How to dry wet laptop: ఈ రోజుల్లో ల్యాప్‌టాప్ అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఆఫీస్ వర్క్, ఆన్‌లైన్ క్లాసులు, ఎంటర్‌టైన్‌మెంట్.. దేనికైనా ల్యాప్‌టాప్ ఉండాల్సిందే. అయితే.. ల్యాప్‌టాప్ వాడుతున్నప్పుడు పక్కనే టీ, కాఫీ, జ్యూస్ లేదా నీళ్ల గ్లాస్ పెట్టుకోవడం మనకు అలవాటు. అనుకోకుండా చేయి తగిలి లిక్విడ్స్ ల్యాప్‌టాప్‌పై పడితే వచ్చే కంగారు అంతా ఇంతా కాదు.ఇలాంటి టైంలో చాలా మంది వెంటనే స్క్రీన్ తడి చేసి, పవర్ బటన్ నొక్కి ఆన్ అవుతుందో లేదో అని చెక్ చేస్తారు. కానీ.. మీరు చేసే అతిపెద్ద తప్పు ఇదే!
ల్యాప్‌టాప్‌లో లిక్విడ్స్ పడినప్పుడు ఆన్ చేయడానికి ముందు.. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఆ టైమ్‌లో ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ల్యాప్‌టాప్‌పై నీళ్లు పడగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ కింది పనులు చేయండి.
వెంటనే పవర్ ఆఫ్ చేయండి: ల్యాప్‌టాప్ ఆన్‌లో ఉంటే.. పవర్ బటన్‌ను 5 సెకన్ల పాటు గట్టిగా నొక్కి పట్టుకుని ఆఫ్ చేయండి.
ఛార్జర్ తీసివేయండి: ఒకవేళ ల్యాప్‌టాప్ ఛార్జింగ్‌లో.. ఉంటే వెంటనే ప్లగ్ తీసేయండి. లేదంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది.
ఇతర గాడ్జెట్లు వేరు చేయండి: మౌస్, పెన్‌డ్రైవ్, కీబోర్డ్, హెడ్‌ఫోన్స్ వంటి అన్ని అటాచ్‌మెంట్లను వెంటనే తీసివేయండి.
తలకిందులుగా పెట్టండి: ల్యాప్‌టాప్‌ను ‘V’ ఆకారంలో (టెంట్ మోడ్‌లో) తిర గేసి, ఒక పొడి క్లాత్ లేదా టిష్యూ పేపర్‌పై పెట్టండి. దీని వల్ల లోపలికి వెళ్లిన నీళ్లు బయటకు వచ్చేస్తాయి.
ఇక అసలు విషయానికి వస్తే.. ల్యాప్‌టాప్‌పై నీళ్లు పడిన తర్వాత దాన్ని మళ్లీ ఆన్ చేయడానికి కనీసం 24 నుంచి 48 గంటల సమయం వెయిట్ చేయాలి.
సాధారణ నీళ్లు పడితే: ల్యాప్‌టాప్ లోపల మదర్ బోర్డ్, ప్రాసెసర్, ర్యామ్ వంటి.. అనేక సూక్ష్మ భాగాలు ఉంటాయి. నీటి బొట్టు ఒక్కటి లోపల ఉన్నా పవర్ ఆన్ చేయగానే.. షార్ట్ సర్క్యూట్ అయి బోర్డ్ కాలి పోతుంది. అందుకే గాలి బాగా ఆడే ప్రదేశంలో.. కనీసం 24 గంటల పాటు దాన్ని ఆర బెట్టాలి.
కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్ లేదా జ్యూస్ : నీటితో.. పోలిస్తే ఇవి చాలా ప్రమాదకరం. వీటిలో చక్కెర, ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఆరిపోయిన తర్వాత కూడా ల్యాప్‌టాప్ లోపలి విడిభాగాలను తినివేస్తాయి. ఇలాంటి స్టికీ లిక్విడ్స్ పడితే.. కనీసం 48 గంటలు ఆర బెట్టడమే కాకుండా, సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడం చాలా మంచిది.
చాలా మంది తొందరపాటులో కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటి వల్ల ల్యాప్‌టాప్ రికవరీ అయ్యే చాన్స్ దెబ్బతింటుంది.
హెయిర్ డ్రైయర్ వాడొద్దు: హెయిర్ డ్రైయర్ నుంచి వచ్చే వేడి గాలి వల్ల ల్యాప్‌టాప్‌లోని ప్లాస్టిక్ భాగాలు, కీబోర్డ్ కీలు కరిగి పోయే ప్రమాదం ఉంది. అంతేకాదు.. డ్రైయర్ గాలి నీటి చుక్కలను లోపలికి వెళ్లేలా చేస్తుంది.
బియ్యం డబ్బాలో పెట్టకండి: ఫోన్ నీళ్లలో పడితే బియ్యంలో.. పెడతారు కదా అని ల్యాప్ టాప్‌ను కూడా బియ్యంలో పెట్టకండి. బియ్యంలో ఉండే చిన్న చిన్న పిండి రేణువులు, ధూళి ల్యాప్ టాప్ ఫ్యాన్లు, పోర్ట్‌లలోకి వెళ్లి మరింత డ్యామేజ్ చేస్తాయి.
ఎండలో ఉంచొద్దు: ఎండలో ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు ఉంచితే డిస్‌ప్లే పాడైపోతుంది.
Also Read: రూ. 40వేలలోపే లగ్జరీ లుక్..ఆఫర్‌లో బెస్ట్ ఫ్రిజ్‌లు
నిర్ణీత సమయం ముగిసిన తర్వాత, ల్యాప్‌టాప్ పూర్తిగా ఆరిపోయిందని మీకు అనిపిస్తే..
1.పవర్ కేబుల్ పెట్టకుండా కేవలం బ్యాటరీతో ఆన్ చేయడానికి ప్రయత్నించండి.
2.ఒకవేళ ఆన్ అయితే.. వెంటనే మీ ముఖ్యమైన డేటాను బ్యాకప్ తీసుకోండి.
3. డిస్‌ప్లే, కీబోర్డ్, వైఫై సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయండి.
4. ఒకవేళ ఆన్ కాకపోతే లేదా ఏదైనా వింత వాసన/సౌండ్ వస్తే వెంటనే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లండి.
ల్యాప్‌టాప్‌పై లిక్విడ్స్ పడటం అనేది ఎవరికైనా జరగొచ్చు. కానీ ఆ సమయంలో కంగారు పడకుండా.. సహనంతో కనీసం 24 నుంచి 48 గంటలు వెయిట్ చేయడం మీ ల్యాప్‌టాప్‌ను, అందులోని విలువైన డేటాను కాపాడుకునే బెస్ట్ ఆప్షన్.