E-Paper
Advertisement

Cassette AC: మీ ఇంటి సీలింగ్‌కే ఏసీ.. లివింగ్ రూమ్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్, ధర ఎంతంటే?

Cassette AC: మీ ఇంటి సీలింగ్‌కే ఏసీ.. లివింగ్ రూమ్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్, ధర ఎంతంటే?
Advertisement

Cassette AC: సమ్మర్‌లో ఇంటిని చల్లబరచడానికి సాధారణంగా గోడకు తగిలించే స్ప్లిట్ ఏసీలనే మనం ఎక్కువగా చూస్తుంటాం. కానీ, ఇప్పుడు చల్లదనంతో పాటు ఇంటికి ఒక రాయల్ లుక్ ఇస్తూనే.. గదిలో ఎక్కడా ఏసీ మిషన్ కనిపించకుండా చేసే ‘క్యాసెట్ ఏసీ’లు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా ఇళ్లు కట్టుకునే వారు తమ లివింగ్ రూమ్ లేదా పెద్ద హాల్స్ కోసం వీటినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సీలింగ్‌లో కలిసిపోయి, ఎంతటి ఎండలో అయినా చల్లని గాలిని అందించే ఈ ఏసీల గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఏమిటీ.. క్యాసెట్ ఏసీ ప్రత్యేకత?

సాధారణ ఏసీలు గదిలో ఒక మూలన గోడకు ఉండి గాలిని ఒకే వైపుకు పంపుతాయి. కానీ క్యాసెట్ ఏసీ అలా కాదు. ఇది గది మధ్యలో సీలింగ్‌కు ఉంటుంది. దీనివల్ల గాలి నాలుగు వైపులా సమానంగా పంపిణీ అవుతుంది. దీన్నే 360 డిగ్రీల ఎయిర్ ఫ్లో అంటారు. గది ఎంత పెద్దదైనా సరే, ప్రతి మూలకూ చల్లదనం ఒకేలా అందుతుంది. ఇవి చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండి, ఇంటి ఇంటీరియర్ డిజైన్‌ను మరింత క్లాసీగా చూపిస్తాయి.

లివింగ్ రూమ్‌కు ఇదెందుకు బెస్ట్?

Advertisement

చాలామంది తమ ఇంటి హాల్ లేదా లివింగ్ రూమ్‌ను చాలా అందంగా తీర్చిదిద్దుకుంటారు. ఈ క్రమంలో అక్కడ గోడకు పెద్ద ఏసీ మిషన్ కనిపిస్తే.. ఆ అందం తగ్గుతుందని భావిస్తారు. అలాంటి వారికి క్యాసెట్ ఏసీ బెటర్ ఆప్షన్ అనే చెప్పాలి. ఇది ఫాల్స్ సీలింగ్‌లో కలిసిపోయి ఉంటుంది కాబట్టి.. అసలు ఏసీ ఎక్కడ ఉందో కూడా తెలియదు. గదిలో ఎక్కువ మంది జనం ఉన్నా, అందరికీ సమానంగా చల్లదనం అందడం దీని ప్రధాన ప్లస్ పాయింట్.

Also Read: 50% కరెంట్ ఆదా చేసే 5-స్టార్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు.. జీరో డౌన్ పేమెంట్‌‌తో పట్టుకెళ్లొచ్చు!

అమర్చడం ఎలా?

Advertisement

ఈ ఏసీని అందరూ అమర్చుకోలేరు. దీనికోసం మీ గదిలో ఫాల్స్ సీలింగ్ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాదు.. సీలింగ్ పైన మిషన్ ఫిట్ చేయడానికి కనీసం 12 అంగుళాల ఖాళీ చోటు ఉండటం ముఖ్యం. పాత కాలపు ఇళ్లు, తక్కువ ఎత్తు ఉన్న గదులకు ఇవి అంతగా సెట్ కావు. సాధారణంగా 250 చదరపు అడుగుల కంటే పెద్దగా ఉండే గదులకు ఇవి చాలా బాగా సరిపోతాయి. చిన్న బెడ్ రూమ్స్ అయితే మామూలు ఏసీలే మేలు.

ధర వివరాలు:

సాధారణ స్ప్లిట్ ఏసీలతో పోలిస్తే.. వీటి ధర కొంచెం ఎక్కువే ఉంటుంది. 1.5 టన్ నుండి 2 టన్ల కెపాసిటీ ఉన్న క్యాసెట్ ఏసీల ధరలు రూ.65,000 నుండి మొదలై రూ.1,10,000 వరకు ఉంటాయి. బ్రాండ్‌ను బట్టి ఈ ధరల్లో మార్పులు ఉండవచ్చు. ఇన్‌స్టాలేషన్ కోసం కూడా రూ.8,000 నుండి రూ.15,000 వరకు ఖర్చు అవుతుంది. ఎందుకంటే.. వీటిని సీలింగ్‌లో అమర్చడం కొంచెం క్లిష్టమైన పని కాబట్టి.

ఇన్‌స్టాలేషన్‌లో జాగ్రత్తలు:

క్యాసెట్ ఏసీని అమర్చడానికి నిపుణులైన టెక్నీషియన్లు మాత్రమే కావాలి. సీలింగ్‌లో పైపులు, డ్రైనేజీ లైన్లు పక్కాగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే సీలింగ్ పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏసీ ఫిల్టర్లు శుభ్రం చేయడానికి, ఏదైనా రిపేర్ వస్తే ప్రొఫెషనల్ సర్వీస్ అవసరం అవుతుంది. దైకిన్, ఎల్‌జీ, బ్లూ స్టార్, మిత్సుబిషి వంటి కంపెనీలు ప్రస్తుతం ఇండియాలో వీటి కోసం మంచి సర్వీస్ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి.

కొనే ముందు గమనించాల్సినవి:

మీరు క్యాసెట్ ఏసీ కొనాలని నిర్ణయించుకుంటే.. ముందుగా ఒకసారి టెక్నీషియన్‌ను పిలిపించి మీ గదిని చూపించడం మంచిది. మీ సీలింగ్ ఎత్తు ఎంత ఉంది, ఆ గదికి ఎన్ని టన్నుల ఏసీ కావాలి అనేది వాళ్లే కచ్చితంగా చెప్పగలరు. ఇన్వర్టర్ మోడల్స్ తీసుకోవడం వల్ల కరెంటు బిల్లు కూడా ఆదా అవుతుంది. పక్కా ప్లానింగ్‌తో వీటిని అమర్చుకుంటే మీ ఇల్లు ఒక ఫైవ్ స్టార్ హోటల్ లాంటి అనుభూతిని ఇస్తుంది.

Also Read: వన్‌ప్లస్ నుంచి శాంసంగ్ వరకు.. ఏప్రిల్‌లో విడుదలయ్యే క్రేజీ ఫోన్ల లిస్ట్ ఇదే!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×