E-Paper
Advertisement

ఆండ్రాయిడ్ Vs ఐఫోన్.. మీ ఛార్జింగ్ కేబుల్ క్వాలిటీ, పొడవు వెనక ఉన్న సీక్రెట్స్ ఇవే!

ఆండ్రాయిడ్ Vs ఐఫోన్.. మీ ఛార్జింగ్ కేబుల్ క్వాలిటీ, పొడవు వెనక ఉన్న సీక్రెట్స్ ఇవే!
Advertisement

iPhone vs Android charging cable length: మనం స్మార్ట్‌ ఫోన్ కొన్నప్పుడు బాక్స్‌లో వచ్చే ఛార్జింగ్ కేబుల్‌ను కేవలం ఒక వైర్‌లాగే చూస్తాం. కానీ.. ఎప్పుడైనా గమనించారా? ఐఫోన్ బాక్స్‌లో వచ్చే కేబుల్ ఒకలా, ఆండ్రాయిడ్ ఫోన్లతో వచ్చే కేబుల్ మరొకలా ఉంటుంది. ముఖ్యంగా వాటి పొడవులో ఉండే తేడా వెనక పెద్ద టెక్నికల్ లాజిక్ ఉంది. మీ ఫోన్ బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ వేగం మీరు వాడే కేబుల్ పొడవుపై ఎలా ఆధారపడి ఉంటుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు!

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఆపిల్ (iPhone), ఆండ్రాయిడ్ తయారీదారులు (Samsung, Xiaomi, మొదలైనవి) ప్రతి విషయంలోనూ పోటీ పడుతుంటాయి. ఈ పోటీ ఛార్జింగ్ కేబుల్ వరకు కూడా వచ్చింది. సాధారణంగా ఐఫోన్ యూజర్లు తమ కేబుల్స్ పొడవు తక్కువగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తుంటారు, అదే కొన్ని ఆండ్రాయిడ్ కంపెనీలు పొడవైన కేబుల్స్ ఇస్తుంటాయి. దీని వెనక ఉన్న అసలు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

1. పొడవు , వోల్టేజ్ డ్రాప్:
సైన్స్ ప్రకారం.. కరెంట్ ప్రవహించే వైర్ ఎంత పొడవుగా ఉంటే.. దానిలో రెసిస్టెంట్స్ అంత ఎక్కువగా ఉంటుంది. అంటే.. కేబుల్ పొడవు పెరిగే కొద్దీ ఛార్జర్ నుంచి ఫోన్ వరకు వెళ్లే శక్తి కొంత తగ్గిపోతుంది. దీనినే ‘వోల్టేజ్ డ్రాప్’ అంటారు. ఆపిల్ కంపెనీ తన ఐఫోన్ల కోసం అత్యంత నాణ్యమైన, స్థిరమైన ఛార్జింగ్‌ను అందించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే వారు కేబుల్ పొడవును తక్కువగా ఉంచుతారు.

2. ఐఫోన్ కేబుల్స్ ఎందుకు చిన్నవిగా ఉంటాయి?
ఆపిల్ తన ప్రొడక్ట్స్ ‘మినిమలిజం’ , ‘పోర్టబిలిటీ’ ఆధారంగా డిజైన్ చేస్తుంది. చిన్న కేబుల్స్ ఫోల్డ్ చేయడానికి సింపుల్ గా ఉంటాయి. అంతే కాకుండా ఛార్జింగ్ సమయంలో డేటా ట్రాన్స్‌ఫర్ వేగాన్ని స్థిరంగా ఉంచుతాయి. అయితే.. ఐఫోన్ 15 సిరీస్ నుంచి యూఎస్‌బీ-సి (USB-C) కి మారిన తర్వాత, కేబుల్ నాణ్యతలో మరిన్ని మార్పులు వచ్చాయి. ఆపిల్ ఒరిజినల్ కేబుల్స్ సుమారు 1 మీటర్ (3.3 అడుగులు) పొడవు ఉంటాయి.

Advertisement

3. ఆండ్రాయిడ్ కంపెనీల వ్యూహం:
చాలా ఆండ్రాయిడ్ కంపెనీలు (ముఖ్యంగా చైనీస్ బ్రాండ్లు) తమ ఫోన్లతో పాటు 1.5 మీటర్ల నుంచి 2 మీటర్ల పొడవున్న కేబుల్స్ ఇస్తున్నాయి. ఆండ్రాయిడ్ యూజర్లు ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి వాడుకోవడానికి ఇష్టపడతారని ఈ కంపెనీలు భావిస్తాయి. అయితే.. ఇక్కడ ఒక చిక్కు ఉంది. తక్కువ నాణ్యత కలిగిన పొడవైన కేబుల్ వాడితే.. అది ఫోన్ వేడెక్కడానికి కారణం కావచ్చు.

4. ఫాస్ట్ ఛార్జింగ్ ప్రభావం:
ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో 65W, 120W వంటి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తోంది. ఇంత ఎక్కువ కరెంట్ సరఫరా చేయాలంటే కేబుల్ లావుగా ఉండాలి. ఒకవేళ కేబుల్ మరీ పొడవుగా ఉంటే, ఆ ఫాస్ట్ ఛార్జింగ్ వేగం తగ్గిపోయే ప్రమాదం ఉంది. అందుకే సూపర్ ఫాస్ట్ ఛార్జర్లు ఇచ్చే కంపెనీలు కేబుల్ పొడవును పెంచడానికి వెనకాడతాయి.

Also Read: షాపింగ్ లవర్స్‌కు పండగే.. జూలైలో అమెజాన్ ప్రైమ్ డే, అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్లు!

5. డేటా ట్రాన్స్‌మిషన్ స్పీడ్:
ఛార్జింగ్ కేబుల్ కేవలం కరెంట్ కోసమే కాదు, డేటా మార్పిడి కోసం కూడా వాడతాం. పొడవైన కేబుల్స్ వాడినప్పుడు హై-స్పీడ్ డేటా ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు సిగ్నల్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆపిల్ , శాంసంగ్ వంటి ప్రీమియం బ్రాండ్లు తమ డేటా ట్రాన్స్‌ఫర్ రేట్లను కాపాడుకోవడానికి ప్రామాణిక పొడవునే వాడతాయి.

మీరు మార్కెట్లో దొరికే ఏ 3 మీటర్ల పొడవున్న కేబుల్ కొని వాడుతుంటే.. అది మీ ఫోన్ బ్యాటరీని దెబ్బతీసే అవకాశం ఉంది. వీలైనంత వరకు కంపెనీ ఇచ్చిన ఒరిజినల్ కేబుల్‌నే వాడండి. ఒకవేళ పొడవైన కేబుల్ కావాలనుకుంటే.. అది క్వాలిటీ బ్రాండ్ అయి ఉండేలా చూసుకోండి.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×