E-Paper
Advertisement

Coolita LED TV: 43 అంగుళాల స్మార్ట్ టీవీపై ఊహించలేనంత డిస్కౌంట్.. రూ.29,999 ధర నుంచి రూ.11,599కి తగ్గింపు!

Coolita LED TV: 43 అంగుళాల స్మార్ట్ టీవీపై ఊహించలేనంత డిస్కౌంట్.. రూ.29,999 ధర నుంచి రూ.11,599కి తగ్గింపు!
Advertisement

Coolita LED TV: కొత్త సంవత్సరం రాబోతున్న సందర్భంగా తక్కువ ధరలో స్మార్ట్‌టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అలాంటి వాళ్లకోసమే Coocaa తన 43 అంగుళాల ఫుల్ HD స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్‌ను ప్రకటించింది. 108 సెం.మీ స్క్రీన్ సైజ్‌తో వచ్చే Coocaa 43C3U Plus మోడల్ ఇప్పడు భారీ ధర తగ్గింపుతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. దాదాపు రూ.30 వేల ధర ఉండే ఈ టీవీ.. ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ.11,599 ధరకే వచ్చేస్తోంది. మరెందుకు ఆలస్యం.. రండి పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం.

ఎక్కడి నుంచైనా చూడొచ్చు:

డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఈ టీవీ 1920 x 1080 పిక్సెల్స్ ఫుల్ HD రిజల్యూషన్‌తో వస్తుంది. 178 డిగ్రీల వరకు విస్తృత వ్యూయింగ్ యాంగిల్ ఉండటంతో ఎక్కడ కూర్చుని చూసినా స్పష్టమైన విజువల్స్ కనిపిస్తాయి. 60Hz రిఫ్రెష్ రేట్, 16:9 ఆస్పెక్ట్ రేషియో కారణంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటం మరింత ఆసక్తికరంగా మారుతుంది.

Advertisement

Also Read: స్మార్ట్‌ఫోన్ ఏ టైమ్‌లో కొనుగోలు చేస్తే డబ్బులు మిగులుతాయి?.. ఈ టిప్‌తో వేలకు వేలు ఆదా!

ఇంట్లోనే థియేటర్ అనుభూతి:

ఇక ఆడియో విషయంలో కూడా Coocaa నిరాశపరచదు. దీనిలో 20W RMS పవర్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ ఆడియో సపోర్ట్‌తో ఇంట్లోనే థియేటర్ లాంటి సౌండ్ అనుభూతిని పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ Coolita ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ప్రముఖ యాప్స్‌కు నేరుగా సపోర్ట్ ఉండటం పెద్ద ప్లస్ అని చెప్పవచ్చు. అలాగే బిల్ట్-ఇన్ Wi-Fi, స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్లు, 4GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఇందులో లభిస్తాయి.

పవర్ సేవింగ్ ఫీచర్:

Advertisement

ఈ టీవీలో కనెక్టివిటీ కోసం రెండు HDMI పోర్ట్స్, ఒక USB పోర్ట్ అందించారు. పవర్ సేవింగ్ విషయంలో కూడా ఈ టీవీ మెరుగ్గా పనిచేస్తుంది. దీనికి 3 స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉంది, స్టాండ్‌బై మోడ్‌లో కేవలం 0.5W మాత్రమే విద్యుత్ వినియోగిస్తుంది. తయారీ లోపాలపై ఒక ఏడాది ఆన్‌సైట్ వారంటీతో పాటు, బ్రాండ్ అథరైజ్డ్ ఇంజనీర్ ద్వారా ఉచిత ఇన్‌స్టాలేషన్, డెమో సౌకర్యం కూడా అందిస్తున్నారు.

అదనపు డిస్కౌంట్లు:

ఒకేసారి కొనలేని వాళ్లకి నో కాస్ట్ EMI ఆప్షన్‌లో నెలకు సుమారు రూ.1,934 చెల్లించి ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. యాక్సిస్, ఎబ్బీఐ, హెడ్‌డీఎఫ్‌సీ, ఐసిఐసిఐ, హెచ్‌ఎస్‌బీసీ, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డులపై క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. అలాగే BHIM, Paytm, MobiKwik వంటి UPI చెల్లింపులపైనా అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే.. తక్కువ బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నవారికి ఈ ఆఫర్ నిజంగా మంచి డీల్‌గా చెప్పొచ్చు.

Also Read: టెక్ ప్రపంచాన్ని షేక్ చేసిన శాంసంగ్.. ప్రపంచంలోనే తొలి 115 ఇంచుల మైక్రో RGB టీవీ లాంచ్!

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×