E-Paper
Advertisement

మే 4న బిగ్ టీవీలో ‘మహా సంగ్రామం’.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మెగా కవరేజ్!

మే 4న బిగ్ టీవీలో ‘మహా సంగ్రామం’.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మెగా కవరేజ్!
Advertisement

BIG TV election results live coverage: దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది తీర్పుకు సమయం ఆసన్నమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారో మే 4వ తేదీన తేలిపోనుంది. 5 రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై బిగ్ టీవీ (BIG TV) అత్యంత వేగవంతమైన, ఖచ్చితమైన విశ్లేషణలతో మీ ముందుకు రానుంది. మే 4న ఉదయం 7 గంటల నుంచే నిరంతరాయంగా లైవ్ కవరేజ్ ప్రారంభం కానుంది. ప్రతి నిమిషం మారుతున్న ట్రెండ్స్, కీలక అభ్యర్థుల గెలుపోటములు, నియోజకవర్గాల వారీగా స్పష్టమైన గణాంకాలను అందించడానికి మా బిగ్ టీవీ టీం సర్వసన్నద్ధమైంది.

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొడతారా? లేక బీజేపీ పాగా వేస్తుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరోవైపు తమిళనాడులో డీఎంకే ఆధిపత్యానికి నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ ఏ మేరకు గండి కొడుతుందనేది ఆసక్తికరంగా మారింది. కేరళలో కూటముల మధ్య పోరు, అస్సాంలో బీజేపీ పట్టు.. ఇలా అన్ని రాష్ట్రాల సమగ్ర ఫ‌లితాల‌ను బిగ్ టీవీ తన ప్రత్యేక గ్రాఫిక్స్, క్షేత్రస్థాయి రిపోర్టింగ్‌తో కళ్లకు కట్టినట్లు చూపనుంది.

Advertisement

ఉదయం 7 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం కాగానే తొలి ట్రెండ్స్‌ను బిగ్ టీవీ అందిస్తుంది. సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులతో కూడిన ప్యానెల్ చర్చలు ఫలితాల వెనుక ఉన్న లోతైన అర్థాలను వివరించనున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి? మ్యాజిక్ ఫిగర్ దిశగా ఎవరు దూసుకుపోతున్నారు? కింగ్ మేకర్లు ఎవరు కాబోతున్నారు? వంటి ప్రతి చిన్న అంశాన్ని బిగ్ టీవీలో మీరు వీక్షించవచ్చు. మీ టీవీలు, మొబైల్స్‌లో బిగ్ టీవీని అనుసరిస్తూ దేశ రాజకీయ దిశను మార్చబోయే ఈ తీర్పును ప్రత్యక్షంగా చూడండి.

Read Also: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. నేరుగా రైతుల నుంచే కొనుగోళ్ళు..?

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×