.. తలుపులు మూసివేస్తే తేమ వల్ల లోపలి భాగాలు దెబ్బతినొచ్చు. టాప్ లోడ్ విషయానికి వస్తే గాలి ప్రసరణకు కాస్త అవకాశం ఉన్నప్పటికీ.. ఉతికిన వెంటనే డోర్ తెరవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. లోపలి డ్రమ్ త్వరగా ఆరిపోతుందని స్పష్టం చేస్తున్నారు.

Also Read: Klynk Smart Cooktop: దేశంలోనే తొలి ఇంటెలిజెంట్ ఇండక్షన్ స్టవ్.. వంట రాకున్నా.. మిమ్మల్ని గైడ్ చేసి మరి వండేస్తది!

ఈ చిట్కాలూ ముఖ్యమే..!

వాషింగ్ మిషన్ డోర్ ను తెరవడమే కాకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చెక్ పెట్టేందుకు వీలు ఉంటుంది. ఇందులో భాగంగా ఫ్రంట్ లోడ్ మిషన్ అయితే ఉతకడం పూర్తయ్యాక ఒక పొడి గుడ్డతో రబ్బర్ సీల్ చుట్టూ ఉన్న నీటిని తుడవండి. అలాగే సర్ఫ్ లేదా లిక్విడ్ వేసే డ్రాయర్‌ను కూడా బయటకు తేమ ఆరిపోయేలా చేయండి. ఒకవేళ ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉంటే తలుపు మరీ ఎక్కువగా తెరవకుండా గాలి ఆడేంత వరకూ తెరిచి ఉంచితే బెటర్.

Also Read: Automatic Roti Maker: హేయ్, ఇదేదో భలే ఉందే.. అలా పిండి వేస్తే.. ఇలా రోటీలు వచ్చేస్తున్నాయ్!

Related News

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

Big Stories

Advertisement
×