E-Paper
Advertisement

LPG Gas Cylinder: వంట గ్యాస్ సిలిండర్లు రెడ్ కలర్‌లోనే ఎందుకు ఉంటాయి? మిగతా రంగుల సిలిండర్లు దేనికి వాడతారు?

LPG Gas Cylinder: వంట గ్యాస్ సిలిండర్లు రెడ్ కలర్‌లోనే ఎందుకు ఉంటాయి? మిగతా రంగుల సిలిండర్లు దేనికి వాడతారు?
Advertisement

LPG Gas Cylinder: సాధారణంగా కుకింగ్ గ్యాస్ సిలిండర్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఎరుపు రంగు. మన ఏరియాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి ఇంటి కిచెన్‌లోనూ ఎరుపు రంగు సిలిండర్లే కనిపిస్తుంటాయి. అయితే, ఎప్పుడైనా గమనించారా.. హోటళ్లలో లేదా ఫంక్షన్ హాల్స్ దగ్గర ఉండే సిలిండర్లు వేరే రంగుల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ రంగుల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? మన దేశవ్యాప్తంగా ఎన్ని రకాల సిలిండర్లు ఉన్నాయి? ఏ రంగు సిలిండర్ దేనికి వాడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఎరుపు రంగు సిలిండర్..

మనం రోజూ వంట కోసం వాడే 14.2 కిలోల సిలిండర్ ఎరుపు రంగులో ఉండటానికి ప్రధాన కారణం సేఫ్టీ. సైన్స్ పరంగా చూస్తే రెడ్ కలర్ ప్రమాదానికి సంకేతం. LPG గ్యాస్ చాలా త్వరగా మంటలను అందుకుంటుంది కాబట్టి.. దానిని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడానికి ‘సిగ్నల్ రెడ్’ రంగును వాడతారు. అంతేకాకుండా ఈ ఎరుపు రంగు దూరం నుండి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇండేన్, భారత్ గ్యాస్ లేదా హెచ్‌పి గ్యాస్ కంపెనీలు సామాన్య ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ధరపై ఈ ఎరుపు రంగు సిలిండర్లను సరఫరా చేస్తాయి.

నీలి రంగు సిలిండర్..

Advertisement

చాలామంది హోటళ్లు లేదా రెస్టారెంట్లలో ముదురు నీలం రంగు సిలిండర్లను చూసే ఉంటారు. ఇవి సాధారణంగా 19 కిలోల బరువుతో పెద్దగా ఉంటాయి. ఇంటి అవసరాల కోసం ఇచ్చే సబ్సిడీ గ్యాస్‌ను వ్యాపారాల కోసం అక్రమంగా వాడకుండా ఉండటానికి ప్రభుత్వం ఈ రంగును కేటాయించింది. దీనివల్ల డెలివరీ చేసేవారికీ, అధికారులకూ అది కమర్షియల్ గ్యాస్ అని సులువుగా గుర్తు పట్టడం సాధ్యమవుతుంది. వీటికి ఎలాంటి సబ్సిడీ ఉండదు. అందుకే వీటి ధర ఇంటి సిలిండర్ కంటే ఎక్కువగా ఉంటుంది.

Also Read: వావ్, గ్యాస్ స్టవ్‌లా పనిచేసే ఎలక్ట్రిక్ స్టవ్.. ధర కూడా చాలా తక్కువ!

పసుపు, ఆరెంజ్ రంగులు..

Advertisement

కొన్ని పెద్ద ఫ్యాక్టరీలు లేదా భారీ స్థాయిలో వంటలు చేసే చోట పసుపు లేదా ఆరెంజ్ రంగు సిలిండర్లు కనిపిస్తుంటాయి. ఇవి కూడా కమర్షియల్ కేటగిరీ కిందకే వస్తాయి. 19 కిలోల నుండి 47.5 కిలోల వరకు ఉండే ఈ సిలిండర్లు అత్యంత జాగ్రత్తగా వాడాల్సిన భారీ పరిశ్రమల అవసరాల కోసం వినియోగిస్తారు.

ఇతర రంగుల సిలిండర్లు..

మార్కెట్లో మనకు తెల్లటి రంగులో లేదా నలుపు, ఆకుపచ్చ రంగుల్లో కూడా సిలిండర్లు కనిపిస్తాయి. అయితే ఇవి వంట గ్యాస్ కోసం వాడేవి కావు. తెల్లటి సిలిండర్లలో హాస్పిటల్స్‌లో వాడే ఆక్సిజన్ ఉంటుంది. నలుపు రంగులో నైట్రోజన్ గ్యాస్, ఆకుపచ్చ రంగులో ఇతర సురక్షితమైన వాయువులు ఉంటాయి. పొరపాటున కూడా వీటిని వంట కోసం వాడకూడదు.

కాంపోజిట్ సిలిండర్లు..

ప్రస్తుతం స్టీల్ సిలిండర్ల స్థానంలో ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్‌తో తయారైన కాంపోజిట్ సిలిండర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి బరువు చాలా తక్కువగా ఉంటాయి. తుప్పు పట్టవు కూడా. వీటిలో గ్యాస్ ఎంత ఉందో కూడా బయటి నుండే చూసి తెలుసుకోవచ్చు. ఇవి చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండి, ఆధునిక కిచెన్లకు బాగా సెట్ అవుతాయి. ఈ విధంగా సిలిండర్ల రంగులను బట్టి మనం అవి ఏ అవసరానికి వాడాలి, ఏవి సురక్షితం అనే విషయాలను సులభంగా గుర్తించవచ్చు.

Also Read: అమెజాన్‌లో వాయిస్‌ సెర్చ్ ఫీచర్లతో బెస్ట్ 4K టీవీలు.. చిటికెలో మీకు నచ్చిన కంటెంట్!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×