E-Paper
Advertisement

Job Stability: తరచూ జాబ్ లు మారుతున్నారా?.. బ్యాంకు లోన్లు కష్టమే?

Job Stability: తరచూ జాబ్ లు మారుతున్నారా?.. బ్యాంకు లోన్లు కష్టమే?
Advertisement

Job Stability: చాలా మంది ఏదొక అవసరానికి బ్యాంక్ లోన్ అప్లై చేస్తారు. బ్యాంకులు లోన్లను ప్రాసెస్ చేసే ముందు కొన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తాయి. వీటిల్లో మంచి కంపెనీలో స్థిరమైన ఉద్యోగం ఒకటి. ఎక్కువ కాలం మంచి పేరుకున్న కంపెనీలో జాబ్ చేస్తుంటే.. లోన్ అఫ్రూవ్ చేసేందుకు బ్యాంకులు ఇంట్రెస్ట్ చూపిస్తుంటాయి. తరచూ ఉద్యోగాలు మారుతున్న వాళ్లు పర్సనల్ లోన్ పొందడం కాస్త కష్టమవుతుంది. బ్యాంకులు లోన్ ఇచ్చే ముందు ఉద్యోగ స్థిరత్వం, క్రెడిట్‌ స్కోరు, ఇన్ కమ్, క్రెడిట్ హిస్టరీ అంచనా వేస్తాయి. ఈజీగా లోన్ పొందేందుకు ఎక్కువ కాలం పాటు ఒకే చోట ఉద్యోగం చేయడం మంచిదంటున్నారు ఎక్స్ ఫర్ట్స్.

జాబ్ స్టెబిలిటిపై బ్యాంక్స్ ఆరా

కొత్త జాబ్ ను బ్యాంకులు “సెటిలింగ్-ఇన్” పీరియడ్‌గా పేర్కొంటాయి. కొత్త జాబ్ లో సెటిల్ అయ్యే వరకు బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు కాస్త వేచి చూస్తాయి. మీ జాబ్ ఛేంజ్ రేటు ఎక్కువగా ఉంటే బ్యాంకులు లోన్ ఇచ్చే విషయంలో కాస్త ఆలోచిస్తాయి. తక్కువ టైంలో అనేక ఉద్యోగాలు మారితే, మీ ఆర్థిక క్రమశిక్షణ, లాంగ్ టర్మ్ జాబ్ స్టెబిలిటీపై బ్యాంకుకు డౌట్స్ స్టార్ట్ అవుతాయి.

Advertisement

ఉదాహరణకు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు హై పేస్కేల్, ఇతర కారణాలతో ఎక్కువగా ఉద్యోగాలు మారుతుంటారు. అందుకే ఐటీ వర్కర్స్ కు లోన్ ప్రాసెస్ కాస్త కష్టంగా ఉంటుందని ఎక్స్ ఫర్ట్స్ అంటున్నారు. అలాగే మీరు ఒక టాప్ కంపెనీ నుంచి స్టార్టప్‌కు వెళుతున్నట్లయితే, బ్యాంకులు ఉద్యోగ భద్రత గురించి ఆందోళన చెందుతాయి. అదే మీరు స్టార్టప్ నుంచి మంచి పేరున్న కంపెనీకి మారితే లోన్ ఎలిజిబిలిటీ మెరుగుపడుతుంది.

Also Read: నియామక పత్రాలలో రికార్డు సృష్టించిన తెలంగాణ సర్కార్..!

స్థిరమైన ఉద్యోగాలు

Advertisement

తరచూ ఉద్యోగాలు మారడం, కాంట్రాక్టు లేదా ఫ్రీలాన్స్ ఉద్యోగాలు చేస్తున్న వారితో పోలిస్తే, ప్రతిష్టాత్మక కంపెనీలు లేదా ప్రభుత్వ సంస్థల ఉద్యోగులను బ్యాంకు రిస్క్ లేని లోన్ రీసివర్స్ గా పరిగణిస్తాయి. ఎంప్లాయీ ప్రొబేషన్ పీరియడ్‌లో ఉన్నట్లయితే, లోన్ అప్రూవ్ చేసేందుకు బ్యాంకులు ఆలోచిస్తాయి. ఒకోసారి లోన్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తుంటాయి. మంచి పేరున్న కంపెనీలో చేరడం లేదా జీతంలో భారీగా హైక్ ఉన్నప్పుడు బ్యాంకులు లోన్ అప్రూవల్ విషయంలో పాజిటివ్ గానే ఉంటాయి. లోన్ తీసుకునే ఉద్దేశం ఉన్న వారు ఉద్యోగాల మారే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హై క్రెడిట్‌ స్కోరు, బెస్ట్ క్రెడిట్ హిస్టరీ రికార్డు మెయింటైన్ చేయాలి. అలాగే తక్కువ టైంలో ఉద్యోగాలు మారడం అంత బెస్ట్ ఆప్షన్ కాదు. జాబ్ మారిన తర్వాత కొత్త లోన్ అప్లై చేయడానికి ఆరు నెలలు వేచి ఉండాలని ఎక్స్ ఫర్ట్స్ చెబుతున్నారు.

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×