E-Paper
Advertisement

Realme P4 Lite 5G: బడ్జెట్ ఫోన్ వచ్చేసిందోచ్.. HD+ డిస్ ప్లే, 7000mAh బ్యాటరీ.. నిజంగా అదిరిపోయింది భయ్యా!

Realme P4 Lite 5G: బడ్జెట్ ఫోన్ వచ్చేసిందోచ్.. HD+ డిస్ ప్లే, 7000mAh బ్యాటరీ.. నిజంగా అదిరిపోయింది భయ్యా!
Advertisement

Realme P4 Lite 5G: ప్రముఖ మెుబైల్ కంపెనీ రియల్‌మీ (Realme) తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Realme P4 Lite 5G ను భారత్ లో లాంచ్ చేసింది. వాస్తవానికి గతవారమే ఈ మెుబైల్ ను విడుదల చేయగా.. బుధవారం (మార్చి 25) మధ్యాహ్నం నుంచి దేశంలో అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. తక్కువ బడ్జెట్ లో మంచి పవర్ ఫుల్ మెుబైల్ ను కోరుకునేవారికి ఈ ఫోన్.. బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, స్మూత్ డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో Realme P4 Lite 5G మెుబైల్ కు సంబంధించిన ఫీచర్లు (Key Specifications), వేరియంట్లు, ధర వివరాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

మెుబైల్ డిస్‌ప్లే

Realme P4 Lite 5G మెుబైల్.. 6.8 అంగుళాల HD+ LCD స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఇందులో MediaTek Dimensity 6300 5G చిప్‌సెట్ ఉపయోగించారు. ఇది మల్టీ-టాస్కింగ్, గేమింగ్‌కు మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 సాఫ్ట్ వేర్ తో పనిచేస్తుంది.

బిగ్ బ్యాటరీ..

Advertisement

ఈ రియల్ ఫోన్ లో బ్యాటరీ సెక్షన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 7,000mAh భారీ బ్యాటరీతో రియల్ ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. దీనికి 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ను అందించింది. ఒకసారి ఛార్జ్ చేస్తే.. 24 గంటలకు పైగా వాడుకోవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.

కెమెరా క్వాలిటీ..

రియల్ మెుబైల్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ప్రైమరీగా 13MP కెమెరాను ఫిక్స్ చేశారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 5MP కెమెరా అమర్చారు. వీటి సాయంతో నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకొవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.

దుమ్ము, దూళి నుంచి రక్షణ

Advertisement

Realme P4 Lite 5G మెుబైల్ కు IP64 రేటింగ్ ను అందించారు. ఇది దుమ్ము, నీటి తుంపర్ల నుండి రక్షణ ఫోన్ కు రక్షణ కల్పిస్తుంది. అలాగే MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ సైతం ఈ మెుబైల్ కు ఉండటం విశేషం.

మెుబైల్ ను ఎలా పొందాలి?

ఈ స్మార్ట్‌ఫోన్.. మార్చి 25 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో అందుబాటులోకి రానుంది. అలాగే రియల్‌మీ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయానికి రానుంది. మొజాయిక్ బ్లూ (Mosaic Blue), మొజాయిక్ గ్రీన్ (Mosaic Green) రంగులలో దీని పొందవచ్చు.

Also Read: AC And induction: ఏసీ,ఇండక్షన్ ఒకేసారి వాడుతున్నారా? మీ కరెంట్ మీటర్ పేలిపోకముందే ఇది చూడండి!

ధర ఎంతంటే?

రియల్ తన లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది. 4GB RAM + 64GB Storage, 4GB RAM + 128GB Storage, 6GB RAM + 128GB Storageతో అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ధరలను వరుసగా రూ.12,999, రూ.13,999 , రూ.15,999 నిర్ణయించింది. అయితే లాంచ్ ఆఫర్ కింద రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్, రూ.500 బ్యాంక్ ఆఫర్ ద్వారా మరింత తక్కువకే ఈ ఫోన్ ను దక్కించుకునే వెసులుబాటును రియల్ మీ కల్పించింది.

Also Read: Relationship secrets: రిలేషన్‌షిప్‌లో భార్య చేసే ఆ ఒక్క ‘సైలెంట్’ మిస్టేక్.. కాపురాన్ని కొల్లాప్స్ చేసేస్తుంది!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×