E-Paper
Advertisement

LG 2026 ధమాకా.. సరికొత్త వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్‌లు వచ్చేశాయ్.. ఫీచర్లు చూస్తే గూస్ బంప్సే!

LG 2026 ధమాకా.. సరికొత్త వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్‌లు వచ్చేశాయ్.. ఫీచర్లు చూస్తే గూస్ బంప్సే!
Advertisement

LG Appliances 2026: దేశంలో మంచి గుడ్ విల్ కలిగిన ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో ఎల్జీ (LG) ఒకటి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ ప్రతీ ఒక్కరూ ఎల్జీ విడుదల చేసిన గృహోపకరణ వస్తువులు కొనేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలో కస్టమర్లను మరింత ఆకర్షించేందుకు అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎల్జీ ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే LG ఎలక్ట్రానిక్స్ ఇండియా.. తన 2026 హోమ్ అప్లయన్స్ లైనప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో కూడిన అత్యాధునిక రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ఈ సరికొత్త లైనప్ లోని ప్రధాన ఫీచర్లు, ధరల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

అత్యాధునిక రిఫ్రిజిరేటర్లు

LG ఈ ఏడాది సరికొత్త ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్లను మార్కెట్ కు పరిచయం చేసింది. ఇవి 574L నుండి 610L సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చాయి. వీటిలోని ఇన్ స్టా వ్యూ డోర్ ఇన్ డోర్ (Insta View Door in Door), ప్లంబింగ్ అవసరం లేని ఆటో ఐస్ మేకర్, స్మార్ట్ లెర్నర్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇవి వినియోగదారుల అలవాట్లను బట్టి కూలింగ్‌ను వాటంతట అవే అడ్జస్ట్ చేసుకుంటాయి. మరోవైపు ఎసెన్షియల్ సిరీస్ లో భాగంగా మధ్యతరగతి కుటుంబాల కోసం బడ్జెట్ ధరలో కొత్త మోడల్ ఫ్రిడ్జ్ ను ఈ ఏడాది ఎల్జీ తీసుకొచ్చింది. ఇవి ఇన్వర్టర్లపై కూడా పని చేయగలడం విశేషం.

ఏఐ వాషింగ్ మెషీన్లు

Advertisement

బట్టల రకాన్ని బట్టి వాషింగ్ స్టైల్‌ను మార్చుకునే.. ఏఐ డీడీ 2.0 (AI DD 2.0) టెక్నాలజీతో కూడిన ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లను LG ఈ ఏడాది విడుదల చేసింది. ఇవి 12 కేజీల నుండి 20 కేజీల సామర్థ్యంతో ఇవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆటోమేటిక్ డిటర్జెంట్ డిస్పెన్సింగ్, పెట్ కేర్ సైకిల్స్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు వీటిలో ఉన్నాయి. మరోవైపు దేశీయ పరిస్థితులకు అనుగుణంగా ‘హార్డ్ వాటర్ వాష్’ ఫీచర్‌తో టాప్ లోడ్ మోడళ్లను, తక్కువ ధరలో సెమీ ఆటోమేటిక్ వేరియంట్లను సైతం ఎల్జీ ఈ ఏడాది లాంచ్ చేసింది.

కిచెన్ సంబంధిత ప్రొడక్ట్స్..

LG 2026 లైనప్ నుంచి అధునాతన డిష్ వాషర్లు సైతం మార్కెట్లో అడుగుపెట్టాయి. దేశీయ కిచెన్ కు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన 15 ప్లేస్ సెట్టింగ్ గల ట్రూ స్టీమ్ (TrueSteam) డిష్ వాషర్లు కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఎయిర్ ఫ్రై మోడ్, 330+ ఆటో కుక్ మెనూలతో కొత్త కన్వర్టబుల్ మైక్రోవేవ్ ఓవెన్లను సైతం ఎల్జీ ఈ ఏడాది లాంచ్ చేసింది. అదే విధంగా స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్, యూవీ స్టెరిలైజేషన్ ఫీచర్లతో సురక్షితమైన తాగునీటిని అందించే అధునాతన వాటర్ ప్యూరిఫైయర్లను సైతం ఎల్జీ ప్రవేశపెట్టింది.

Advertisement

Also Read: OTT బాగా చూస్తారా? అయితే ఈ ప్లాన్స్ మీకోసమే.. తక్కువ ధరలో అన్‌లిమిటెడ్ వినోదం!

ధరలు ఎలా ఉన్నాయంటే?

ఎసెన్షియల్ విభాగంలో తీసుకొచ్చిన రిఫ్రిజిరేటర్ల ప్రారంభ ధర రూ.25,500 కాగా, వాషింగ్ మిషన్ ధర రూ.20,990గా ఉంది. అలాగే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ రూ.17,300, అధునాతన ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ రూ.62,900, ఫ్రెంచ్ డోర్ ఫ్రిడ్జ్ రూ.1.18 లక్షలు, సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు రూ.1.09 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. ఇక కిచెన్ ప్రొడక్ట్స్ కు వస్తే కన్వర్టిబుల్ మైక్రోవేవ్ ఓవెన్స్ ప్రారంభ ధర రూ.28,700, వాటర్ ప్యూరిఫైయర్స్ రూ.16,600, ట్రూ డిష్ వాషర్ ధర రూ.73,500గా ఎల్జీ నిర్ణయించింది.

Also Read: Strait of Hormuz: హర్మూజ్ జలసంధి వద్ద టెన్షన్.. మూడు నౌకలపై ఇరాన్ దాడి, తిప్పికొట్టినట్టు ట్రంప్ ప్రకటన

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×