E-Paper
Advertisement

Ayurveda Oils: ఈ ప్రాచీన నూనెలు వేసవిలో జుట్టు రాలిపోకుండా అడ్డుకుంటాయి

Ayurveda Oils: ఈ ప్రాచీన నూనెలు వేసవిలో జుట్టు రాలిపోకుండా అడ్డుకుంటాయి
Advertisement

వేసవి కాలం రాగానే చాలా మందికి జుట్టు రాలిపోవడం సమస్య పెరుగుతుంది. ఎండలు, చెమట, దుమ్ము, కాలుష్యం వంటి కారణాలతో తలపై ఉన్న చర్మం బలహీనంగా మారుతుంది. దీంతో జుట్టు నరాలు బలహీనపడి ఎక్కువగా జుట్టు ఊడిపోతుంది. కానీ ఈ సమస్యకు మన ఇంట్లోనే ఉన్న సహజమైన పరిష్కారాలు చాలానే ఉన్నాయి. పాతకాలం నుంచి మన పెద్దలు ఉపయోగిస్తున్న కొన్ని ఆయుర్వేద నూనెలు జుట్టును కాపాడటంలో చాలా ఉపయోగపడతాయి.

ఉసిరి నూనె
ఉసిరికాయ నూనె గురించి మొదట చెప్పుకోవాలి. ఉసిరికాయలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు రూట్స్‌ను బలంగా చేసి జుట్టు రాలిపోవడం తగ్గిస్తుంది. వేసవిలో సూర్యరశ్మి వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది. అలాంటి నష్టాన్ని తగ్గించడంలో కూడా ఉసిరికాయ సహాయపడుతుంది. ఉసిరికాయను పేస్ట్‌గా చేసుకుని లేదా ఆయిల్ రూపంలో వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Advertisement

వేప నూనె
వేప నూనె మన పూర్వీకులు వాడేవారు. వేపకు సహజంగా బ్యాక్టీరియా, ఫంగస్‌ను తగ్గించే గుణాలు ఉన్నాయి. వేసవిలో చెమట ఎక్కువగా పడటం వల్ల తలలో డాండ్రఫ్, ఇన్ఫెక్షన్లు రావచ్చు. వేప ఆకులు మరిగించిన నీటితో తల కడిగితే లేదా పేస్టులా చేసుకుని తలకు పట్టిస్తే ఈ సమస్యలు తగ్గుతాయి. తల చర్మం శుభ్రంగా ఉంటుంది. వేప నూనె అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటే ఎంతో మంచిది.

Also read: Smart Nails: ఈ స్మార్ట్ గోళ్లు అతికించుకుంటే మీకు నచ్చిన గోళ్ల రంగును సెకన్లలో మార్చేసుకోవచ్చు

Advertisement

బ్రాహ్మి నూనె
బ్రాహ్మి కూడా జుట్టుకు చాలా మంచిది. చాలా మందికి ఒత్తిడి వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. బ్రాహ్మి తలకు చల్లదనాన్ని ఇస్తుంది. బ్రాహ్మి ఆయిల్‌తో తలకు మసాజ్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా జుట్టు కూడా బలంగా మారుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

అలోవోరా
అలొవెరా కూడా వేసవిలో జుట్టుకు చాలా ఉపయోగకరం. ఇది తల చర్మానికి తేమను ఇస్తుంది. వేసవిలో జుట్టు ఎండిపోయి కఠినంగా మారుతుంది. అలాంటి సమయంలో అలొవెరా జెల్‌ను తలకు రాస్తే జుట్టు మృదువుగా మారుతుంది. అలాగే డ్యామేజ్ అయిన జుట్టును సరిచేయడంలో కూడా ఇది సహాయపడుతుంది.

Also read: Hyundai Creta: హ్యూండాయ్ క్రెటా కార్ కొనాలంటే ఈ నెల జీతం ఎంతుండాలి? నెలకు ఎంత ఈఎమ్ఐ కట్టాలి?

శీకాయ
శీకాయ సహజమైన షాంపూ లాంటిది. శీకాయతో జుట్టు శుభ్రం చేసకుంటే ఎంతో మంచిది. కానీ సహజమైన ఆయిల్స్ మాత్రం పోవు. వేసవిలో తరచుగా తలస్నానం చేయాల్సి వస్తుంది కాబట్టి శికాకాయ వాడటం వల్ల జుట్టుకు హాని ఉండదు. ఇది జుట్టును మృదువుగా ఉంచుతుంది.

వేసవిలో జుట్టు రాలిపోవడం సాధారణమే అయినా, సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ సహజమైన ఔషధ పదార్థాలను రెగ్యులర్‌గా వాడితే కెమికల్ ప్రోడక్ట్స్ అవసరం కూడా తగ్గుతుంది. తల చర్మం శుభ్రంగా ఉంచడం, తగినంత నీళ్లు తాగడం, పోషకాహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×