Geethu Royal : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు గా మారారు.. అందులో ప్రముఖ యూట్యూబర్ గీతు రాయల్ ఒకరు. ఈమె ఒకప్పుడు యూట్యూబ్ వీడియోలతో బాగా పాపులర్ అయింది.. ఆ తర్వాత యూట్యూబ్ తో పాటుగా సోషల్ మీడియా అకౌంట్లో కూడా ఆమె వీడియోలను షేర్ చేస్తూ బాగా ట్రెండ్ అవుతుంది.. అయితే ఈ మధ్య నిత్యం గీతూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గీతు మరో వివాదంలో చిక్కుకుంది.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆమె చేసిన వీడియోల వల్ల చిక్కుల్లో పడ్డది. అక్కడ ఫోటోలు, వీడియోలు తియ్యకూడదు అని పెట్టిన రూల్స్ ను బ్రేక్ చేసింది.. దాంతో ఆమె పై టీటీడీ అధికారులతో పాటుగా అందరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తాజాగా ఈ వివాదం పై ఆమె స్పందించారు.. ఒక వీడియోను తన సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో ఆమె ఏమన్నదో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..
తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో నిబంధనలు ఉల్లంఘించి రీల్స్ చేసినందుకు ఆమెపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.. తెలుగు వారి ఆరాధ్య దైవమైన పుణ్యక్షేత్రమైన తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా రీల్స్ చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పవిత్రమైన స్థలంలో ఆమె చేసిన రీల్స్ పై తెలుగు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో గీతు ఓ వీడియోని రిలీజ్ చేసింది.. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. అందరికీ గుడ్ న్యూస్. నా మీద చర్యలు తీసుకుంటారంట. హ్యాపీగా ఉండండి. ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దది చేసి అన్ని వీడియోలు చేసినందుకు థ్యాంక్యూ సోమచ్.. ఆల్రెడీ నా జీవితం సగం అయిపోయింది. మిగతా కాసింత కూడా ఇప్పుడు అయిపోతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.. ఆమెపై యాక్షన్ తీసుకోడానికి టీటీడీ అధికారులు సిద్ధమయ్యారని తెలుస్తోంది.. ఈ వివాదంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పరోక్షంగా స్పందించారు. నా జీవితాన్ని ఇది చేసేసారు మీరందరూ హ్యాపీగా ఉండండి అంటూ ఆ వీడియోలో గీతు అంది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..
Also Read : ఫోన్ కొట్టేసిన శైలు.. చక్రికీ మహా స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంట్లోంచి వెళ్ళిపోతుందా..?
గలాటా గీతూ రాయల్గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బిగ్ బాస్షో ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న ఈ అమ్మడు యూట్యూబ్ వీడియోలతో నెగిటివిటీని కూడా సొంతం చేసుకుంది.. గీతూ రాయల్ ఇటీవల నలుగురు యువకులతో కలిసి తిరుమల ఘాట్ రోడ్డుతో పాటుగా శ్రీవారి ఆలయం ఎదుట, శ్రీవారి పుష్కరిణి సమీపంలో, అలాగే కౌంటర్ వద్ద రీల్స్ చేసింది. రవితేజ నటించిన ఖడ్గం మూవీలోని గోవింద గోవింద పాటకు డాన్స్ కూడా చేసింది ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దానిపై టీటీడీ అధికారులు స్పందించారు.. నిబంధనలు విధించిన ప్రదేశంలో ఆమె అలా చేయడం తప్పు అంటూ ఆమెపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.. ఆ వార్త కాస్త గీతు దగ్గరికి చేరడంతో ఆమె మరో వీడియో ని పోస్ట్ చేసి ఎమోషనల్ అయింది. మరి టీటీడీ అధికారులు గీతూపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది..
?igsh=MXFnbnR0amRid3N3Ng==