PV Sindhu On Bathukamma celebration: వెండి గిన్నెలతో తయారు చేసిన బతుకమ్మపై విమర్శలు వచ్చిన క్రమంలోనే అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధూ (PV Sindhu). ఆ వెండి బతుకమ్మ వెనుక ఉన్న నిజమేంటో తెలియకుండా మాట్లాడితే, పళ్లు రాలగొడతానంటూ పరోక్షంగా పీవీ సింధూ హెచ్చరించారు. మెట్టినింటికి వస్తున్న క్రమంలో తన అత్తమ్మ సంప్రదాయబద్ధంగా తనకు ఇచ్చిన వెండి బతుకమ్మపై ( Bathukamma celebration) నొటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ‘పూలు పేర్చితేనే బతుకమ్మ అంటారు.. మీ పైత్యాన్ని పండుగపై రుద్దకండి’ అంటూ ఓ నెటిజన్ విమర్శలు చేయగా, పై విధంగా బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధూ రియాక్ట్ అయ్యారు. దీంతో ఈ వెండి బతుకమ్మ పంచాయితీ వివాదంగా మారింది.
డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ నేపథ్యంలో ఈ ఏడాది బతకమ్మ వేడుకలను మిస్ అవుతున్నట్టు పీవీ సింధూ పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలో గతేడాది బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలను పంచుకున్నారు. ఇందులో వెండి గిన్నెలతో తయారు చేసిన బతుకమ్మ పీవీ సింధూ పట్టుకోగా, ఆ ఫోటో వైరల్ అయింది. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. నోటికి ఏది వస్తే అదే మాట్లాడారు. ‘పూలు పేర్చితేనే బతుకమ్మ అంటారు.. మీ పైత్యాన్ని పండుగపై రుద్దకండి’ అంటూ ఓ వ్యక్తి తెగించి కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్ చూసిన పీవీ సింధూకు కోపం వచ్చింది. వెంటనే రియాక్ట్ అయి, అతనికి కౌంటర్ ఇచ్చింది.
తాను పట్టుకున్న వెండి బతుకమ్మ గురించి ఏం తెలియకుండా మాట్లాడొద్దని క్రమంలో బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధూ ఆగ్రహించారు. బతుకమ్మ గురించి తనకు పెద్దగా తెలియదని, తెలంగాణ కోడలిగా అన్ని తెలుసుకుంటున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాంత కోడలిగా కిందటి ఏడాది బతుకమ్మ పండుగలో పాల్గొన్నానని వెల్లడించారు. అదే తనకు తొలి బతుకమ్మ అని, తన వెనక ఉన్న పూల బతుకమ్మను పేర్చడానికి దాదాపు గంట పట్టిందని వెల్లడించారు. ఈ వెండి బతుకమ్మను అత్తయ్య తనకు బహుమతిగా ఇచ్చారని చెప్పారు. ప్రేమతో ఇచ్చిన ఆ బతుకమ్మను ఎలా కించపరుస్తారంటూ అదరిపోయే ఘాటు రిప్లై ఇచ్చారు. తల్లి లాంటి అత్తయ్య ఇచ్చినప్పుడు గౌరవించాలని, ఈ విషయం తెలియకుండా రెచ్చిపోయి కామెంట్స్ పెట్టడం ఆపాలన్నారు. ఏదైనా కామెంట్ చేసే ముందు ఆ సంప్రదాయం వెనుక అర్థాన్ని తెలుసుకోవాలని కౌంటర్ ఇచ్చారు. దీంతో వెండి బతుకమ్మ ఫోటోలపై వచ్చిన కామెంట్స్ కు బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధూ (PV Sindhu) సమాధానం హట్ టాపిక్ అయింది. దీంతో ఆమెకు సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.