E-Paper
Advertisement

వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!

వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!
Advertisement

AC as air purifier in winter: చలికాలం వచ్చిందంటే చాలు, చలితో పాటు గాలిలో కాలుష్యం, పొగమంచు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. దీని వల్ల ఇళ్లలో ఉండే చిన్న పిల్లలు, వృద్ధులు శ్వాసకోస సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. మార్కెట్లో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎయిర్ ప్యూరిఫైయర్లు కొనలేక సతమతమవుతుంటారు. అయితే మీ ఇంట్లో ఉన్న ఎసీ ద్వారానే గాలిని పూర్తిగా శుభ్ర పరుచుకోవచ్చని మీకు తెలుసా? ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మీ ఏసీని ఎయిర్ ప్యూరిఫైయర్‌గా మార్చే అద్భుతమైన ట్రిక్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

1. ఏ మోడ్ గాలిని శుభ్రపరుస్తుంది?

వింటర్‌లో ఏసీని కూలింగ్ మోడ్‌లో నడిపితే గది మరింత చల్లగా మారుతుంది. కాబట్టి.. ఈ సమయంలో ఏసీని ‘ఫ్యాన్ మోడ్’ లేదా ‘డ్రై మోడ్’ (లో ఉంచడం బెస్ట్.

Advertisement

ఫ్యాన్ మోడ్: ఇది కంప్రెసర్‌ను ఆన్ చేయకుండా.. కేవలం గదిలోని గాలిని తిప్పుతుంది. దీని వల్ల గాలి ఫిల్టర్ల గుండా పదే పదే ప్రవహించి శుభ్రపడుతుంది.

డ్రై మోడ్: గాలిలో ఉండే తేమను తగ్గించడంతో పాటు, తేమ ద్వారా వ్యాపించే బ్యాక్టీరియాను అడ్డుకోవడంలో.. ఇది సహాయ పడుతుంది.

2. ఏసీ యాంటీ-డస్ట్ ఫిల్టర్ల పాత్ర:

Advertisement

ప్రతి ఏసీలోనూ ఇంటర్నల్ ఫిల్టర్లు ఉంటాయి. ఇవే గాలిలోని దుమ్మును పీల్చుకుంటాయి. అందుకే చలికాలం ప్రారంభానికి ముందు ఈ ఫిల్టర్లను విప్పదీసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. ఒకవేళ మీ ఏసీ మోడల్ పాతదైతే.. మార్కెట్‌లో లభించే చిన్నపాటి యాంటీ-బ్యాక్టీరియల్ లేదా కార్బన్ ఫిల్టర్ షీట్లను రూ. 300 నుంచి రూ. 500 ఖర్చుతో అమర్చుకోవచ్చు. ఇవి గాలిలోని హానికరమైన దుమ్ము కణాలను సమర్థవంతంగా అడ్డుకుంటాయి.

3. ప్రొఫెషనల్ డీప్ క్లీనింగ్ :

మనం రోజూ వాడే ఏసీ లోపల దుమ్ము, శిథిలాలు పేరుకుపోతాయి. వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి ఏసీ టెక్నీషియన్‌తో.. సర్వీసింగ్ చేయించడం మంచిది. దీని వల్ల ఏసీ కాయిల్స్ శుభ్రపడి, లోపలి నుంచి వచ్చే గాలి పూర్తిగా స్వచ్ఛంగా మారుతుంది. సర్వీసింగ్.. ఛార్జీలు సాధారణంగా రూ. 400 నుంచి రూ. 600 వరకు ఉంటాయి.

4. ఎసెన్షియల్ ఆయిల్స్ ట్రిక్ :

గాలి శుభ్ర పడటంతో పాటు ఇంట్లో మంచి సువాసన రావడానికి ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వొచ్చు.ఏసీ ఫిల్టర్ క్లీన్ చేసిన తర్వాత దానిపై కొన్ని చుక్కలు లావెండర్ లేదా యూకలిప్టస్ ఆయిల్ రాయండి. ఏసీ ఆన్ చేసినప్పుడు ఆ సువాసన గది అంతటా వ్యాపించి, శ్వాస తీసుకోవడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. వింటర్‌లో ముక్కు దిబ్బడ సమస్య ఉన్నవారికి ఇది ఎంతో రిలీఫ్ ఇస్తుంది.

Also Read: ల్యాప్‌టాప్‌‌పై నీళ్లు పడ్డాయా? ఆన్ చేసే.. ముందు ఈ ఒక్క తప్పు చేయెద్దు!

5. వెంటిలేషన్ ,ఏసీ కాంబినేషన్ :

కేవలం ఏసీ మీద మాత్రమే ఆధారపడకుండా.. ఉదయం పూట కాసేపు కిటికీలు తెరిచి స్వచ్ఛమైన గాలి వచ్చేలా చూసుకోవాలి. ఆ తర్వాత మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో ఇళ్లలోని కిటికీలు మూసివేసి, ఏసీని ఫ్యాన్ మోడ్‌లో రన్ చేస్తే బయటి కాలుష్య కణాలు లోపలికి రాకుండా ఇల్లు పూర్తిగా సేఫ్‌గా ఉంటుంది.

ఈ చిట్కా పాటించడం వల్ల లాభాలు ఏంటి?

డబ్బు ఆదా: వేల రూపాయలు పెట్టి ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాల్సిన అవసరం ఉండదు.

ఆరోగ్య రక్షణ: చలికాలంలో వచ్చే శ్వాస సంబంధిత అలర్జీలు, ఆస్తమా వంటి సమస్యల నుంచి కుటుంబ సభ్యులను కాపాడుకోవచ్చు.

కరెంట్ ఆదా: కూలింగ్ మోడ్ కాకుండా.. ఫ్యాన్ లేదా డ్రై మోడ్ వాడటం వల్ల కరెంట్ వాడకం చాలా తక్కువగా ఉంటుంది.

ఈ చలికాలంలో మీ ఇంట్లోని ఏసీని ఈ చిన్న ట్రిక్‌తో ఎయిర్ ప్యూరిఫైయర్‌గా మార్చుకుని, స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యంగా ఉండండి!

Related News

ఫోన్ ఛార్జింగ్ అవట్లేదా? ఈ చిన్న పొరపాట్లే USB పోర్ట్‌ను పాడుచేస్తాయి

ఆస్ట్రేలియాలో రాక్షస సాలీడు.. శాటిలైట్ ఫోటోతో అసలు సంగతి చెప్పేసి నాసా

ఒకప్పుడు భూమిపై అసలు ఆక్సిజనే ఉండేది కాదట, దీని పుట్టక భలే విచిత్రం

స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? డిజిటల్ డిటాక్స్ కోసం ఈ 5 మినీ గ్యాజెట్స్‌ను ట్రై చేయండి!

ఫోన్ వై-ఫై ఆన్‌లో ఉంచుతున్నారా? జాగ్రత్త

రూ.899కే హై-ఎండ్ ఫీచర్లు..బడ్జెట్ ధరలో బేస్ లవర్స్ కోసం పర్ఫెక్ట్

దారి చూపే గూగుల్ మ్యాప్స్ వెనుక ఇంత పెద్ద ప్రమాదం ఉందా? అసలు విషయం ఏమిటంటే..

Big Stories

Advertisement
×