E-Paper
Advertisement

Washing Mistakes: వాషింగ్ మెషీన్ వాడేటప్పుడు ఈ తప్పలు అస్సలు చేయకండి..

Washing Mistakes: వాషింగ్ మెషీన్ వాడేటప్పుడు ఈ తప్పలు అస్సలు చేయకండి..
Advertisement

Washing Mistakes: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లోనూ వాషింగ్ మెషీన్‌లు కనిపిస్తున్నాయి. మన జీవనంలో అవి కూడా భాగమైపోయాయి. అయితే వాటి వల్ల ఎంత ఉపయోగముందో వటి వాడకం సరిగా లేనప్పుడు కూడా దాని నుంచి వచ్చే ప్రతికూలతలు అంతే విధంగా ఉంటాయి. ముఖ్యంగా వాషింగ్ మెషీన్ పని అయిపోయాకా చాలా మంది కనీసం దాని వంక కూడా చూడరు. దీంతో వాషింగ్ మెషీన్ పాడవడానికి ఆస్కారం ఎక్కువ వుంది. దానిని వాడేటప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మెషీన్ జీవితకాలాన్ని తగ్గించడమే కాకుండా, బట్టలను కూడా పాడుచేస్తాయి. వాషింగ్ మెషీన్ ఎక్కువ కాలం మన్నాలన్నా, బట్టలు శుభ్రంగా ఉండాలన్నా ఈ క్రింది తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి.

Read also-Smartphone Comparison: గెలాక్సీ M17e vs రియల్‌మి P4 లైట్ 5G vs పోకో C85x.. రూ.15000 ధరలో బెస్ట్ ఏది?

బట్టలను అతిగా నింపడం

Advertisement

చాలామంది సమయం ఆదా అవుతుందని మెషీన్ సామర్థ్యానికి మించి బట్టలు వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల బట్టలు సరిగ్గా తిరగవు, దీనివల్ల మురికి వదలదు. అంతేకాకుండా, మెషీన్ మోటార్‌పై ఒత్తిడి పడి త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. ఎప్పుడూ మెషీన్‌లో కనీసం ఒక వంతు ఖాళీ ఉండేలా చూసుకోవాలి. దీంతో బట్టలు శుభ్రంగా వదులుతాయి మెషీన్ మీద కూడా ప్రభావం తక్కువ పడుతుంది.

వాటిని తనిఖీ చేయడం మర్చిపోకండి…

బట్టలు మెషీన్‌లో వేసే ముందు జేబుల్లో కాయిన్స్, తాళం చెవులు, సేఫ్టీ పిన్నులు వంటివి ఉన్నాయేమో చూడాలి. ఇవి వాషింగ్ టబ్‌కు గీతలు పడేలా చేస్తాయి లేదా డ్రైనేజీ పైపులో ఇరుక్కుపోయి నీరు బయటకు వెళ్లకుండా అడ్డుపడతాయి. దీంతో అక్కడ నీళ్లు నిలిచి తుప్పు పట్టే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అందుకే వాషింగ్ లో వేసే ముందు బట్టలు తనఖీ తప్పని సరిగా చేయాలి.

డిటర్జెంట్ ఎక్కువ వాడకం

Advertisement

ఎక్కువ సర్ఫ్ వాడితే బట్టలు ఎక్కువ శుభ్రపడతాయని అనుకోవడం తప్పు. అతిగా డిటర్జెంట్ వాడితే నురగ ఎక్కువగా వచ్చి మెషీన్ సెన్సార్లను పాడు చేస్తుంది. అలాగే బట్టలపై తెల్లటి మచ్చలు పడతాయి. మెషీన్ రకాన్ని బట్టి (Top load/Front load) తగిన పరిమాణంలోనే డిటర్జెంట్ వాడాలి. అన్నింటికే ఒకే డిటర్నెంట్ వాడటం మంచిది కాదు. దీని వల్ల మెషీన్ పనిచేసే కాల పరిమితి తగ్గిపోతుంది.

Read also-Budget Microwave Ovens: తక్కువ కరెంట్ వినియోగించే మైక్రోవేవ్ ఓవెన్స్.. బడ్జెట్ ధరలో బెస్ట్ ఇవే

జిప్పులు తీసి ఉంచడం

ప్యాంట్లు లేదా జాకెట్లకు ఉండే జిప్పులు తీసి ఉంచితే, అవి తిరిగేటప్పుడు మిగతా సున్నితమైన బట్టలను చింపివేసే ప్రమాదం ఉంది. కాబట్టి జిప్పులు వేసి, బట్టలను తిరగేసి మెషీన్‌లో వేయడం మంచిది. దీంతో పక్క వాటిని అవి చించకుండా ఉంటాయి.

వాష్ అయిన వెంటనే..

బట్టలు ఉతికిన తర్వాత గంటల తరబడి మెషీన్‌లోనే వదిలేయడం వల్ల వాటి నుండి దుర్వాసన వస్తుంది. ఇది మెషీన్ లోపల బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. వాషింగ్ పూర్తి కాగానే బట్టలు ఆరబెట్టడం ఉత్తమం.

తలుపు వెంటనే..

పని పూర్తయ్యాక వెంటనే మెషీన్ తలుపు (Door) మూసేయకూడదు. లోపల ఉన్న తేమ ఆరిపోయే వరకు కనీసం అరగంట పాటు తలుపు తెరిచి ఉంచాలి. దీనివల్ల లోపల బూజు పట్టకుండా ఉంటుంది. మీ బట్టలు మరింత హైజీన్ అవుతాయి. కనీసం ఆరునెలలకు ఒక సారి అయినా మొత్తం శుభ్రం చేయించాలి. నెలకు రెండు సార్లు అయినా ఫుల్ డ్రమ్ క్లీన్ చేయాలి. ఇలా వాడితే మెషీన్ ఎక్కవ కాలం పనిచేయడమే కాకుండా బట్టలు కూడా హైజీన్ గా ఉంటాయి.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×