E-Paper
Advertisement

Best Wearable: ఆపిల్, శాంసంగ్, హవాయ్ కంపెనీలను దాటేసిన చైనా కంపెనీ.. నెంబర్ వన్ వేరియబుల్ బ్రాండ్ అదే

Best Wearable: ఆపిల్, శాంసంగ్, హవాయ్ కంపెనీలను దాటేసిన చైనా కంపెనీ.. నెంబర్ వన్ వేరియబుల్ బ్రాండ్ అదే
Advertisement

Xiaomi Wearable| గ్లోబల్ వేరబుల్స్ మార్కెట్‌లో చైనా బ్రాండ్ మళ్లీ మొదటి స్థానం సాధించింది. గత ఐదేళ్లుగా ఈ స్థానం దూరంగా ఉన్న షావోమీ ఈ సారి కమ్‌బ్యాక్ చేసింది. ఇప్పుడు అధికారికంగా టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. Omdia అనే పరిశోధన సంస్థ నివేదిక ఈ విషయాన్ని నిర్ధారించింది. 2025లో Xiaomi ప్రపంచ వేరబుల్ షిప్‌మెంట్స్‌లో అగ్రస్థానంలో ఉంది.

2025లో భారీగా పెరిగిన Xiaomi షిప్‌మెంట్స్ 

2025లో షావోమీ 20 కోట్లకు పైగా వేరబుల్ యూనిట్లు షిప్ చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 6 శాతం వృద్ధి చూపించింది. ప్రపంచ మొత్తం షిప్‌మెంట్స్‌లో 18 శాతం మార్కెట్ షేర్ సాధించింది. ఆపిల్ 17 శాతంతో రెండో స్థానంలో ఉంది. హవాయ్ 16 శాతంతో మూడో స్థానంలో ఉంది. పోటీ చాలా గట్టిగా ఉంది. అయినా షావోమీ మొదటి స్థానం సాధించింది.

టాప్ 5లో Samsung, Garmin 

Advertisement

2025లో 9 శాతం షేర్‌తో టాప్ 5లో శాంసంగ్ చోటు సంపాదించింది. గార్మిన్ 5 శాతం షేర్‌తో టాప్ 5లోకి వచ్చింది. ఈ సంఖ్యలు వేరబుల్స్ మార్కెట్‌లో పోటీ ఎంత బలంగా ఉందో చూపిస్తున్నాయి.

ఇప్పుడు హార్డ్‌వేర్ కంటే ఎకోసిస్టమ్ ముఖ్యం

Omdia పరిశోధన నిపుణురాలు సింథియా చెన్ మాట్లాడుతూ.. ఇప్పుడు వేరబుల్స్ పోటీ హార్డ్‌వేర్ మీద మాత్రమే ఆధారపడటం లేదని చెప్పారు. గతంలో డిస్‌ప్లే క్వాలిటీ, బ్యాటరీ లైఫ్, సెన్సార్ల సంఖ్య మీద పోటీ ఉండేది. ఇప్పుడు ఫోన్లు, టాబ్లెట్లు, కార్లు, స్మార్ట్ హోమ్‌లతో సాఫీగా కనెక్ట్ అయ్యే ఎకోసిస్టమ్ ముఖ్యమైంది. మంచి ఎకోసిస్టమ్ ఉంటే యూజర్లు బ్రాండ్‌పై లాయల్టీ పెంచుకుంటారు.

మల్టీ ప్రొడక్ట్స్‌తోనే షావోమీ విజయం

Advertisement

Xiaomi విజయం ఒకే డివైస్ మీద ఆధారపడలేదు. విస్తృతమైన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోతో గ్రోత్ సాధించింది. సరసమైన ధరల సెగ్మెంట్ చాలా బాగా పనిచేసింది. Mi Band సిరీస్ ప్రపంచవ్యాప్తంగా బాగా అమ్మకాలు సాధిస్తోంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్‌వాచ్‌లు కూడా బాగా సహాయపడ్డాయి. ఇవి అమ్మకాల ధరలను క్రమంగా పెంచాయి. సరసమైన ధరలు, ఇన్నోవేషన్ రెండూ Xiaomi బ్యాలెన్స్ చేసింది.

హెల్త్ ట్రాకింగ్ మరింత అడ్వాన్స్‌డ్

ఇప్పుడు వేరబుల్స్ స్టెప్ కౌంటింగ్‌తో ఆగిపోలేదు. హార్ట్ రేట్ మాత్రమే కాదు.. 24 గంటల హెల్త్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్, స్ట్రెస్ ట్రాకింగ్, ఆక్సిజన్ లెవల్ మెజర్‌మెంట్ వంటివి సాధారణమయ్యాయి. యూజర్లు కచ్చితమైన, నిరంతర హెల్త్ మానిటరింగ్ డిమాండ్ చేస్తున్నారు. షావోమీ తన వేరబుల్స్‌లో ఈ ఫీచర్లను మెరుగుపరిచింది.

భవిష్యత్‌లో మరింత తీవ్రం కానున్న పోటీ

వేరబుల్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ఆపిల్, హవాయ్ బలమైన పోటీదారులుగా ఉన్నారు. Samsung, Garmin స్థిరంగా ఉన్నాయి. కానీ 2025లో షావోమీ మంచి మొమెంటం చూపించింది. భవిష్యత్తులో AI ఇంటిగ్రేషన్, ఎకోసిస్టమ్ డెవలప్‌మెంట్ మీద పోటీ ఉంటుంది. యూజర్లకు మంచి ఇన్నోవేషన్, సరసమైన ధరలు లభిస్తాయి.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×