E-Paper
Advertisement

LPG Prices: సిలిండర్ ధర పెరిగిందా? తగ్గిందా?.. గ్యాస్ బుక్ చేసే ముందు ఇది తెలుసుకోండి ఫస్ట్!

LPG Prices: సిలిండర్ ధర పెరిగిందా? తగ్గిందా?.. గ్యాస్ బుక్ చేసే ముందు ఇది తెలుసుకోండి ఫస్ట్!
Advertisement

LPG Prices: ప్రస్తుత రోజుల్లో సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ ప్రతీ ఒక్కరికీ ఎల్పీజీ గ్యాస్ తప్పనిసరిగా మారిపోయింది. దేశంలో పెద్ద ఎత్తున ప్రజలు.. వంట కోసం గ్యాస్ పొయ్యి మీదనే ఆధారపడుతున్నట్లు నివేదికలు సైతం పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ ధరల్లో ఏమాత్రం మార్పు వచ్చినా.. అది పెద్ద ఎత్తున ప్రజలపై ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే నెల ప్రారంభంలో (మే 1) భారీ ఎత్తున వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగి.. అందరికీ షాక్ ఇచ్చాయి. మరి ఇవాళ డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయా? తగ్గాయా? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ధర ఎలా ఉంది? ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

స్థిరంగా గ్యాస్ ధరలు..

ఇవాళ (మే 5వ తేదీ) గ్యాస్ ధరల్లో ఎలాంటి హెచ్చుతగ్గులు చోటుచేసుకోలేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో అవి స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లేటెస్ట్ నివేదిక ప్రకారం.. దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 3,071గా ఉంది. ముంబయిలో రూ.3,024 పలుకుతోంది. కోల్ కత్తా, చెన్నైలలో వరుసగా రూ.3,202, రూ.3,237కు కమర్షియల్ సిలిండర్లను విక్రయిస్తున్నారు. మరోవైపు గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.913గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

Advertisement

గ్యాస్ ధరల్లో ఎలాంటి హెచ్చుతగ్గులు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ వాటి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర ప్రస్తుతం హైదరాబాద్ లో రూ.965గా ఉంది. కమర్షియల్ సిలిండర్ ను రూ.3,315కి విక్రయిస్తున్నారు. మరోవైపు ఏపీలోని విజయవాడలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.937.50 పలుకుతోంది. అటు వాణిజ్య సిలిండర్ ను రూ.3,300-3,450 మధ్య విక్రయిస్తున్నారు.

3 నెలల్లో 3సార్లు పెంపు..

ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం కారణంగా చమురు సరఫరాలో అనిశ్చితి ఏర్పడి.. గ్యాస్ ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నట్లు ఇటీవల ఇండియన్ ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. అయితే ఇరాన్ యుద్ధం ఫిబ్రవరిలో ప్రారంభం కాగా అప్పటి నుంచి మూడుసార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. మార్చిలో రూ.144, ఏప్రిల్ లో రూ.195, మే 1వ తేదీన ఏకంగా రూ.993 చొప్పున వాణిజ్య సిలిండర్ ధరలను పెంచారు. అయితే సామాన్యులు వాడే డొమెస్టిక్ సిలిండర్ ధరలను మాత్రం కేంద్రం స్థిరంగా ఉంచడం కాస్త ఊరటను కలిగిస్తోంది.

Advertisement

Also Read: LG 2026 ధమాకా.. సరికొత్త వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్‌లు వచ్చేశాయ్.. ఫీచర్లు చూస్తే గూస్ బంప్సే!

పెట్రోల్, డీజిల్ ధరలు..

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి చమురు ధరలు పెరుగుతాయని ప్రచారం జరిగినప్పటికీ.. ఇవాళ్టి వరకూ అలాంటిదేమి జరగలేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.46కు అమ్ముతున్నారు. డీజిల్ రూ.95.70 పలుకుతోంది. మరోవైపు ఏపీలోని అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.109.36, డీజిల్ రూ.97.18కు విక్రయిస్తున్నారు.

Also Read: OTT బాగా చూస్తారా? అయితే ఈ ప్లాన్స్ మీకోసమే.. తక్కువ ధరలో అన్‌లిమిటెడ్ వినోదం!

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×