E-Paper
Advertisement

Blower Electric Chulha: వావ్, గ్యాస్ స్టవ్‌లా పనిచేసే ఎలక్ట్రిక్ స్టవ్.. ధర కూడా చాలా తక్కువ!

Blower Electric Chulha: వావ్, గ్యాస్ స్టవ్‌లా పనిచేసే ఎలక్ట్రిక్ స్టవ్.. ధర కూడా చాలా తక్కువ!
Advertisement

Blower Electric Chulha: తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. చూడటానికి అచ్చం మనం ఇంట్లో వాడే ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్‌లాగే ఉంటుంది. నాబ్ తిప్పగానే నీలి రంగు మంటలు వస్తాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే.. దానికి గ్యాస్ కనెక్షన్ ఉండదు.. సిలిండర్ అవసరం లేదు. కేవలం ఎలక్ట్రిక్ ప్లగ్ ద్వారానే ఇది పనిచేస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. దీన్నే ‘బ్లోయర్ ఎలక్ట్రిక్ చుల్హా’ లేదా ‘జామీ ఎలక్ట్రిక్ స్టవ్’ అని పిలుస్తున్నారు. గ్యాస్ ధరలు మండిపోతున్న ప్రస్తుత నేపథ్యంలో ఈ స్టవ్ మధ్యతరగతి కుటుంబాలకు నిజంగా వరమనే చెప్పాలి.

ఇదెలా పనిచేస్తుందంటే?

చాలామంది ఇది ఇండక్షన్ స్టవ్ అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా వేరు. దీని లోపల ఒక పవర్‌ఫుల్ హీటింగ్ కాయిల్ ఉంటుంది. మనం స్విచ్ ఆన్ చేయగానే ఆ కాయిల్ ఎర్రగా వేడెక్కుతుంది. దీనికి లోపల అమర్చిన ఒక చిన్న ఫ్యాన్ (బ్లోయర్) ఆ వేడిని పైకి నెడుతుంది. ఆ వేడి గాలి ప్రవాహం వల్ల మనకు బయటకు నీలి రంగు మంట కనిపిస్తుంది. ఇది చూడటానికి గ్యాస్ మంటలా ఉన్నా, ఇందులో ఎలాంటి పొగ గానీ, ప్రమాదకరమైన వాయువులు గానీ వెలువడవు.

అన్ని విధాలా ఉపయోగకరమే:

Advertisement

సాధారణ ఇండక్షన్ స్టవ్‌ల మీద అన్ని రకాల గిన్నెలు పెట్టలేము. కానీ ఈ ఎలక్ట్రిక్ స్టవ్ మీద మనం గ్యాస్ స్టవ్‌పై వాడే ఏ గిన్నెనైనా వాడుకోవచ్చు. చపాతీలు కాల్చుకోవడానికి, డీప్ ఫ్రై చేయడానికి ఇది భలే సెట్ అవుతుంది. సిలిండర్ అయిపోతుందన్న భయం లేదు, లీకేజీల టెన్షన్ అసలే ఉండదు. పైగా వంటగది కూడా చాలా నీట్‌గా ఉంటుంది. ముఖ్యంగా బ్యాచిలర్స్‌కు, చిన్న ఫ్యామిలీలకు ఈ యర్ ఎలక్ట్రిక్ చుల్హా బెటర్ ఆప్షన్.

Also Read: ఫ్రిడ్జ్ డోర్ తీయకుండానే కూల్ వాటర్ తాగొచ్చు.. AI టెక్నాలజీతో సరికొత్త రిఫ్రిజిరేటర్ లాంచ్!

ధరెంత, ఎక్కడ దొరుకుతుంది?

Advertisement

ప్రస్తుతానికి ఇవి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ కంటే.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, లోకల్ గ్యాడ్జెట్ షాపుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని ధర రూ.3,000 నుండి మొదలై క్వాలిటీని బట్టి రూ.15,000 వరకు ఉంటుంది. మీరు దీన్ని కొనాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ‘Electric Blower Chulha’ అని వెతికితే బోలెడు వీడియోలు కనిపిస్తాయి. అయితే, కొనేముందు కనీసం ఆరు నెలల వారంటీ ఉందో లేదో చూసుకోవడం ముఖ్యం. తక్కువ కరెంట్ ఖర్చుతో గ్యాస్ స్టవ్ ఫీలింగ్ ఇచ్చే ఈ కొత్త టెక్నాలజీ భవిష్యత్తులో ప్రతి ఇంట్లోనూ ఉండేలా కనిపిస్తోంది.

ముఖ్య గమనిక:

ప్రస్తుతం ఇండియాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత కారణంగా.. సోషల్ మీడియాలో ఇలాంటి స్టవ్స్ ప్రత్యక్షం అవుతున్నాయి. అలాగే వాటిని కొనుగోలు చేసుకొనేందుకు లింక్స్ కూడా ఇస్తున్నారు. అయితే, మీరు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ లింక్స్, వాళ్లు చూపించే వీడియోలు ఫేక్ కూడా కావచ్చు. వాటిని నమ్మి క్లిక్ చేసి డబ్బులు చెల్లిస్తే.. మోసపోతారు. ప్రొడక్ట్ మీ ఇంటికి వచ్చి.. పనిచేస్తుందో లేదో చెక్ చేసుకొనే వరకు ఎలాంటి చెల్లింపులు చేయొద్దు. ఈ కథనం ముఖ్య ఉద్దేశం.. పాఠకులకు ఒక మంచి ప్రొడక్ట్ పరిచయం చెయ్యడమే. కాబట్టి.. సోషల్ మీడియాలో ట్రెండింగులో ఉన్న ఈ స్టవ్స్ వివరాలను మీకు చెబుతున్నాం. ఆయా సంస్థలతో బిగ్ టీవీ లైవ్ వెబ్ సైట్‌కు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి.. వీటిని కొనుగోలు చేసేప్పుడు జాగ్రత్తలు పాటించాలని మనవి.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×